newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

టీకా ప్రారంభ దశలో రాజకీయనేతలు చేయపెట్టొద్దు. మోదీ సూచన

12-01-202112-01-2021 11:03:43 IST
2021-01-12T05:33:43.720Z12-01-2021 2021-01-12T05:33:41.875Z - - 20-01-2021

టీకా ప్రారంభ దశలో రాజకీయనేతలు చేయపెట్టొద్దు. మోదీ సూచన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రారంభ దశలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. తొలిదశలో కరోనా టీకాను 3 కోట్లమందికిపైగా ఆరోగ్య సంరక్ష

మ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మాత్రమే అందిస్తామని, ఇందుకయ్యే ఖర్చును కూడా కేంద్రప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. తొలి దశలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు మినహా ఇతరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవద్దని మోదీ కోరారు.

సోమవారం రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన ప్రధాని మోదీ కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై చర్చించారు. భారత్‌లో కొన్ని నెలల్లోనే 30 కోట్ల మందికిపైగా ప్రజలకు ఈ టీకా ఇస్తామని వెల్లడించారు.

వ్యాక్సిన్‌ అంశంలో సైంటిస్టుల మాటే చివరి మాట అని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని ప్రధాని గుర్తుచేశారు. ప్రజలకు సమర్థవంతమైన వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సైంటిస్టులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే దేశంలో ఉపయోగానికి అనుమతి లభించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తోపాటు మరో నాలుగు కరోనా వ్యాక్సిన్లు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని మోదీ వివరించారు.

మహమ్మారిపై పోరాటంలో మనం ముందంజలో ఉన్నప్పటికీ అజాగ్రత్త ఏమాత్రం పనికిరాదని మోదీ హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషన్‌పై వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రామాణికమైన ప్రొటోకాల్‌ ప్రకారం అందరికీ టీకా ఇస్తారని, తమ వంతు వచ్చేవరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు.

తొలి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పారామిలటరీ సిబ్బంది, హోంగార్డులు, విపత్తు నిర్వహణ స్వచ్ఛంద కార్యకర్తలు, సైనిక జవాన్లు, సంబంధ రెవెన్యూ సిబ్బందికి టీకా అందుతుందని, వీరంతా కలిపి 3 కోట్ల మందికిపైగా ఉంటారని ప్రధాని మోదీ తెలిపారు. టీకా అవసరమైన వారు నమోదు చేసుకోవడానికి. కో–విన్‌ అనే డిజిటల్‌ వేదిక ఏర్పాటు చేశామన్నారు.

టీకా తొలిడోస్‌ తీసకున్నాక వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుందని, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో ఈ సర్టిఫికెట్‌ అప్రమత్తం చేస్తుందని వివరించారు. సైంటిస్టులు, నిపుణుల సూచనల ప్రకారం కరోనా టీకా ఇవ్వాల్సిన ప్రాధాన్యతా జాబితాను రూపొందిస్తామని చెప్పారు.

హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి కరోనా టీకా ఇచ్చిన తర్వాత 50 ఏళ్ల వయసు దాటిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన వారిని గుర్తించడానికి చివరిసారిగా జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్‌ జాబితాను ఉపయోగించుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

హెర్డ్ ఇమ్యూనిటీ అలాగైతేనే సాధ్యం... హర్ష వర్ధన్

టీకా ప్రారంభ దశలో రాజకీయ నాయకులు చేయి పెట్టొద్దని, ఆ కార్యక్రమంలో పాల్గొనవద్దని ప్రధాని విస్పష్ట ప్రకటన చేయడానికి తగిన కారణం ఉంది. తొలి దశ కరోనా వ్యాక్సినేషన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి ప్రజా ప్రతినిధులు భాగం పంచుకోవడానికి అనుమతించాల్సిందిగా హర్యానా ప్రభుత్వం కేంద్రాన్ని గత నవంబర్ 24నే అభ్యర్థించింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ అప్పట్లో చేసిన ఈ అభ్యర్థనపై ప్రధాని ఆప్పట్లో స్పందించలేదు. తర్వాత రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిలి విజి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు కానీ దానికి కూడా కేంద్రం స్పందించలేదు.

గత గురువారం రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్ష వర్ధన్ భేటీలోనూ బీహార్, ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రులు మరోసారి ఇదే డిమాండ్ చేశారు. పంచాయితీల నుంచి పార్లమెంటు సభ్యులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగానే భావించి వారికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని వీరు కోరారు.

దీనికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమాధానమిస్తూ దేశంలోని ప్రతి ఒక్కరినీ తొలి దశ వ్యాక్సినేషన్ కోసం పరిగణించలేమని చెప్పారు. లభ్యమవుతున్న కరోనా డోసుల ప్రాతిపదికన చూస్తే ఒకేసారి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వలేమన్నారు. అందుకే ప్రాధాన్య బృందాలను మాత్రమే తొలి దశలో ఎంచుకున్నామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు వంటి విశాల ప్రజా బృందాలకు తొలిదశ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనిద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ కూడా సాధ్యమై కరోనాను నిరోధించవచ్చని కేంద్రం భావిస్తోంది.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   2 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   3 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   5 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   7 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   7 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   7 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   10 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   11 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   13 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle