newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

హైదరాబాద్ టు ముంబై.. విద్యుత్ కోతలే కోతలు

13-10-202013-10-2020 10:57:32 IST
2020-10-13T05:27:32.692Z13-10-2020 2020-10-13T05:07:33.789Z - - 25-10-2020

హైదరాబాద్ టు ముంబై.. విద్యుత్ కోతలే కోతలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత శనివారం హైదరాబాద్‌లో మూడుగంటలపాటు కురిసిన కుంభవృష్టి కారణంగా గత మూడురోజులుగా హైదరాబాద్ నగరంలో విపరీతంగా విద్యుత్ కోతలు చోటుచేసుకుని జనం పడరాని తిప్పలు పడ్డారు. కొన్ని గంటలు వాన కురిస్తేనే విద్యుత్ వ్యవస్థలు మహానగరాల్లోనే కుప్పగూలిపోతున్న సందర్భాలు ప్రతి వర్షా కాలంలోనూ చూస్తున్నదే. ఆదివారం, సోమవారాల్లో కూడా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వాన రాకడ పోకడ చందాన విద్యుత్ సరఫరా గంటల కొద్దీ నిలిచిపోవడం జనం అనుభవంలోకి వచ్చిన విషయమే.. 

ఒక హైదరాబాద్ అనే కాదు దేశంలోని మహానగరాలన్నీ కాస్త అధిక వర్షం కురిస్తే చాలు మొట్టమొదటి దెబ్బ విద్యుత్ సరఫరాపైనే పడుతుండటం సంవత్సరాలుగా చూస్తున్నదే. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో విశ్వనగరాల గురించిన ప్రచారాలు గాల్లో కలిసిపోయాయా అనిపిస్తుంది.

తాజాగా దేశ ఆర్థిక, వాణిజ్య రాజధానిగా చెప్పుకునే ముంబై మరో చిత్రమైన సమస్యకు గురై విద్యుత్ వెలుగులకు గంటలపాటు దూరమైపోయింది. సోమవారం నిరంతర విద్యుత్ అంతరాయంతో ముంబై స్తంభించిపోయింది. సోమవారం ఉదయం 10 గంటలపుడు సంభవించిన ఈ పరిణామంతో లోకల్‌ రైళ్లు ఎక్కడివక్కడే ఆగాయి. భవనాల్లో లిఫ్టులు మధ్యలోనే ఆగిపోయాయి.

కోవిడ్‌ కారణంగా ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానంలో లక్షలాది మంది ఇళ్లలో ఉండి అందించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్, ఇతర అత్యవసర రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల కోసం డీజిల్‌ జనరేటర్‌లను యంత్రాంగం తరలించాల్సి వచ్చింది.  యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటలకు సేవలను క్రమక్రమంగా పునరుద్ధరించగలిగింది.

ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యుత్, తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యుత్‌ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశమై, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్‌ అంతరాయం ఘటనపై తక్షణం పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. 

మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ(ఎంఎస్‌ఈటీసీఎల్‌)కు చెందిన కల్వా– ఖర్ఘార్‌ సబ్‌స్టేషన్లలో మెయింటెనెన్స్‌ పనులు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల సమయంలో అంతరాయం ఏర్పడిందని విద్యుత్‌ మంత్రి నితిన్‌ తెలిపారు. లోడ్‌ భారమంతా మోస్తున్న రెండో సర్క్యూట్‌లో లోపం తలెత్తడమే ఇందుకు కారణమన్నారు.

కల్వా సబ్‌స్టేషన్‌ వరకు విద్యుత్‌ను తీసుకువచ్చే బాధ్యత రాష్ట్ర విద్యుత్‌ సంస్థది కాగా, అక్కడి నుంచి టాటా, అదానీ సంస్థలు నగరానికి సరఫరా చేస్తుంటాయన్నారు. ముంబైతోపాటు సబర్బన్‌లోని థానే, పన్వెల్, డోంబివిలి, కల్యాణ్‌లో విద్యుత్‌ అంతరాయం తలెత్తింది. కంపెనీలు, సంస్థల్లో మాదిరిగా బ్యాక్‌–అప్‌ సౌకర్యం లేని ఇళ్లలోని లక్షలాది మంది ఉద్యోగుల ‘వర్క్‌ ఫ్రం హోం’ సేవలకు తీవ్ర అవరోధం కలిగింది. 

ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయడంతో కోవిడ్‌ వైద్య కేంద్రాల్లోని వారి కోసం డీజిల్‌ జనరేటర్లను, సినిమా షూటింగ్‌ల కోసం వాడే మొబైల్‌ డీజిల్‌ జనరేటర్లను తెప్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పని చేయించేందుకు ఏర్పాటు చేసిన రెండు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఒకటి పనిచేయడం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని ఓ అధికారి వివరించారు.

ముంబైలో చీకట్లో బ్యాటరీ సాయంతో అమ్మకాలు సాగిస్తున్న మహిళను చూడటం నగరవాసులకు వింత అనుభవం. 2 గంటల తర్వాత పాక్షికంగా సరఫరా పునరుద్ధరణ జరిగినప్పటికీ విశ్వ మహానగరాల ప్రమాణాలకు మన మహానగరాలు ఎంత దూరంలో ఉంటున్నాయో స్పష్టమైంది.

ముంబైలో విద్యుత్ సరఫరా స్తంభనకు మీరు కారణమంటే మీరు కారణమంటూ బెస్ట్ ఎలెక్ట్రిక్, అదానీ ఎలెక్ట్రిసిటీ తదితర సంస్థలు పరస్పరం ఆరోపణలకు దిగాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle