ఎవరీ ఆజాద్.. మోడీని కంటతడి పెట్టించేంత ఏముంది?!
12-02-202112-02-2021 14:51:13 IST
Updated On 12-02-2021 14:55:54 ISTUpdated On 12-02-20212021-02-12T09:21:13.383Z12-02-2021 2021-02-12T03:35:19.639Z - 2021-02-12T09:25:54.313Z - 12-02-2021

మొండి మనిషి.. దేన్నైనా తట్టుకునే మనిషి.. కొండంత గుండె గల మనిషి.. మోడీ సారు.. ఏడ్చారు. బోర్డర్ లో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినా.. ఎంత మంది సైనికులు చనిపోయినా.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఆడ పిల్లలపై అత్యాచారాలు దారుణంగా జరుగుతున్నా.. ఏనాడూ కంట తడి పెట్టని మోడీ సారు ఏడ్చారు. అంటే మామూలు విషయమా చెప్పండి. అంత ఎమోషనల్ బాండింగ్ ఏంటి. గులాంనబీ ఆజాత్ తో మోడీకి ఉన్న అనుబంధం ఏంటి. పార్లమెంట్ లో ఏడ్చేంత ప్రేమ ఏంటి. అసలు ఆ ఆజాద్ స్పెషల్ ఏంటి. ఇలా ఎన్నో మాటలు. ఆజాద్ గొప్పతనం తెలుసుకోవాలనే దానికంటే.. మోడీ ఏడ్చారంటే ఏదో ఉండే ఉంటుంది కాబట్టి తెలుసుకోవాలి అనుకునే వాళ్లే ఎక్కువ మంది. అపొనెంట్ పార్టీ లీడర్ కోసం మోడీ భావోద్వేగానికి గురి కావడంతో ఇంకా సర్చింగ్ లోనే ఉంది గూగుల్. ఆ గూగుల్ కి జనాలు ఏ మాత్రం రెస్ట్ ఇవ్వడం లేదు. అవును నిజమే.. గులాం నబీ ఆజాద్ ఇప్పటి లీడర్ కాదు. యూనివర్సిటీ నుంచి బయటికి వస్తూనే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1980లోనే.. ఎంపీగా గెలిచి.. కేంద్రమంత్రిగా పదవి దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆజాద్ కి ఎక్కడా మచ్చ లేదు. పార్టీ లీడర్ గా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూనే జనం నేతగా ఎదిగారు. అంతే కాదు.. ప్రతి పక్షాలను.. అపొజిషన్ పార్టీలను కలుపుకుని వెళ్లడంలో స్పెషలిస్టుగా ఆజాద్ పేరు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా.. వాటిని సాల్వ్ చేయడంలో ఆజాద్ స్పెషలిస్ట్. మొన్నా మధ్య కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినా.. పార్టీ పడిపోతున్న టైంలో కాపాడాలనే ప్రయత్నంగానే విమర్శించారు అనుకున్నారే తప్ప.. ఎవరూ నెగటివ్ గా అనుకోలేదు. అదీ తన నిజాయితీ. ప్రతిదీ పార్టీ మేలు, ప్రజల మేలు కోసం చేసే లీడర్ గా పేరు తెచ్చుకున్నారు ఆజాద్. జమ్ము కశ్మీర్ ఏరియాలోని ఓ చిన్న గ్రామంలో మొదలైన ఆజాద్ ప్రయాణం.. ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రిగా.. ఎంపీగా ఎన్నో ఏళ్ల ప్రయాణం. తన రాజకీయ ప్రయాణం మొదలైనప్పటి నుంచి నిన్న మొన్నటి వరకూ ఎప్పుడూ ఏదో ఒక పదవిలో ఉంటూనే ఉన్నారు. బోర్డర్ ఇష్యూస్ వచ్చిన టైంలో కూడా.. ఆజాద్ డీలింగ్ వేరేలా ఉంటుంది. కశ్మీర్ లో ఓ సారి ఉగ్రదాడి జరిగి.. అక్కడ గుజరాత్ వారు ఇరుక్కుపోయినప్పుడు ఆజాద్ ఎంత చాక చక్యంగా వ్యవహరించి సాయం చేశారో తనకి ఇంకా గుర్తుంది అంటూ మోడీ కొనియాడారు. రాజ్యసభలో తన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా.. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు మోడీ. ఆ టైంలోనే.. ఆజాద్ గురించి మాట్లాడినంత సేపు భావోద్వేగానికి గురయ్యారు మోడీ.

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
34 minutes ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
an hour ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
2 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
2 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
4 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
3 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
16 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
18 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
a day ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago
ఇంకా