newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

ఇల్లు అద్దెకు కావాలన్నా సిండికేట్‌కు డబ్బు చెల్లించాల్సిందే.. మమతపై మోదీ పైర్

23-02-202123-02-2021 12:04:50 IST
2021-02-23T06:34:50.948Z23-02-2021 2021-02-23T06:34:48.841Z - - 04-03-2021

ఇల్లు అద్దెకు కావాలన్నా సిండికేట్‌కు డబ్బు చెల్లించాల్సిందే.. మమతపై మోదీ పైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో అన్ని రంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలో సిండికేట్ రాజ్యం నడుస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన ఈ సిండికేట్‌కి డబ్బు చెల్లించకుంటే సామాన్యులకు కూడా ఏ పనీ కావడం లేదన్నారు. చివరకు ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా.. ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా కట్‌ మనీ ఇవ్వాల్సిందే. సిండికేట్‌ అనుమతి లేకుండా ఏ పనీ కాదు అని మోదీ విమర్శించారు. 

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు పెంచారు. సురక్షిత తాగు నీటిని అందించే కేంద్ర ప్రభుత్వ ‘జల్‌జీవన్‌’ పథకాన్ని కూడా రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయకుండా రాష్ట్రంలోని మహిళలను ఇబ్బందులు పెడ్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. 

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలుకాకుండా అడ్డుకుని రైతులకు, పేదలకు వాటి ప్రయోజనాలు లభించకుండా చేశారని ఆరోపించారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రముఖులను, సాంస్కృతిక వారసత్వాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

వందేమాతరం గేయరచయిత బంకిమ్ చంద్ర చటోపోధ్యాయ్ నివసించిన ఇల్లు ప్రస్తుతం దీనావస్థలో ఉందని నేనువిన్నాను. బానిసత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటానికి కొత్త జీవితాన్ని కల్పించిన మహనీయుడి ఇల్లు ప్రస్తుతం ఆదరణలేక నిర్లక్ష్యానికి గురవుతోంది అని మోదీ విచారం వ్యక్తం చేశారు. సాంస్కృతిక పరంగానే కాదు పశ్చిమబెంగాల్‍‌ పారిశ్రామికాభివృద్దిని కూడా మమత ప్రభుత్వం విస్మరిస్తోందని మోదీ విమర్శించారు.

ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రజలు నిజమైన మార్పును కోరుకుంటున్నారు. కొంతమందిని బుజ్జగించడం కాకుండా రాష్టంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి త్వరలో ఏర్పడే బీజేపీ ప్రభుత్వం  కంకణం కడుతుందని మోదీ చెప్పారు. కట్ మనీ సంస్కతి పోనంతవరకు  పశ్చిమబెంగాల్ అబివృద్ధి చెందటం అసాధ్యమమని మోదీ తేల్చి చె్ప్పారు.

హూగ్లీ జిల్లాలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ పర్యటన సందర్భంగా నొవాపాడా నుంచి దక్షిణేశ్వర్‌ వరకు మెట్రో రైలు ఎక్స్‌టెన్షన్‌తో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. స్వయం సమృద్ధ భారత్‌కు పశ్చిమబెంగాల్‌ చాలా కీలకమైన కేంద్రమని ప్రధాని పేర్కొన్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle