ఢిల్లీ మెట్రో రైల్ రూపకర్త శ్రీధరన్ బీజేపీలో చేరిక.. కాంగ్రెస్ ప్రశంస
19-02-202119-02-2021 10:04:16 IST
2021-02-19T04:34:16.289Z19-02-2021 2021-02-19T04:34:13.625Z - - 09-03-2021

ఢిల్లీ మెట్రో రైల్ రూపకర్త, ప్రస్తుతం దాని ముఖ్య సలహాదారు ఇ. శ్రీధరన్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. కేరళలోని కేసర్ గోడ్ నుంచి రాష్ట్ర వ్యాప్త విజయయాత్రను ప్రారంభించనున్న సందర్భంలో ఫిబ్రవరి 21న కేరళ బీజేపీ శాఖలో శ్రీధరన్ చేరనున్నారని కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ తెలిపారు. ఢిల్లీ మెట్రో రైలును ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో రైల్ వ్యవస్థగా తీర్చి దిద్దిన మేటి ఇంజనీర్ ఇ. శ్రీధరన్ రాజకీయాల పట్ల తన వైఖరి పూర్తి భిన్నంగా ఉంటుంది చెప్పారు. కేరళలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని బీజేపీ కోరితే సిద్ధంగా ఉంటానని చెప్పారు. ప్రస్తుతం కేరళలో ఉంటున్న 88 ఏళ్ల శ్రీధరన్ కేరళలో తాను అనేక ప్రభుత్వాలను చూసానని, యూడీఎఫ్, ఎల్డీఎఫ్లు అధికారంలోకి వచ్చినప్పటికీ సంవత్సరాలుగా వారు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కేరళలో ప్రాజెక్టులు చాలా ఆలస్యంగా సాగుతున్నాయి. అవినీతి ఆకాశాన్నంటింది, సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతున్న పార్టీలే లబ్ధి పొందుతున్నాయని శ్రీధరన్ ఆరోపించారు. పైగా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య ఉండటం లేదని దీనివల్ల రాష్ట్రం నష్టపోతుండగా, రాజకీయ పార్టీలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయని చెప్పారు. కేరళలో మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శ్రీధరన్ బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. కారణం కూడా స్పష్టంగానే చెప్పారాయన. పదవీవిరమణ అనంతరం గత పదేళ్లలో వేరువేరు ప్రభుత్వాలను చూశాను. వారు ప్రజల కోసం చేయవలసింది చేయడంలేదు. నా అనుభవంతో నా వంతు కృషిచేయడానికి బీజేపీలో చేరుతున్నాను అని శ్రీధరన్ చెప్పారు. నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి తాను బీజేపీ సానుభూతిపరుడిగా ఉంటూ వస్తున్నానని శ్రీధరన్ చెప్పారు. కేరళ వరకు చూస్తే కాంగ్రెస్, వామపక్ష కూటమి ప్రభుత్వాలు విఫలమైన చోట, బీజేపీ కచ్చితంగా ఫలితాలను తీసుకొస్తుందని నా నమ్మకం. బీజేపీ మాత్రంమే దేశహితం, రాష్ట్ర హితం కోరి పాలిస్తుందని శ్రీధరన్ పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ నిర్మాణం పూర్తయ్యాక కేరళలోని పొన్నేరి జిల్లా మలప్పురంలో శ్రీధరన్ నివాసం ఏర్పర్చుకున్నారు. 1990లలో ప్రతిష్టాత్మకమైన కొంకణ్ రైల్వేప్రాజెక్టున ఏడేళ్లలోపు పూర్తి చేయడంతో శ్రీధరన్ పేరు మార్మోగిపోయింది. కేంద్రలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని శ్రీధరన్ చెప్పారు. ఏ పార్టీలో చేరినా.. శ్రీధరన్ వంటి మేధావులు రాజకీయాలకు అవసరం.. మిలింద్ దేవరా మరోవైపన త్వరలోనే బీజేపీలో చేరుతున్న శ్రీధరన్పై కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా ప్రశంసలు కురిపించడం మరింత సంచలనం గొల్పింది.. ఆయన గొప్ప మేధావి అని, అలాంటి వారే నేటి దేశ రాజకీయాలకు అత్యంత ఆవశ్యకమని మిలింద్ పేర్కొన్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి శ్రీధరన్ వస్తున్నారు. దీనికి మద్దతు తెలపడానికి కేవలం బీజేపీ సభ్యుడే కావాల్సిన అవసరమేమీ లేదు. ఆయనో ప్రొఫెషనల్. మేధావి. ఇంజనీరింగ్ రంగంలో మేధావి. ఆయన దేశ ప్రజలందరికీ కావాల్సిన వారు. రాజకీయాలకు అలాంటి వ్యక్తుల అవసరమే ఉంది అంటూ దేవరా ట్వీట్ చేశారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా