మోడీ ఉంటే నేను రాను..
08-02-202108-02-2021 08:53:37 IST
Updated On 08-02-2021 11:30:32 ISTUpdated On 08-02-20212021-02-08T03:23:37.900Z08-02-2021 2021-02-08T03:02:14.593Z - 2021-02-08T06:00:32.643Z - 08-02-2021

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పీఎం మోడీకి మధ్య ఉప్పు నిప్పేస్తే మండినట్లే ఉంది ఎవ్వారం. మమతా బెనర్జీ గురించి తెలిసిందే కదా. ఏదైనా సూపర్ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటారు. మొన్నీ మధ్య కూడా మోడీ సభలో.. బహిరంగంగానే అసహనం వ్యక్త పరచి వెళ్లిపోయారు. తాను మాట్లాడుతున్న టైంలో.. జై శ్రీరాం జై శ్రీరాం అంటూ జనాలు అరవడంతో ఆమె డిసప్పాయింట్ అయ్యారు. తన స్పీచ్ ను అడ్డుకుని తనను అవమాన పరిచారు అని ఫీలయ్యారు. మరోసారి మోడీ రాబోతున్న వేళ.. ఎట్టి పరిస్థితుల్లో తాను రానని తేల్చేశారు మమతా బెనర్జీ. తాను పీఎం అయినా.. వచ్చేది లేదన్నారట. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. మామూలుగా అయితే.. వెస్ట్ బెంగాల్ లో ఎన్నికల టైం వచ్చింది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉంటాయి. మమత కంచుకోటని బ్రేక్ చేసి.. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ జెండా ఎగరేయాలని చూస్తోంది ఆ పార్టీ. అందుకే.. సీనియర్ లీడర్లు.. ఫేమ్ ఉన్న లీడర్లు అంతా వెస్ట్ బెంగాల్ లో పర్యటిస్తూ ఉన్నారు. అమిత్ షా, మోడీ కూడా మాటి మాటికీ వెళ్లొస్తూనే ఉన్నారు. గ్రామస్థాయిలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపి.. వచ్చే ఎన్నికల్లోగా ఎలాగైనా.. సీఎం సీటు దక్కించుకోవాలని వెస్ట్ బెంగాల్ పై ఫోకస్ చేసింది బీజేపీ. ఇక అంతటితో ఆగకుండా.. తృణమూల్ కాంగ్రెస్ లీడర్లని.. ఎమ్మెల్యేలని.. ఎమ్మెల్యే అయ్యే పవర్ ఉన్న లీడర్లని తమ పార్టీలో కలుపుకుంటోంది బీజేపీ. దీనిపై కూడా మమతా బెనర్జీ సీరియస్ గానే ఉన్నారు. అయితే.. ఇకపై తృణమూల్ కాంగ్రెస్ వాళ్లని తమ పార్టీలో కలుపుకోబోం అని కూడా.. బీజేపీ వాళ్లు స్టేట్ మెంట్ ఇచ్చారు కదా. అయినా అవి పై మాటలే అనేది ఆమె ఇంటెన్షన్. రెండు పార్టీలకీ మధ్య ఏ మాత్రం ఫ్రెండ్షిప్ లేదు. ఇక మోడీని కూడా ముందునుంచీ లెక్కజేసే మనస్తత్వం కాదు మమతా బెనర్జీది. అందుకే.. దూరం దూరంగా ఉంటారు. సభలో ఆమె ప్రవర్తన కూడా మోడీకి నచ్చనట్లే ఉంటుంది అనే పాయింట్ హాట్ టాపిక్కే కదా. అలా ఉంది ఎవ్వారం.

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
7 minutes ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
an hour ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
an hour ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
2 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
15 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
17 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago

జగన్ కి పాలన రాదు అనే మాటకి నిదర్శనాలు ఇవేనా
19 hours ago
ఇంకా