వీల్ చైర్ లో నుండి కష్టంగా లేచి నిలబడ్డ మమతా బెనర్జీ.. కారణమేమిటంటే..!
31-03-202131-03-2021 21:20:53 IST
Updated On 31-03-2021 17:39:57 ISTUpdated On 31-03-20212021-03-31T15:50:53.678Z31-03-2021 2021-03-31T05:21:07.212Z - 2021-03-31T12:09:57.133Z - 31-03-2021

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారాన్ని నిలబెట్టుకోడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆమె వీల్ ఛైర్ లో ఉంటూనే ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా మమతా బెనర్జీ ఒక్కసారిగా వీల్ చైర్ లో నుండి లేచి నిలబడ్డారు. అందుకు కారణం ఏమిటో తెలుసా..? భారత జాతీయ గీతం వినిపించడమే..! జాతీయ గీతం వినిపించినప్పుడు మనం తప్పకుండా లేచి నిలబడతాం.. కానీ వీల్ చైర్ లో నుండి లేవడం అంటే కాస్త కష్టమే..! కానీ మమతా బెనర్జీ నొప్పిని భరిస్తూ వీల్ చైర్ లో నుండి లేచి నిలబడ్డారు. ఎన్నికల ప్రచారంలో జాతీయగీతం వినిపిస్తుంటే, వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డారు. ఆమె నిలబడేందుకు సహాయకులు సాయపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ కీలకంగా మారింది. గతంలో తనతో పాటు ఉండి, ఆపై బీజేపీలో చేరిన సువేందు అధికారిపై మమత ఇక్కడ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశ పోలింగ్ ప్రచారం మంగళవారంతో ముగిసింది. నందిగ్రామ్ నుంచి నామినేషన్ వేసేందుకు వెళ్లిన వేళ, మమతా బెనర్జీ కాలికి గాయం కాగా, అప్పటి నుంచి ఆమె వీల్ చైర్ లో కూర్చుని పర్యటిస్తూనే ఉన్నారు. పలు ర్యాలీల్లో, పాదయాత్రల్లోనూ ఆమె వీల్ చైర్ పైనే కనిపించారు. మమత నిర్వహించిన ఎన్నికల సభలో చివరగా జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మమత తన సిబ్బంది సాయంతో వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డారు. జాతీయ గీతం ఆలపించిన తర్వాత తిరిగి వీల్ చైర్లో కూర్చున్నారు మమత. ఇక్కడ మమతా బెనర్జీ, సువేందు అధికారి నుంచి గట్టి పోటీని ఎదుర్కోక తప్పదని ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో వామపక్ష ప్రభుత్వం ఉన్న వేళ, నందిగ్రామ్ లో ఓ సంస్థ వాహన తయారీ పరిశ్రమ పెట్టేందుకు సిద్ధపడితే, మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు అప్పట్లో చేసిన పోరాటానికి క్షేత్ర స్థాయిలో నాయకత్వం వహించింది సువేందు అధికారే. ఆపై ఆయనే అక్కడి నుంచి తృణమూల్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
11 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
21 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా