newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

బెంగాల్‌లో భారీ పోలింగ్ పెరిగిన అంచనాలు.. గెలుపు నాదే దీదీ

02-04-202102-04-2021 17:07:15 IST
2021-04-02T11:37:15.173Z02-04-2021 2021-04-02T10:05:48.254Z - - 27-07-2021

బెంగాల్‌లో భారీ పోలింగ్ పెరిగిన అంచనాలు.. గెలుపు నాదే దీదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమబెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో దాదాపు 81 శాతం ఓటింగ్ నమోదు కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు గెలుపు అంచనాలు క్షణక్షణానికీ పెరిగిపోతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఈ స్థాయిలో ఓటర్లు పోటెత్తడంతో అటు అధికార పార్టీ, ఇటు బీజేపీ గెలుపు తమనేనంటూ ధీమా ప్రకటిస్తున్నాయి.

అందరూ ఊహించినట్లే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, బీజేపీ తరపున పోటీచేస్తున్న ఆమె ఒకనాటి అనుయాయి సువేందు అధికారి హోరాహోరీగా తలపడ్డ నందిగ్రామ్ నియోజకవర్గంలో హింసా విద్వంసాలు చెలరేగాయి. ముఖ్యమంత్రి మమత ఒక పోలింగ్ కేంద్రానికి వచ్చి రెండు గంటల పాటు అక్కడే ఉండి గవర్నర్‌కు బీజేపీ దౌర్జన్యం, హింస గురించి ఆరోపించారంటే మమత నంద్రిగామ్‌లో ఎన్నికలను ఎంత తీవ్రంగా తీసుకున్నారో అర్థమవుతుంది.

గురువారం మధ్యాహ్నం వరకూ తన నివాసం నుంచే పోలింగ్ పరిస్థితిని సమీక్షించిన సీఎం మమత.. తన నియోజకవర్గంలోని బోయల్‌ అనే గ్రామంలో గొడవ జరుగుతుండడంతో అక్కడికి వెళ్లారు. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లనివ్వడం లేదనీ, కేంద్రాలను బీజేపీ కార్యకర్తలు స్వాధీనపరుచుకుని రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని, టీఎంసీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో ఆమె వెళ్లారు. వీల్‌చెయిర్‌లోనే బూత్‌ నెంబర్‌ 7 బయట మమత బైఠాయించారు. 

మమత స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి రెండు గంటలపాటు ఉండిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ కేంద్రం నుంచే మమత పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్ ధన్‌కర్‌కి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఇక్కడ పరిస్థితి చేజారింది. శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రజలు రాజ్యాంగ హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. మీరు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఇది అక్రమం అని మమత గవర్నరుకి ఫిర్యాదు చేశారు. 

బీజేపీ కేంద్ర నాయకత్వం ఎన్ని జిమ్మిక్కులు ప్రదర్శించినా గెలుపు నాదే. ఆ విషయంలో ఎలాంటి ఆందోళనా లేదు. కానీ ప్రజాస్వామ్యం గురించే నా తపన అంతా అని దీదీ పేర్కొన్నారు. ఎన్నికల్లో దౌర్జన్యాల గురించి 63 ఫిర్యాదులు చేస్తే ఒక్కదానిపై కూడా ఎన్నికల కమిషన్ ఇంతవరకు చర్య తీసుకోలేదని, కచ్చితంగా దీనిపై కోర్టు కెళతామని మమత తేల్చి చెప్పారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్న కళ్లు మూసుకుని కూర్చున్న ఈసీ, బీజేపీ నాయకత్వాలకు సారీ చెబుతున్నా.. ఎందుకంటే మీరెన్ని నాటకాలాడినా గెలుపు నాదే.. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకోసం కాస్త మీ గూండాలను అదుపు చేయండి అంటూ మమత అమిత్ షాను ఎద్దేవా చేశారు.

మరోవైపు మమత వాదనను ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి కొట్టిపడేశారు. ఉదయం ఏడున్నర గంటలకే వెళ్లి తన ఓటుహక్కు వినియోగించుకున్న ఆయన తాను భారీ మెజారిటీతో గెలుస్తున్నట్లు చెప్పారు. రిగ్గింగ్‌ తమ సంస్కృతి కాదన్నారు. 2019 ఎన్నికల్లో మమత అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. మరోవైపు నందిగ్రామ్‌ ఘటనలపై నివేదిక పంపాలని బెంగాల్‌ సీఈవోను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 

పులిలా పోరాడిన దీదీకే మరోసారి పగ్గాలు..

బెంగాల్ ఎన్నికలను యావద్దేశం ఆసక్తిగా పరిశీలిస్తోందని ఇప్పుడు జరుగబోయే కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం శాసనసభ ఎన్నికలు జాతీయ రాజకీయాలను నిర్ణయించనున్నానయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కన్నారు. ఈ సారి ఎన్నికల్లో మమత పులిలా పోరాడందని, ఆమె విజేతగా అవతరించడం ఖాయమని వ్యాఖ్యానించారు. బెంగాల్‌ ఎన్నికలను దేశం మొత్తం పరిశీలిస్తోందని, ప్రజలు కూడా తెలివైనవారేనని ఎంపీ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మహాభారతం కంటే భయంకరంగా ఉన్నాయని రౌత్ ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఫ్రంట్ ఏర్పరుద్దామంటూ మమతా బెనర్జీ రాసిన లేఖ తమ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి అందిందని, ఎన్నికల తర్వాత ఈ అంశంగురించి, పొత్తుల గురించి చర్చించే అవకాశం ఉదని శివసేన ఎంపీ పేర్కొన్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle