తుపాకులకు ఎదురొడ్డి పోరాడాను.. ఎలుకలతో పోరుకు భయపడం.. మమత
22-02-202122-02-2021 13:38:08 IST
2021-02-22T08:08:08.181Z22-02-2021 2021-02-22T08:08:05.678Z - - 09-03-2021

జైలుకు పంపిస్తామని, ఇంకేదో చేస్తామని తనను బెదిరించాలని చూస్తే భయపడనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. పైగా తుపాకులకు ఎదురొడ్డి పోరాడిన తాను ఎలుకలతో పోరాడటానికి అసలు భయపడనని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ మేనల్లుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదివారం నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఇలాంటి బుడ్డ బెదిరింపులు తననేమీ చేయలేవని మమత తిప్పికొట్టారు. జైలుకు పంపిస్తామంటూ మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నించవద్దు. మేం తుపాకులకు ఎదురొడ్డి నిలిచి పోరాడం. ఎలుకలతో పారాడటానికి భయపడం అంటూ బీజేపీని ఉద్దేశించి మమత హెచ్చరించారు. తన బొందిలో ప్రాణమున్నంతవరకు, ఎలాంటి బెదిరింపులకూ తలవంచనని మమత బెనర్జీ స్పష్టం చేశారు. 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సవాలును ఎదుర్కొందాం. ఎవరికి ఎంత బలముందో చూసుకుందాం. 2021లో ఒక్క ఆట మాత్రమే ఉంటుంది. నేను గోల్ కీపర్‌గా ఉంటాను, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూడాలనుకుంటున్నాను అని బెనర్జీ సవాలు విసిరారు. ఓటమిని ఇంతవరకు మేము చూడలేదు. ఓటమి గురించి నేర్చుకోలేదు కూడా. వాళ్లు మమ్మల్ని ఓడించలేరు. అంత సత్తా వారికి లేదు అని మమత ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదివారం నోటీసు జారీ చేసింది. బొగ్గు అక్రమ తవ్వకం, దొంగతనం కేసులో విచారణకు సహకరించాలని పేర్కొంది. సీబీఐ బృందం కోల్‌కతాలోని అభిషేక్ బెనర్జీ భార్య, మరదలి నివాసాలకు వెళ్లి, నోటీసు అందజేసింది. పశ్చిమ బెంగాల్లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు(ఈసీఎల్) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ గత ఏడాది నవంబర్‌లో పలువురిపై కేసు నమోదు చేసిన విషయమే. ఈ వ్యవహారంతో రుజీరా బెనర్జీకి, మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. విచారణకు సహకరించాలంటూ తాజాగా నోటీసు జారీ చేసింది. సోమవారం విచారించే అవకాశం ఉందని, ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. కాగా తన భార్యకు సీబీఐ నోటీసు ఇవ్వడం పట్ల అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. కేసులతో తమను బెదిరించలేరని బీజేపీ పెద్దలను హెచ్చరించారు. బీజేపీకి లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బీజేపీ నుంచి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయని, ఇప్పుడు సీబీఐ, ఈడీ మాత్రమే బీజేపీ కూటమిలో ఉన్నాయని విమర్శించింది. బొగ్గు దొంగతనం కేసులో సీబీఐ విచారణను తృణమూల్ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయా ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
10 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
an hour ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
12 hours ago
ఇంకా