newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

అధికారుల పాపాలను ఎంతకాలం మోయాలి... హైకోర్టు ధ్వజం

14-01-202114-01-2021 18:16:34 IST
2021-01-14T12:46:34.553Z14-01-2021 2021-01-14T12:46:31.304Z - - 20-01-2021

అధికారుల పాపాలను ఎంతకాలం మోయాలి... హైకోర్టు ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళనాడు అధికారుల అలసత్వంపై పదే పదే ధ్వజమెత్తుతున్న మద్రాస్ హైకోర్టు తాజాగా, ఏసుక్రీస్తు శిలువ మోసినట్టుగా అధికారుల పాపాలను న్యాయస్థానం మోయలేదని వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజనాలకు సంబందించి న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. 

అధికారుల తప్పిదాల కారణంగా కోర్టుల్లో పలు కేసులు దాఖలయ్యాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలం వాయిదాలో ఉన్న ఒక కేసులో అలసత్వానికి ప్రతిగా పిటిషనర్లకు రూ.లక్ష, 50 వేల చొప్పున నష్టపరిహారం అందజేయాలని ధర్మపురి, పెరంబలూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.శేషసాయి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే ధర్మపురి జిల్లా వీరప్పనాయకన్‌పట్టిలో రత్నం అనే మహిళకు చెందిన నాలుగెకరాల వ్యవసాయ భూమిని 1987లో ఓ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా, 2000 సంవత్సరంలో న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 

అయితే అప్పటినుంచి అధికారులు ఆ భూమిని ఆమెకు స్వాధీనం చేయలేదు. అలాగని కోర్టు ఉత్తర్వులపైనా అప్పీలుకు వెళ్లలేదు. దీంతో రత్నం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూమిని అధికారులు తనకు అప్పగించడం లేదని వివరించింది. అదేవిధంగా పెరంబలూరుకు చెందిన జయలక్ష్మి కూడా ఇదేవిధమైన వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది.

ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.శేషసాయి.. అధికారుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కోర్టు ఆదేశించి 20 ఏళ్లు అవుతున్నా, పిటిషనర్లకు భూములను అప్పగించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. పొంతనలేని అధికారుల వ్యవహారశైలితో పడిన చిక్కుముడిని పరిష్కరించడం న్యాయస్థానాలకు కష్టంగా మారుతుందన్నారు. 

ఆ భూములను పిటిషనర్ల పేర్లపైకి మార్చాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పిటిషనర్లకు నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. తమ ఆదేశాలను అమలు చేసి సమగ్ర నివేదికలను దాఖలు చేయాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

2012లో జాతీయ రహదారుల కోసం స్వాధీనం చేసుకున్న పేదల స్థలాలకు నష్టపరిహారం చెల్లించాలని తాను చేసిన ఆదేశంపై ఎనిమిదేళ్లుగా ప్రభుత్వాధికారులు చర్య తీసుకోకపోవడంపై హైకోర్టు మండిపడింది. అలసత్వానికి గాను కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్య తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని హైకోర్టు సేలం, విల్లుపురం జిల్లాల కలెక్టర్లకు గతంలోనే నోటీసు పంపింది.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   3 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   4 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   6 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   8 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   8 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   8 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   11 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   12 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   14 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle