newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా గల్లంతే.. కుష్బూ జోస్యం

16-10-202016-10-2020 12:19:09 IST
2020-10-16T06:49:09.016Z16-10-2020 2020-10-16T06:49:05.970Z - - 25-10-2020

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా గల్లంతే.. కుష్బూ జోస్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌ మునిగే నౌక అని తెలిసినా, సేవా దృక్పథంతో నాలుగేళ్లు ఆ పార్టీతోనే పయనించానని కానీ ఆ పార్టీ ప్రస్తుత ధోరణి చూస్తుంటే అతి త్వరలోనే ప్రతిపక్ష హోదా గల్లంతయ్యే ప్రమాదం కొట్టొచ్చినట్లు కనబడుతోందని బీజేపీ నేత, మాజీ కాంగ్రెస్ ప్రతినిధి, ప్రముఖ నటి కుష్బూ వ్యాఖ్యానించారు. బీజీపీలో చేరిన తర్వాత  తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఆమె తమిళనాడు కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవలేదనేశారు.

తమిళనాడులో కొంతమంది నేతలు వారసులు అంటూ ముందుకు సాగుతున్నారే గానీ, ప్రజాహితంపై, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదన్నారు. తానేదో ఆదాయాన్ని ఆర్జించి బీజేపీలో చేరినట్టు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌ మునిగే నౌక అని తెలిసినా నాలుగేళ్లు పయనించానని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లు సమయం, శ్రమను వృథా చేసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. 

బీజేపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా బలోపేతం నినాదంతోనే తన పయనం ఉంటుందన్నారు. తన రాజకీయ వ్యవహారాల్లో భర్త సుందర్‌ సీ ఎప్పుడూ జోక్యంచేసుకోలేదన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతోనే బీజేపీలో చేరినట్టు తెలిపారు. కన్యాకుమారి నుంచి తాను పోటీ అనేది ప్రచారం మాత్రమే అని, అక్కడ బీజేపీకి బలమైన నేతగా పొన్‌రాధాకృష్ణన్‌ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.   

అలా అనడం తప్పే.. క్షమించండి

కాంగ్రెస్‌ పార్టీనుంచి వైదొలుగుతా ఆ పార్టీ చేసిన విమర్శలకు స్పందనగా అది బుర్రలేని పార్టీ, మానసిక ఎదుగుదల లేని పార్టీ అనే పదాలు ప్రయోగించినందుకు క్షమాపణలు కోరుతున్నానని కుష్బూ పేర్కొన్నారు. కుష్బు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాడులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఆమె మీద ఓ హక్కుల సంస్థ 30 పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో రెండు పదబంధాలను తప్పుగా వాడినందుకు క్షమించమని కోరడమే కాక ఇది మరలా జరగకుండా చూస్తానని ఆమె అన్నారు.

ఆ సమయంలో నేను తీవ్ర దుఖం, వేదనలో ఉన్నాను. ఆ తొందరపాటులో రెండు పదబంధాలను తప్పుగా ఉపయోగించినందుకు నేను బాధపడుతున్నారు. నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిని. అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్‌లో.. వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నాను అనడం అభ్యంతరకరమైనది అని కుష్బూ అన్నారు. నా కుటుంబ సభ్యులు కొందరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాకు సమర్థులైన, తెలివైన, డైనమిక్‌, బైపోలార్‌ డిజార్డర్‌, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఇలా వేర్వేరు రకాల స్నేహితులు ఉన్నారు. వారి స్నేహం, జ్ఞానం నన్ను ధనవంతురాలిని చేసింది’ అన్నారు కుష్బు.

బీజేపీలో చేరిన అనంతరం ఈ నెల 14 న కుష్బు చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్‌ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా  ప్రముఖ సనీ నటి కుష్బూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతూ తమిళనాడు దివ్యాంగుల హక్కుల సంఘం ఆమెపై 50 పోలీసు స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థిల్లోనూ తన క్షమాపణలు అంగీకరించేది లేదని దివ్యాంగుల హక్కుల సంఘం స్పష్టం చేసింది. 

కుష్బూ చట్టాన్ని అతిక్రమించారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సంఘం డిమాండ్‌ చేస్తోంది. అంతేగాక కుష్బూపై రాజీలేని పోరాటానికి దిగుతామంటు తమిళనాడులోని 50 పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చట్టప్రకారం కుష్బూ చేసిన వ్యాఖ్యలకు ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle