newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

బుర్ర తక్కువ కాంగ్రెస్.. అందుకే వదిలేశానంటున్న కుష్బూ

14-10-202014-10-2020 10:20:40 IST
Updated On 14-10-2020 12:17:50 ISTUpdated On 14-10-20202020-10-14T04:50:40.985Z14-10-2020 2020-10-14T04:50:37.361Z - 2020-10-14T06:47:50.422Z - 14-10-2020

బుర్ర తక్కువ కాంగ్రెస్.. అందుకే వదిలేశానంటున్న కుష్బూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివిధ రాష్ట్రాల్లో ప్రచారానికి తన సేవలను వాడుకున్నప్పుడు తానో నటినని తెలియలేదా అంటూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ సినీనటి కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీనే మతిలేని పార్టీఅని, దానికి మానససిక ఎదుగుదల నిలిచిపోయిందని అరోపించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నాయకులకు కూడా బుర్రతక్కువే అని బీజేపీ మహిళా నేత, నటి కుష్బు ఎద్దేవా చేశారు. 

కాగా మంగళవారం జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన నటి కుష్బుకు ఢిల్లీనుంచి తిరిగి రాగానే చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌తో పాటు పలువురు నేతలు ఆమెను పూలమాలతో ముంచెత్తారు. అక్కడి నుంచి నేరుగా కమలాలయం చేరుకున్న కుష్బు మీడియాతో మాట్లాడారు. తాను డీఎంకే నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆ పార్టీని విమర్శించలేదని, ప్రస్తుతం అదే శైలిలో సాగాలని నిర్ణయించినా, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు వదలిపెట్టేలా లేరన్నారు. 

తనను విమర్శించ బట్టే, ఇప్పుడు పెదవి విప్పాల్సి వస్తోందన్నారు. విమర్శిస్తే, ఎదురు దాడికి సిద్ధమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తనను అణగదొక్కారని, అక్కడ బుర్ర తక్కువ నాయకులే ఎక్కువని, తనకు తెలివి ఉండబట్టే మేల్కొని బయటకు వచ్చేశానని వ్యాఖ్యానించారు. ఇది వరకు ప్రతి పక్షంలో ఉండబట్టే, అధికార పక్షాన్ని వ్యతిరేకించినట్టు తెలిపారు. 

ఇప్పుడు తానో నటి అన్న విషయం కాంగ్రెస్‌ వాళ్లకు గుర్తొచ్చినట్టుందని మండిపడ్డారు. బీజేపీలో చేరడానికి తన భర్త సుందర్‌ కారణం కాదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు తాను ఆనందంగా ఉన్నానని పేర్కొన్నారు. కాగా కుష్బు బీజేపీలో చేరడంతో ఆ పార్టీలో సినీనటుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే నమిత, గౌతమి, గాయత్రి రఘురాం, మధువంతి, కుట్టి పద్మిని, నటుడు రాధారవి, సంగీత దర్శకులు గంగై అమరన్, దీనా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.  

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారు. అన్నాడీఎంకే నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లను రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 17న ఆయన చెన్నైకు రానున్నారు. అన్నాడీఎంకే వర్గాలతో భేటీ, బీజేపీలో చేరిక కార్యక్రమాలు అంటూ ముందుకు సాగబోతున్నారు.  

అయితే చాలా కాలం క్రితమే కుష్బూని పార్టీ ప్రతినిధి హోదానుంచి తొలగించిన కాంగ్రంస్ పార్టీ ఆమె నిష్క్రమణతో తమిళనాడులో కాంగ్రెస్‌ కోల్పోయేదేమీ లేదని కొట్టిపడేసింది.

దేశం ముందుకు పోవాలంటే జాతిని సరైన మార్గంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ వంటి గొప్ప నాయకుడు అవసరమని కుష్బూ పొగిడేశారు. ఇక బీజేపీ కూడా కుష్బూ వంటి పేరున్న నటి చేరికతో కుషీగా ఫీలవుతోంది. 2014 నుంచి కాంగ్రెస్‌తో కొనసాగిన కుష్బూ ఉన్నట్లుండి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరిపోయారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle