newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం

06-03-202106-03-2021 10:04:49 IST
2021-03-06T04:34:49.393Z06-03-2021 2021-03-06T04:34:46.460Z - - 11-04-2021

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ పేరు వింటే చాలు ఒంటికాలిమీద లేచి శివాలెత్తిపోయే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అడ్డంగా బుక్కయిపోయినట్లే. కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ శుక్రవారం కేంద్ర కస్టమ్స్ చీఫ్ బంగారం అక్రమ రవాణా కేసులో సంచలన వివరాలను కేరళ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు. 

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్, మరో ముగ్గురు మంత్రులను గురించి ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్‌ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించినట్టు కస్టమ్స్‌ చీఫ్‌ కేరళ హైకోర్టుకి సమర్పించిన రిపోర్టులో తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌ సహా మరో ముగ్గురు మంత్రులు అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు స్వప్నా సురేశ్‌ దర్యాప్తులో వెల్లడించిన విషయం రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు కీలక ప్రచార అస్త్రంగా మారనుంది.

ప్రధానంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఇది పెద్ద తలనొప్పిలా తయారైందని విశ్లేషకుల వ్యాఖ్య. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బంగారం అక్రమ రవాణా కేసు తాజా పరిణామాలు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. అయితే అధికార సీపీఎం మాత్రం రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఎత్తుగడగా ఆరోపిస్తోంది. ఏప్రిల్‌ 6న జరిగే ఎన్నికల్లో కేరళలో తిరిగి లెఫ్ట్‌ ప్రభుత్వం వస్తుందని రూఢీ కావడంతోనే బీజేపీ ఆందోళనలో పడిందని సీపీఎం ఆరోపించింది. 

ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఫైనాన్స్‌ చీఫ్, ఒమన్‌లోని మస్కట్‌కు 1,90,000 అమెరికన్‌ డాలర్లను(1.30 కోట్ల రూపాయలను) అక్రమ రవాణా చేసినట్లు డాలర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంగారం స్మగ్లింగ్‌ కేసులో సహ నిందితులుగా ఉన్న స్వప్నా సురేశ్, సరిత్‌ పిఎస్‌లను, డాలర్‌ కేసుతో సంబంధం ఉన్నదన్న కారణంగా కస్టమ్స్‌ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. 

ముఖ్యమంత్రి పినరయి విజయన్, స్పీకర్‌ శ్రీరామకృష్ణన్‌లు యుఏఈ కాన్సుల్‌ జనరల్‌ సహాయంతో అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు కీలక నిందితురాలు స్వప్న సురేశ్‌ స్పష్టం చేశారని, కస్టమ్స్‌ కమిషనర్‌ సుమిత్‌ కుమార్, కేరళ హైకోర్టుకి సమర్పించిన ఒక రిపోర్టులో తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌ ఆదేశాల మేరకు విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసిన విషయం తనకు తెలుసునని స్వప్న విచారణలో అంగీకరించినట్లు కస్టమ్స్‌ కమిషనర్‌ వెల్లడించారు. 

దుబాయ్ కాన్సులేట్‌ సాయంతో, ముఖ్యమంత్రి, స్పీకర్‌లు, విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేసిన విషయం తెలుసునని ఆమె స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు, స్పీకర్‌ల అసంబద్ధమైన, అక్రమ కార్యకలాపాలను గురించి ఆమె బహిరంగపరిచారు అని కస్టమ్స్‌ అధికారులు హైకోర్టుకి శుక్రవారం సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు. 

గత ఏడాది జూలై 5న తిరువనంతపురంలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కాన్సులేట్‌కు వస్తోన్న పార్శిల్స్‌లో 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కేసుతో సంబంధం ఉన్న స్వప్నా సురేశ్‌ సహా 15 మందిని అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.   

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో తనకు సన్నిహింత సంబంధాలున్నాయని, సీఎం ప్రధాన కార్యదర్శి, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరితో కూడా తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్వప్నా సురేశ్ కస్టమ్స్ అధికారులకు వివరించారు. దుబాయ్ కాన్సులేట్ సహాయంతో సీఎం, స్పీకర్ ఆదేశాల ప్రకారమే విదేశీ కరెన్సీని స్మగ్లింగ్ చేస్తున్న ఉదాహరణలు తనకు తెలుసని ఆమె అంగీకరించారు.

పలు ఇతర ఒప్పందాల్లో కూడా ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి ముడుపులు పెద్ద ఎత్తున అందాయని కూడా స్వప్నా సురేశ్ బయటపెట్టారు. కేరళ ప్రభుత్వంలో ఉంటున్న వ్యక్తులకు, మధ్యప్రాచ్య ప్రాంత ప్రముఖులకు మధ్య తాను దుబాసీగా వ్యవహరించినందున ఈ అన్ని లావాదేవీలలో తాను ప్రత్యక్ష సాక్షినని స్వప్న అంగీకరించారు. 

అరబిక్ భాషలో అపారమైన పట్టు ఉన్న స్వప్నా సురేశ్ గత కొన్నేళ్లుగా కేరళ ప్రభుత్వానికి, దుబాయ్  వ్యక్తులకు మధ్య జరిగన సంభాషణలకు దుబాసీగా వ్యవహరించారు. ఆ వివరాలు మొత్తంగా పూస గుచ్చినట్లు ఆమె కేంద్ర కస్టమ్స్ అధికారులకు వివరించారు. కేరళ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు, స్పీకర్ నడుపుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి కూడా తనకు తెలుసని ఆమె చెప్పారు. 

నవంబర్ 2019, జూన్ 2020 మధ్య దుబాయ్ దౌత్యవేత్తల పేరిట 167 కేజీల బంగారం కేరళకు స్మగుల్ అయిందన్న వార్త కేరళ రాజకీయాలను అప్పట్లోనే ఊపేసింది.

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కస్టమ్స్ శాఖ ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులతో సహా ఈ కేసులో భాగస్తులేనని హైకోర్టుకు చెప్పడం సంచలనం కలిగించడమ కాదు.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మలుపు తిరగడానికి కారణం అవుతోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle