ముందుంది ముసళ్ల పండగ.. అనిల్ రాజీనామాపై కంగనా హాట్ కామెంట్
06-04-202106-04-2021 18:00:24 IST
2021-04-06T12:30:24.340Z06-04-2021 2021-04-06T12:30:21.871Z - - 16-04-2021

ఇది ఆరంభం మాత్రమే.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్య చేశారు. వందకోట్ల వసూళ్ల కుంభకోణంలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేసిన ఘటన ముగింపు కాదని కంగనా వ్యాఖ్యానించారు. సాధువులను హత్య చేసి.. మహిళలను వేధించి, హింసించేవారికి ఎప్పటికైనా ఇలాగే పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అనిల్ దేశ్‌ముఖ్‌ను ఉద్దేశించి కంగనా హెచ్చరించారు. అంతేకాదు ముందు ముందు ఏం జరుగనుందో చూస్తూ ఉండు అంటూ ఆమె ట్వీట్ చేశారు మహారాష్ట్ర హోంమంత్రి తన పదవికి రాజీనామా చేసిన సందర్భంగా.. గతంలో ముంబైలోని తన ఆఫీసుపై దాడి, కూల్చివేత విషయాలను గుర్తు చేస్తూ కంగనా తాను చేసిన ట్వీట్‌ని రీట్వీట్ చేశారు. శివసేన బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో కంగనా వ్యాఖ్యలు మళ్లీ దుమారం లేపాయి. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ రాష్ట్ర హోంమంత్రి దేశ్‌ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. 15 రోజుల్లోగా దీనిపై ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లుగా పదవిని అంటిపెట్టుకుని ఉన్న అనిల్ దేశ్‌ముఖ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శివసేన ఏలుబడిలోని ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌గా గతంలో కంగనా వర్ణించడంతో శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్, హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆమెపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో ముంబైలోని బాంద్రాలో కంగనా ఆఫీసులో కొంత భాగాన్ని కూల్చిపేయాలని బృహన్ ముంబై కార్పొరేషన్ నిర్ణయించి నోటీసు పంపి 24 గంటలు కాకముందే దాన్ని కూల్చివేయడంపై హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సమర్థించారు. తన ఆఫీసులో ఒక భాగాన్ని కూల్చివేయడంతో క్రుద్ధురాలైన కంగనా అప్పట్లోని శివసేన కూటమి ప్రభుత్వం కుప్పగూలిపోతుందంటూ శావనార్థాలు పెట్టిన విషయం తెలిసిందే.

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
12 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
11 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా