newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాజకీయాలపై కమల్ కామెంట్స్.. ఆయన్ను టార్గెట్ చేసిన నటి గౌతమి

31-03-202131-03-2021 10:06:39 IST
Updated On 31-03-2021 09:35:35 ISTUpdated On 31-03-20212021-03-31T04:36:39.814Z31-03-2021 2021-03-31T02:54:22.381Z - 2021-03-31T04:05:35.173Z - 31-03-2021

రాజకీయాలపై కమల్ కామెంట్స్.. ఆయన్ను టార్గెట్ చేసిన నటి గౌతమి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళనాడు రాజకీయాల్లో ఈసారి చక్రం తిప్పాలని మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధిపతి కమల్ హాసన్ భావిస్తూ ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో వీలైనన్ని స్థానాలలో గెలవాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు. తాజాగా రాజకీయాలను కమల్ మురికిగుంటతో పోల్చారు. చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి ఐఏఎస్‌ సంతోష్‌బాబుకు మద్దతుగా రోడ్‌షోను కమల్‌ నిర్వహించారు. వేళచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రాజకీయాలు అంటే మురికిగుంట అని పెద్దలు చెప్పే వారని.. అందుకే అనేక మంది చదువుకున్న పెద్దలు ఈ మురికిగుంటలో దిగేందుకు వెనక్కి తగ్గారని అన్నారు. ఈ గుంటను ఎవరో ఒకరు శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించే తాను రంగంలోకి దిగినట్టు తెలిపారు. రాజకీయం అనే మురికిగుంటను శుభ్రం చేయడానికి తనతో పాటు మక్కల్‌ నీది మయ్యం వర్గాలు అందరూ పారిశుధ్యకార్మికులుగా మారామని అన్నారు. రాజకీయం అనే మురికిని ఇకనైనా శుభ్రం చేయకుంటే, భావితరాలు ఈ తరం వారిని క్షమించరని అన్నారు. తమను చూసి ఇతర పార్టీలు భయపడుతున్నాయని, అందుకే ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారని అన్నారు. తాము భయపడమని.. తమకు ప్రజల మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. 

మరో వైపు సినీ నటి గౌతమి కమల్ హాసన్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానని కమల్‌ చెబుతున్నారని, అయితే ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారో.. లేదో మే 2న తెలిసిపోతుందని చెప్పారు. మార్కెటింగ్‌ మాయాజాలంలో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కమల్‌కు హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించారు గౌతమి. కొన్నేళ్లపాటు ఆయనకు సన్నిహితరాలిగా మెలిగారు. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయిన సంగతి తెలిసిందే..! 

కమల్‌ పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో మంగళవారం నటి సుహాసిని ప్రచారం చేశారు. అవినీతిశక్తులకు వ్యతిరేకంగా కమల్‌ పోరాడుతూ ఉన్నారని అన్నారు. ఆ శక్తుల్ని అంతం చేయడానికి మక్కల్‌ నీది మయ్యంకు అండగా, మద్దతుగా ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle