ఓరి నాయనో ఏం హామీలు.. ఇది సినిమా కాదు కమల్ సార్
29-03-202129-03-2021 17:14:13 IST
2021-03-29T11:44:13.877Z29-03-2021 2021-03-29T05:37:35.886Z - - 16-04-2021

రీల్ వేరు. రియల్ వేరు. ఈ మాత్రం క్లారిటీ లేకుంటే.. రియల్ లైఫ్ లో చాలా కష్టం. కానీ.. సినీ స్టార్ల రియల్ లైఫ్ ని కూడా రీల్ లైఫ్ లా ఫీలై పోయి.. నాశనం చేసుకుంటారు అనే టాక్ ఉంది. హిపోక్రసీలో బతుకుతుంటారు అనే వారు ఎంతోమంది. లగ్జరీలకు పోయి.. జీవితాలు నాశనం అవుతాయి అని వింటుంటాం కదా. ఇవి కామన్ గా కనిపించేవే. అయితే.. రియల్ లైఫ్ లో రీల్ లైఫ్ ఊహించుకోవడమే కాదు.. పొలిటికల్ లైఫ్ లో కూడా రీల్ లైఫ్ నే ఊహించుకుంటే కష్టమే కదా. మన దగ్గర అలా బోల్తా పడ్డవారిలో మెగాస్టార్ ముందు వరసలో ఉంటే.. పవర్ స్టార్ రెండవ ప్లేస్ లో ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా సినిమా ఫీవర్ ని పొలిటికల్ లైన్ లోకి లాగేసుకుని.. పెద్ద పెద్దగా ఊహించుకుని నిండా మునిగారు అని తెలిసిందే కదా. విజయశాంతి, మోహన్ బాబు, క్రిష్ణం రాజు లాంటి వారు కూడా మంచి ఎగ్జాంపుల్సే. అందుకే.. ఇవన్నీ తెలిసి.. రజనీకాంత్ సైలెంట్ అయ్యారు. కాస్త తెలివిగా ఆలోచించాడు అనుకున్నారు.
కానీ.. కమల్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పోటీకి సై అన్నాడు. బ్యాటరీ పట్టుకుని బయల్దేరాడు. ఓటర్లని వెలుగులోకి తీసుకొస్తా.. అంతా చీకట్లో ఉన్నారు అంటున్నాడు. అది సరే.. అసలు ఆయన్ని పట్టించుకున్న ఓటరే లేదు. అసలు ఒక్క సీటైనా వస్తుందా లేదా అన్న క్వశ్చన్లు చాలానే ఉన్నయ్. ఎందుకంటే ఇప్పుడు తమిళ్ పాలిటిక్స్ లో.. డీఎంకే అన్నా డీఎంకే మధ్య పోరు రసవత్తరంగా ఉంది.
సిచ్చువేషన్ అంత సీరియస్ గా ఉంటే.. కమల్ హామీలు మామూలుగా లేవు. బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు. ఎలాగూ గెలిచేది లేదు కదా..అందుకే.. అలాంటి హామీలు ఇస్తున్నాడు అంటున్నారు జనాలు. లీడర్లు అయితే.. ఆయన గురించి కామెంట్ చేయడం కూడా టైమ్ వేస్టే.. ఆయనదేముందిలే.. నాలుగు రోజులు తిరిగి.. మళ్లీ షూటింగులకి వెళ్లిపోతాడు అంటున్నారు. కానీ.. కమల్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వంద రోజుల్లో బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అంటున్నాడు కమల్ హాసన్. గెలిచిన రోజుని సినిమా రిలీజ్ గా అనుకుంటే.. వందో రోజుని.. హండ్రడ్ డేస్ ఫంక్షన్ లాగా చేస్తాడట. మిగతా పార్టీలు ప్రభుత్వాలు పదేళ్లలో చేయలేనిది.. వంద రోజుల్లో చేసి చూపిస్తా అంటున్నాడు. జనం ఏమో.. చాల్ చాల్ లేవయ్యా.. మేకప్ వేసుకుని షూటింగ్ కి వెళ్లిపో.. ముందు సినిమా రిలీజ్ చేయి.. నీ ఫ్యాన్స్ మేమంతా సినిమా కోసం వెయిట్ చేస్తుంటే.. నువ్వేమో.. వంద రోజులు ఆడే సినిమా రిలీజ్ చేయకుండా.. పొలిటికల్ చిత్రాన్ని వంద రోజుల్లో ఆడిస్తా అంటున్నవ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా