newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

ఎల్జీపీ ఒంటరి పోరు బీజేపీ ఎత్తుగడలో భాగమేనా?

24-10-202024-10-2020 19:57:24 IST
Updated On 25-10-2020 06:24:40 ISTUpdated On 25-10-20202020-10-24T14:27:24.083Z24-10-2020 2020-10-24T14:27:04.986Z - 2020-10-25T00:54:40.019Z - 25-10-2020

ఎల్జీపీ ఒంటరి పోరు బీజేపీ ఎత్తుగడలో భాగమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆ రాష్ట్రంలో నాటకీయ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీయే కూటమిలో కొనసాగుతూనే లోక్ జనశక్తి పార్టీ (ఎల్జీపీ) ఒంటరి పోరుకు సిద్ధమవ్వడం రాజకీయ పండితులను సైతం నివ్వెరపరిచింది. అయితే ఎల్జీపీ నేత, దివంగత రామ్ విలాస్ పశ్వాన్ కుమారుడు చిరాగ్ పశ్వాన్ ప్రకటనలు మాత్రం ఒంటరి పోరు వ్యూహం వెనుక ఉన్నది బీజేపీయేనని తేటతెల్లం చేస్తున్నారు. తాను కూడా తండ్రిలాగే ప్రధాని మోడీతోనే ఉంటానని చెబుతూనే...బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ పై మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

మరో వైపు యూపీఏ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ బాగా తగ్గి కూటమి సీఎం అభ్యర్థిగా మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ ను ప్రకటించేసింది. రాష్ట్రంలో కమలనాథులకు అవకాశం ఇవ్వరాదన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ కూటమి భాగస్వామ్య పక్షాల మాటకు అధిక ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నది. యూపీఏ కూటమి సంగతి అలా ఉంచితే...ఎన్డీయే కూటమి రాజకీయాలు రంజుగా మారాయి.

బీజేపీతో విభేదాలు లేవంటున్న చిరాగ్ పశ్వాన్, మోడీయే తమ నాయకుడని ప్రకటిస్తూనే.. జేడీయూ అధినేత, కూటమిలో కీలక భాగస్వామి అయిన జేడీయూతో పోరుకు సై అంటున్నారు. ఒక వైపు జేడీయూ అభ్యర్థుల తరఫున రాష్ట్రంలో ప్రధాని మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారం చేస్తున్న స్థానాలలో ఎజెపీ అభ్యర్థులు రంగంలో ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.

ఇంత వైరుధ్యాన్ని ప్రదర్శిస్తూ కూడ ఎల్జీపీ ఎన్నికల అనంతరం బీజేపీ-ఎల్జీపీ సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎల్జీపీ ఒంటరి పోరు వెనుక యూపీఏ కూటమిని దెబ్బకొట్టే బీజేపీ వ్యూహమే ఉందన్న అనుమానాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎల్జీపీ ఒంటరి పోరు వెనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా యూపీఏ కూటమికి దక్కకుండా చేసే వ్యూహం ఉందంటున్నారు. విపక్ష కూటమి ఓట్లను చీల్చడమే లక్ష్యంగా బీజేపీ ఎత్తుగడలో భాగమే ఎల్జీపీ ఒంటరి పోరుగా అభివర్ణిస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా బీజేపీ వ్యవహరిస్తున్నదని చెప్పవచ్చు.

ఎల్జీపీ ఒంటరి పోరు వల్ల యూపీఏ ఓట్లు చీలడడమే కాకుండా, జేడీయూకి కూడా కొన్ని స్థానాల్లో నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే ఎన్నికలలో ఎన్డీయే కూటమిలో జేడీయూ కంటే బీజేపీకి కనుక ఎక్కువ స్థానాలు వస్తే...అప్పుడు నితీష్ ను చెప్పుచేతల్లో ఉంచుకునే అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీ భావనగా కనిపిస్తున్నది.

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   6 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   6 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   6 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   7 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   9 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   9 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   9 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   10 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   10 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   10 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle