newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేనో పెద్ద గాడిదని, సువేందు ద్రోహాన్ని గుర్తించలేకపోయా.. మమత ఒప్పుకోలు

22-03-202122-03-2021 13:33:44 IST
2021-03-22T08:03:44.974Z22-03-2021 2021-03-22T06:11:07.925Z - - 16-04-2021

నేనో పెద్ద గాడిదని, సువేందు ద్రోహాన్ని గుర్తించలేకపోయా.. మమత ఒప్పుకోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తృణమూల్ కాంగ్రెస్‌కు ద్రోహం చేసి బీజేపీ గూట్లోకి వెళ్లిన సువేందు అధికారి అసలు రంగును చివరిదాకా గుర్తించలేకోపోయానని, నిజంగానే నేనొక పెద్ద గాడిదను అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒప్పేసుకున్నారు. బెంగాల్ చరిత్రలో ద్రోహులుగా మారిపోయి బ్రిటిష్ వారి చెంత చేరిన మీర్ జాఫర్ కుటుంబం సరసన సువేందు అధికారి కుటుంబం చేరిపోయిందని, మొదట్లో సువేందు, ఇప్పుడు ఆయన తండ్రి బీజేపీని కౌగలించుకోవడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ బెంగాలీ ప్రజలకు పచ్చి ద్రోహం తలపెట్టారని మమత ధ్వజమెత్తారు.

ఆదివారం పూర్బ మేదినీపూర్ జిల్లాలోని కాంతి దక్షిణ్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మమత సువేందు అధికారి అసలు రంగును గుర్చించలేక పోయిన తాను నిజంగానే పెద్ద గాడిదను (అమీ ఏక్తా బోరో గధా) అని విచారం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమత ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఎవరు విజేత అవుతారనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నందిగ్రామ్‌పై పూర్తి పట్టు ఉన్న సువేందు అధికారిపై పంతానికి పోయిన మమత అక్కడినుంచే పోటీ చేసి సువేందు పని పట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

మమతకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సువేందు అధికారి తర్వాత తీవ్రమైన అభిప్రాయభేదాల వల్ల ఆమెకు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. కాగా కాంతి దక్షిణ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మమత ఏకంగా సువేందు కుటుంబంపైనే దాడి చేశారు. సువేందు కుటుంబం గత కొన్నేళ్లుగా రూ.5వేల కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు తాను విన్నానని మమత ఆరోపించారు.. ఈ అక్రమ డబ్బుతోనే ఓట్లు కొనేయాలని సువేందు ప్రయత్నిస్తున్నాడని, అతగాడికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తృణమూల్‌ని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తే సువేందు అవినీతిపై విచారణ జరిస్తానని మమత ప్రతిన చేశారు.

మీర్ జాపర్లను, బీజేపీని తరిమికొట్టండి.. మమత పిలుపు

సువేందు అధికారి తండ్రి సీనియర్ టీఎంసీ ఎంపీ సిసిర్ అధికారి ఆదివారం పార్టీనుంచి జంప్ చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరడంతో మమత ఆగ్రహం పట్టలేకపోయారు. జిల్లా మొత్తం మీద పట్టు ఉన్న సువేందు అధికారి కుటుంబంలో చాలామంది బీజేపీలో చేరిపోవడానికి సిద్ధమైన నేపథ్యంలో సువేందు కుటుంబాన్ని ద్రోహుల కుటుంబంగా, జమీందారుల కుటుంబంగా మమత ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలు అభినవ మీర్జాపర్ తరహా  ద్రోహులను ఎన్నటికీ క్షమించరని వారికి తగిన బుద్ది చెప్పాలని మమత పిలుపునిచ్చారు. 

బెంగాల్ చివరి స్వతంత్రం నవాబు సిరాజ్ ఉద్ దౌలా సైనిక జనరల్‌గా పనిచేసిన మీర్ జాఫర్ 1757 ప్లాసీ యుద్దంలో నవాబుకు ద్రోహం చేసి బ్రిటిష్ వారి పంచన చేరి యుద్ధంలో నవాబును ఓడించాడు. ఈ యుద్ధంలో బెంగాల్ పతనం భారత్‌లో బ్రిటిష్ పాలనకు దారి తీసింది.

మీర్ జాఫర్ అబినవ వారసులైన సువేందు అధికారి కుటుంబం మొత్తం జిల్లాను జమీందారుల్లాగా ఏలుతున్నారని,  చివరకు బహిరంగ సభల్లో హజరు కావడానికి తనను కూడా అనుమతించడం లేదని మమత ఆగ్రహంతో ఊగిపోయారు. బెంగాల్ ప్రభుత్వం అందించిన అనేక పథకాలను సువేందు కుటుంబం తమ ఘనతగా చెప్పుకుంటోందని ఈ ఎన్నికల్లో ఈ ద్రోహుల కుటుంబాన్ని తరిమికొట్టాలని మమత పిలుపునిచ్చారు.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   13 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle