newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

16 కోట్లకు పైగా ఉచిత వ్యాక్సిన్ డోసుల పంపిణీ.. కేంద్రం వెల్లడి

01-05-202101-05-2021 16:10:48 IST
Updated On 01-05-2021 17:20:32 ISTUpdated On 01-05-20212021-05-01T10:40:48.708Z01-05-2021 2021-05-01T09:31:46.045Z - 2021-05-01T11:50:32.480Z - 01-05-2021

16 కోట్లకు పైగా ఉచిత వ్యాక్సిన్ డోసుల పంపిణీ.. కేంద్రం వెల్లడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 16.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల వ్యవధిలో రెండవ విడతగా 17 లక్షల డోసులను అందిస్తామని తెలిపింది. దేశంలో కోవిడ్  వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని యువతకు దీనిని అందించాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రం ఇబ్బడిముబ్బడిగా వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. మే 1 నుంచి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించిన కేంద్రం దీని సరఫరా విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మూడవ దశ కోవిడ్  వ్యాక్సిన్ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలన్న ఆదేశాలను అన్ని రాష్ట్రాలకు కేంద్రం జారీ చేసింది. ప్రస్తుతం 79 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. తాము చేపట్టిన చర్యలవల్ల గణనీయ సంఖ్యలో రాష్ట్రాలకు అందుబాటులోకి  వచ్చినట్లు అయ్యిందని వెల్లడించింది.

ఈ వ్యాక్సిన్ డోసులను అత్యధికంగా పొందిన  రాష్ట్రాలలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. రెండవ స్థానంలో  ఉత్తరప్రదేశ్, మూడవ స్థానంలో రాజస్థాన్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లను పెద్ద సంఖ్యలో అందిస్తున్నప్పటికీ అవి వృధా అవుతున్న పరిమాణం కూడా చాలా ఎక్కువగానే ఉంది. లక్ష దీవుల్లో 9.76 శాతం వ్యాక్సిన్లు వృదా అయ్యాయని, తమిళనాడులో కూడా ఈ నిరుపయోగ 8.83 శాతం ఉన్నాయని  తెలిసింది. ఇక ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్లలో ఉత్తరప్రదేశ్లో 12 లక్షలకు పైగా పైగా డోసులు ఇంకా వినియోగించాల్సి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక పక్క ఆక్సిజన్ కొరతను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు మందుల లభ్యతను కూడా విస్తృతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 15 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు ఇటీవల వెల్లడించిన కేంద్రం ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. వైరస్ సోకిన అందిస్తూనే కొత్తగా ఇది ఎవరికీ సోకకుండా నివారించాలన్నదే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమ లక్ష్యం 18 సంవత్సరాలు దాటిన  కూడా ఈ వ్యాక్సిన్ అందించడం ద్వారా త్వరితగతిన కోవిడ్  వైరస్ ను, దాని వ్యాప్తిని నిరోధించగలుగుతామని ఇప్పటికే నిపుణులు స్పష్టం చేసిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరమైంది. రానున్న కొన్ని రోజుల్లో ఇదే వేగంతో ముందుకు వెళితే అందరికీ వ్యాక్సినేషన్  లక్ష్యం త్వరలోనే పూర్తి కాగలదన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది.   


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle