సుప్రీం చెప్పిందిగా ఇక ఇంటికెళ్ళండి.. రైతులకు సీఎం కట్టర్
14-01-202114-01-2021 08:00:42 IST
2021-01-14T02:30:42.288Z14-01-2021 2021-01-13T19:05:50.738Z - - 20-01-2021

రైతు ఆందోళనలకు హర్యానాయే కేంద్ర స్థానంగా ఉంటోంది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ తేల్చిచెప్పారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాల అమలుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అదరాబాదరాగా హోమంత్రి అమిత్ షాను కలిసిన ఖట్టర్ రైతులు ఇక ఇంటికెళ్లవచ్చు అని సంచనల ప్రకటన చేశారు.
కాగా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు శాంతి భద్రతలపై సమీక్షించారు. ఈ చర్చలో భాగంగానే రైతుల ఆందోళనకు కేంద్రస్థానంగా హర్యానా నిలుస్తోందని ఖట్టర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలపై సుప్రీకోర్టు స్టే విధించి రైతు సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని నియమించింది. అమిత్ షాతో భేటీ సందర్భంగా అన్ని అంశాలూ చర్చించాము. జనవరి 26న రిపబ్లిక్ డే జాతీయ ఉత్సవం కాబట్టి ఆ కార్యక్రమాలు సజావుగా జరగాలి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం శాంతియుతంగా జరుగుతుందని రైతులు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్సులో హామీ ఇచ్చారు. కాబట్టి వారు తమ ఆందోళనను విరమించుకుని ఇంటికి వెళతారని ఆశిస్తున్నాం అని ఖట్టర్ చెప్పారు.
ఇప్పుడు బంతి కేంద్రం చేతిలో కాదు.. సుప్రీంకోర్టు చేతిలో ఉంది. ఉన్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అని ఖట్టర్ పేర్కొన్నారు.
మరోవైపున సుప్రీంకోర్టు తీర్పు తర్పాత కూడా తాము నిరసన ప్రదర్శనలను ఆపివేయబోమని రైతు నిరసనకారులు తే్ల్చి చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను సస్పెండ్ మాత్రమే చేశారు కానీ వాటిని ఇంకా రద్దు చేయలేదన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యులందరూ ప్రభుత్వ అనుకూలురే కాబట్టి అలాంటి కమిటీని దాని నిర్ణయాలను ఆమోదించే ప్రసక్తే లేదని రైతు నేతలు తేల్చి చెప్పారు.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
4 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
5 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
6 hours ago

దేవినేని ఉమ విడుదల..!
8 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
9 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
9 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
11 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
13 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
14 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
16 hours ago
ఇంకా