newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

ఆడపిల్లలు 15 ఏళ్లకే కంటున్నారు. పెళ్లి వయస్సు పెంచడం దేనికి.. మాజీ మంత్రి వ్యాఖ్య

14-01-202114-01-2021 17:57:29 IST
2021-01-14T12:27:29.043Z14-01-2021 2021-01-14T12:27:25.690Z - - 20-01-2021

ఆడపిల్లలు 15 ఏళ్లకే కంటున్నారు. పెళ్లి వయస్సు పెంచడం దేనికి.. మాజీ మంత్రి వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆడపిల్లలు 15వ ఏట నుంచే పునరుత్పత్తి చేయగలిగినప్పుడు.. వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడం ఎందుకు? సగటు మనిషి ఎవరైనా ఇలా అడిగి ఉంటే ఇదేమంత పెద్ద వార్త అయ్యేది కాదు కానీ ఈ ప్రశ్న వేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి వర్యులు కావడంతో దుమారం పీక్‌కి వెళ్లిపోయింది. ఇది ఇప్పుుడు మధ్యప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ తక్షణం ఆ మాజీ మంత్రిని పార్టీనుంచి తొలగించాలి అని బీజేపీ మహిళా సంఘాలు డిమాండ్ చేసేవరకు వివాదం రాజుకుంది.

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మహిళలపై నేరాల గురించి అవగాహన కల్పించేందుని సమ్మన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలో మహిళ కనీస వివాహ వయస్సును 21 సంవత్సరాలకు పెంచాలని సూచించారు. దీనికి స్పందించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్య తేనెతుట్టెను కదిపినట్లయింది.

భారత మహిళలు 15 సంవత్సరాల వయస్సులోనే పునరుత్పత్తి చేయగలరు కదా  వివాహ వయస్సు పెంచడం ఎందుకు అని వర్మ ప్రశ్నించారు. వైద్యుల నివేదిక ప్రకారం, '15 సంవత్సరాల వయస్సు నుంచే బాలికలు పిల్లలను కనడానికి అనుకూలంగా ఉంటారు. అయితే 18 ఏళ్ల తర్వాతనే వారు వివాహం చేసుకోవడానికి తగినంతగా పరిణతి చెందుతారు. అందుకే వివాహ వయసును 18 సంవత్సరాలుగా పేర్కొన్నారు. మరి వారి వివాహ వయసును 18 నుంచి 21కి పెంచడానికి ముఖ్యమంత్రి ఏమైనా డాక్టరా.. శాస్త్రవేత్తనా’ అని వర్మ ప్రశ్నించారు. 

కాంగ్రస్ పార్టీ మాజీ మంత్రి యధాలాపంగా చేసిన రాజకీయ వ్యాఖ్య మంటలు సృష్టిస్తోంది. తన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. సజ్జన్‌ సింగ్‌ కేవలం మధ్యప్రదేశ్‌ కుమార్తెలనే కాక దేశవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలని తన మాటలతో అవమానించాడని మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠాలి ధ్వజమెత్తారు.  

తన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యంగ్‌ నేషనల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇద్దరూ మహిళలనే విషయం బహుశా సజ్జన్‌ సింగ్‌ మర్చిపోయినట్లున్నాడు. తన వ్యాఖ్యలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని సోనియా గాంధీ సజ్జన్‌ సింగ్‌ని ఆదేశించాలి. ఆయనను పార్టీ నుంచి తొలగించాలి అని రాహుల్ కొఠారి డిమాండ్‌ చేశారు. 

పైగా అమ్మాయిలు 18 ఏళ్లు దాటగానే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లి సంతోషంగా కాలం గడపాలంటూ ఈ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. జాతీయ బాలికా హక్కుల పరిరక్షణ కమిషన్ వర్మకు వెంటనే నోటీసు పంపింది. మైనర్ బాలికల పట్ల ఇలాంటి వివక్షాపూరిత ప్రకటన చేయడానకి కారణాలను, ఆయన ఉద్దేశాలను రెండురోజల్లో వివరించాలని కోరుకూ కమిషన్ ఆదేశించింది. 

కానీ కాంగ్రెస్ మాత్రం వర్మ మాటలకు మద్దతుగా నిలిచినట్లు వ్యాఖ్య చేసింది. మహిళల వివాహ వయస్సును 21 సంవత్సరాలకు పెంచాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డిమాండ్ చేయడానికి ముందు ఆయన ఏదైనా నిర్దిష్ట పరిశోధన చేశారా.. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీడియా దృష్టికి రావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు అంటూ కాంగ్రెస్ నేత భూపేందర్ గుప్తా చెప్పారు. తన ప్రెస్ కాన్పరెన్సులో వర్మ  కూడా ఉండటం గమనార్హం.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   2 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   3 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   5 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   7 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   7 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   7 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   10 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   11 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   13 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle