newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుపతి, నాగార్జున సాగర్ లలో ప్రజలు వారికే పట్టం కట్టబోతున్నారా..?

30-04-202130-04-2021 12:17:26 IST
2021-04-30T06:47:26.361Z30-04-2021 2021-04-30T03:33:00.837Z - - 14-05-2021

తిరుపతి, నాగార్జున సాగర్ లలో ప్రజలు వారికే పట్టం కట్టబోతున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ను ఆరా సంస్థ వెల్లడించింది. ఈ ఎన్నికలో అత్యధికంగా వైసీపీకి 65.85 శాతం ఓట్లు వచ్చినట్టు ఆరా అంచనా వేసింది. అదే సమయంలో టీడీపీకి 23.10 శాతం, బీజేపీ-జనసేన కూటమికి 7.34 శాతం, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్టు తెలిపింది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలను 'ఆరా' సంస్థ వెల్లడించింది. అధికార టీఆర్ఎస్ కే ఓటర్లు మరోమారు పట్టం కట్టినట్టు 'ఆరా' సంస్థ చెబుతోంది. టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 39.93 శాతం, బీజేపీకి 6.31 శాతం ఓట్లు వచ్చినట్టు తెలిపింది. ఇదే ఉప ఎన్నికపై 'ఆత్మసాక్షి' సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పంచుకుంది. ఇందులోనూ టీఆర్ఎస్ గెలుస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ కు 43.5 శాతం, కాంగ్రెస్ పార్టీకి 36.5 శాతం, బీజేపీకి 14.6 శాతం ఓటింగ్ వచ్చినట్టు 'ఆత్మసాక్షి' తెలిపింది.

పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. 

 

పుదుచ్చేరి( మొత్తం స్థానాలు 30 ... మ్యాజిక్ ఫిగర్ 16  ) 

 

ఏబీపీ-సీ ఓటర్

 

ఎన్డీయే 19-23

కాంగ్రెస్ నేతృత్వ ఎస్డీయే 6-10

ఇతరులు 1-2

 

రిపబ్లిక్-సీఎన్ఎక్స్

 

ఎన్డీయే 16-20

కాంగ్రెస్ నేతృత్వ ఎస్డీయే 11-13

 

 

పశ్చిమ బెంగాల్ (294 అసెంబ్లీ స్థానాలు... మ్యాజిక్ ఫిగర్ 148)

 

రిపబ్లిక్-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్

 

టీఎంసీ... 128-138

బీజేపీ... 138-148

కాంగ్రెస్... 11-21

ఎంఐఎం... 0

ఇతరులు... 0

 

సీ ఓటర్-ఏబీపీ

 

టీఎంసీ... 152-164

బీజేపీ... 109-121

కాంగ్రెస్... 11-21

ఎంఐఎం... 0

ఇతరులు... 0

 

ఈటీజీ రీసెర్చ్

 

టీఎంసీ 164-176

బీజేపీ 105-115

కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-15

 

సీఎన్ఎన్ న్యూస్ 18

 

టీఎంసీ 162

బీజేపీ 115

కాంగ్రెస్-వామపక్ష కూటమి 15

 

పి మార్క్

 

టీఎంసీ 152-172

బీజేపీ 112-132

కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-20

 

తమిళనాడు (234 స్థానాలు... మ్యాజిక్ ఫిగర్ 118 )

 

రిపబ్లిక్-సీఎన్ఎక్స్

 

ఏఐఏడీఎంకే కూటమి 58-68

డీఎంకే కూటమి 160-170

ఎంఎన్ఎం 0

ఏఎంఎంకే కూటమి 4-6

ఇతరులు 0

 

యాక్సిస్-మై ఇండియా

 

డీఎంకే కూటమి 175-195

ఏఐఏడీఎంకే కూటమి 38-54

ఏఎంఎకే కూటమి 1-2

ఎంఎన్ఎం 0-2

 

పీ మార్క్

 

ఏఐఏడీఎంకే కూటమి 40-65

డీఎంకే కూటమి 165-190

ఏఎంఎంకే కూటమి 1-3

 

టుడేస్ చాణక్య

 

డీఎంకే కూటమి 164-186

ఏఐఏడీఎంకే కూటమి 46-68

 

కేరళ (అసెంబ్లీ స్థానాలు 72... మ్యాజిక్ ఫిగర్ 72)

 

ఇండియాటుడే-యాక్సిస్

 

ఎల్డీఎఫ్ కూటమి 104-120

యూడీఎఫ్ కూటమి 20-36

ఎన్డీయే 0-2

 

రిపబ్లిక్-సీఎన్ఎక్స్

 

ఎల్డీఎఫ్ కూటమి 72-80

యూడీఎఫ్ కూటమి 58-64

ఎన్డీయే 1-5

 

అసోం (మొత్తం స్థానాలు 126... మ్యాజిక్ ఫిగర్ 64)

 

ఏబీపీ-సీ ఓటర్

 

ఎన్డీయే 58-71

కాంగ్రెస్ కూటమి 53-66

ఇతరులు 0-4

 

పి మార్క్

 

బీజేపీ కూటమి 62-70

కాంగ్రెస్ కూటమి 56-64

ఇతరులు 0-4

 

ఇండియాటుడే-యాక్సిస్

 

బీజేపీ కూటమి 75-85

కాంగ్రెస్ కూటమి 40-50

ఇతరులు 1-4

 

రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్

 

బీజేపీ కూటమి 74-84

కాంగ్రెస్ కూటమి 40-50

ఇతరులు 1-3

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle