అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
07-03-202107-03-2021 00:02:56 IST
2021-03-06T18:32:56.920Z06-03-2021 2021-03-06T17:50:16.985Z - - 11-04-2021

ఎవరికి అంతొద్దు. ఎవరు కాస్త కంట్రోల్ లో ఉండాలి. మోడీని అంతొద్దు అనే దమ్ము దేశంలో ఎవరికైనా ఉంటుందా. సీఎం కేసీఆర్ లాంటి వాళ్లే.. బెండ్ తీస్తామని చెప్పి.. బెండ్ అయిపోయారు అంటూ.. ఎన్నో కామెంట్స్ ఉన్నయ్. సీఎం జగన్ లాంటి వాళ్లు కూడా.. నాకెందుకొచ్చిన గోలలే.. నా కేసులు నాకున్నయ్.. నా రాష్ట్రానికి అప్పులున్నయ్.. వాటితో తిప్పలున్నయ్ అని.. తంటాలు పడుతుంటారు. ఇప్పుడు.. ఆయన్ని అంతొద్దు అనే దమ్ముందా.. అంటే మాత్రం అమిత్ షా ఊరుకుంటారా.. ఎవరిపైకి అయినా.. సీబీఐను పంపరూ. పంపుతారు కదా.. మొన్నటి వెస్ట్ బెంగాల్ లో ఏం జరిగిందో తెలిసిందే కదా.. పాత కేసుల్ని తవ్వారు అమిత్ షా. తనని టార్గెట్ చేస్తేనే అలా అంటే.. మోడీని టార్గెట్ చేస్తే ఊరుకుంటారా చెప్పండి.
సో.. మోడీని కాదు కాబట్టి.. మోడీ మిగతా వారిని అంటున్నారు. మరి మోడీ ఎవరిని అంటున్నారు అంటే.. ఇంకెవరిని చెప్పండి.. ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నారు అనుకుంటాం. కానీ.. ఇక్కడ అది కూడా కాదు. తను తన సొంత పార్టీ లీడర్లనే... అంతొద్దు, ఇది చాలు.. కాస్త కంట్రోల్ లో ఉండండి.. అంటున్నారట. అంతే కాదు.. ఉన్నట్లుండి వ్యక్తిత్వ వికాస నిపుణులు అయిపోయారు అంటూ.. పార్టీలో లీడర్లు.. ప్రత్యర్థులు చెవులు కొరుక్కుంటున్నారట.
అంతేగా.. మామూలుగా అయితే.. మోడీ టార్గెట్ వేరే.. దుమ్ముదులిపేస్తారు. మరి ఏమనుకుంటున్నారో ఏమో.. పరిస్థితులు సరిగా లేవని ఆలోచించారా.. రైతుల ఉద్యమంతో నష్టం తప్పదు అని భయపడుతున్నరా.. అందరినీ మంచి చేసుకుంటే తప్ప.. వార్నింగులతో నడవదు అనే క్లారిటీకి వచ్చారో తెలీదు కానీ.. సొంత పార్టీ లీడర్లకి చాలా సజెషన్లు ఇస్తున్నారట మోడీ. ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి వ్యాఖ్యలు పడితే అలాంటి వ్యాఖ్యలు చేయకండి. కాస్త కంట్రోల్ లో ఉండండి అంటున్నారట. అవతలి వారు.. రెచ్చగొట్టినా మీరు మాత్రం మాటల్లో డోస్ పెంచకండి.. హుందాగా.. డిగ్నిఫైడ్ గా.. క్లాస్ గా మాట్లాడండి అంటూ రూల్స్ పంపారట. ఈ రూల్స్ పంపడానికి కరపత్రాలేం ఉండవు కదా.. అందరికీ సింపుల్ గా చెప్పారట. ఒకరి నుంచి ఒకరు.. వారి వారి కిందిస్థాయి లీడర్లకి చెప్పుకుంటున్నారట. మనం రెచ్చిపోతే.. జనం రెచ్చిపోతారు.. తర్వాత ఎన్నికల్లో పార్టీ దెబ్బ తింటుంది.. ఎన్నికలు అయిపోయేదాకా.. కంట్రోల్ లో ఉంటే.. తర్వాత అంతా మన కంట్రోల్ లోకి వస్తుంది అని సలహా ఇచ్చారట. అంతేకాదు.. స్వీట్ వార్నింగ్ అని కూడా చెప్పారట. అద్దీ మ్యాటరు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా