మమత ఆరోపణ అబద్దం.. ఆమెపై చర్యకు సిద్ధం.. ఈసీ ప్రకటన
05-04-202105-04-2021 10:20:47 IST
2021-04-05T04:50:47.816Z05-04-2021 2021-04-05T04:50:30.261Z - - 16-04-2021

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ఆ రాష్ట్రంలో రెండో దశ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ వద్దే రెండు గంటలపాటు కూర్చున్న చర్య పశ్చిమ బెంగాల్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం వేసిందని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. పైగా నందిగ్రామ్ జిల్లాలోని సదరు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతోంటూ మమత చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రకటించింది. గత వారం నందిగ్రామ్ లోని పోలింగ్ బూత్ వద్ద మమతా బెనర్జీ ప్రవర్తనపై నిశితంగా పరిశీలన జరుపుతున్నామని ఎన్నికల కమిషన్ సూచించింది. ఆ పోలింగ్ బూత్‌లో ఓటు వేయనీకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారంటూ మమత రాతపూర్వకంగా చేసిన ఆరోపణ సత్యదూరమని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నైతిక నియమావళికి చెందిన సెక్షన్ల కింద తాను చర్య చేపడతానని కూడా ఈసీ పేర్కొంది. కానీ ఈసీ నిర్ణయాన్ని ఖండించిన మమతా బెనర్జీ ఇది ఆమోదనీయం కాదని ఈ వ్యవహారంపై తాము కోర్టుకు వెళతామని హెచ్చరించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రబిందువుగా నిలిచిన నందిగ్రామ్ నియోదకవర్గంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారిపై తలపడుతున్నారు. గతంలో మమతకు ఎంతో సన్నిహితనేతగా ఉండిన సువేందు తర్వాత బీజేపీలోకి జంప్ చేసి మమతకు సవాల్ విసిరారు. దమ్ము ఉంటే తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో తనతో పోటీ చేయాలని సువేందు సవాల్ విసిరారు. దీంతో దూకుడుకు మారుపేరైన మమత నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని ఎదురు సవాల్ చేశారు. రెండో దశ పోలింగ్ సందర్భంగా, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న ముఖ్యమంత్రి నందిగ్రామ్ లోని ఒక పోలింగ్ బూత్ వద్ద బీజీపీ, తృణమూల్ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో తలదూర్చి రెండుగంటలపాటు ఆ పోలింగ్ బూత్ వద్దే కుర్చీలో భైటాయించి నేరుగా గవర్నర్‌కి కాల్ చేశారు. స్థానికుల ఆమెపై తిరగబడటంతో భద్రతా బలగాలు ఆమెను కాపాడి బయటకు తీసకొచ్చారు. కాగా పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మమత ఆరోపించడం సంచలన కారణమైంది. దీనిపై విచారణ మొదలెట్టిన ఎన్నికల కమిషన్ మమత సరళిపై తీవ్రవిచారం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన ఒక వార్తను ప్రాతిపదికగా చేసుకుని గౌరవనీయ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మమత నేరుగా సంబంధిత పోలింగ్ బూత్‌వద్దకు వెళ్లి గంటలపాటు వివాదాన్ని సృష్టించడం ఏమాత్రం సరైన ప్రవర్తన కాదని ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాల సమీపంలో తిష్ట వేసి అసహజంగా వ్యవహరించిన నేరకు జరిమానా విధించవచ్చని, మూడు నెలల జైలు శిక్ష కూడా విధించవచ్చని ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని 131వ సెక్షన్ పేర్కొంటోందని ఈసీ గుర్తు చేసింది. అయితే హోంమంత్రి అమిత్ షా ఆజ్ఞలను శిరోధార్యంగా తీసుకున్న ఎన్నికల కమిషన్ పోలింగ్ రోజున తమ పార్టీ చేసిన 63 ఫిర్యాదులలో ఏ ఒక్కదాన్ని పట్టించుకోలేదని, ఈ విషయంపై తాము కోర్టుకెళతామని మమత సవాల్ చేశారు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
37 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా