newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

14-04-202114-04-2021 17:35:27 IST
2021-04-14T12:05:27.231Z14-04-2021 2021-04-14T11:57:30.573Z - - 15-05-2021

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచార కార్యక్రమాలపై 24 గంటల నిషేధం ప్రకటించి సంచలనం సృష్టించిన ఎన్నికల కమిషన్ బీజేపీపైనా కొరడా ఝళిపించింది. బెంగాల్‌‍లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నిర్ధారిస్తూ బీజేపీ నేతలపై ఈసీ చర్యలు తీసుకుంది. ప్రత్యేకించి బీజేపీ నేత రాహుల్ సిన్హాపై 48 గంటల నిషేధాన్ని విధించింది. అంతవరకు ప్రచారంలో పాల్గొనవద్దని రాహుల్ సిన్హాను ఆదేశించింది. 

అలాగే బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించి ఈసీ నోటీసులు పంపింది. అంతకు మించి నందిగ్రామ్ నుంచి బీజేపీ తరపున ముఖ్యమంత్రి మమతను ఢీకొంటున్న సువేందు అధికారిని కాస్త నోరు అదుపులో ఉంచుకోవాలంటూ హెచ్చరించింది. ఎన్నికల ప్రచార సమయంలో వీరు చేసిన వ్యాఖ్యల ప్రాతిపదికన వీరిపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

భద్రతా బలగాలను శంకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారకార్యక్రమాలపై 24 గంటల పాటు నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక్కరోజు గడవక ముందే బీజేపీ నేతలపై  కూడా చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ఒక ఎన్నికల ప్రచారంలో సువేందు అధికారి.. బేగమ్‌కు ఓటేస్తే మినీ పాకిస్తాన్ ఏర్పాటవుతుందంటూ చేసిన వ్యాఖ్యలను ఈసీ సీరియస్‌గా పరిగణించింది. సువేందు అధికారి తన నోటిని కాస్త అదుపులో ఉంచుకోవాలంటూ మందలించింది.

మరోవైపు బీజేపీ నేత రాహుల్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే ఆయనపై నిషేధం ప్రకటిచింది. సిన్హా వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న ఎన్నికల కమిషన్ పరిస్థితి తీవ్రత దృష్ట్యా తనను ప్రచారం నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటల వరకు తనపై నిషేధం ఉంటుందని తెలిపింది.

కూచ్ బెహార్‌లో భద్రతా బలగాల కాల్పుల ఘటనపై వ్యాఖ్యానించిన రాహుల్ సిన్హా మరింత మంది ప్రజలు కాల్పులకు బలవుతారంటూ చేసిన వ్యాఖ్యలకు గాను సిన్హాపై 48 గంటలపాటు ఈసీ నిషేధం ప్రకటించింది. కూచ్ బెహార్‌లో నలుగురిని కాదు.. ఎనిమిది మందిని భద్రతా బలగాలు కాల్చి చంపి ఉంటే బాగుండేదని సిన్హా చేసిన వ్యాఖ్యలు దుమారం లేపడంతో బీజేపీ సైతం ఆయనను ఖండించిన విషయం తెలిసిందే.

మరోవైపు బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌  చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ ఫిర్యాదు చేయడంతో, బుధవారం ఉదయంకల్లా  వివరణ ఇవ్వాల్సిందిగా దిలీప్‌ను ఈసీ ఆదేశించింది. సితాల్‌కుచిలో బుల్లెట్ల దెబ్బను రుచిచూసిన పోకిరీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారంటూ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యకు గాను ఈసీ ఆయనకు నోటీసు పంపింది.

మతం పేరుతో ఓట్లు ఎలా అడుగుతారు.. మమతకు షాక్ ఇచ్చిన ఈసీ

 

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   23 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   an hour ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle