newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

డీఎంకేతో వియ్యం.. ఎన్నికల్లో కయ్యం.. తెగతెంపులకు కాంగ్రెస్ సిద్ధం

07-03-202107-03-2021 11:40:33 IST
2021-03-07T06:10:33.868Z07-03-2021 2021-03-07T06:10:31.818Z - - 14-06-2021

డీఎంకేతో వియ్యం.. ఎన్నికల్లో కయ్యం.. తెగతెంపులకు కాంగ్రెస్ సిద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జాతీయ పార్టీలపై తమిళనాడులో ద్రావిడ పార్టీలు ఎలా ఆధిపత్యం చలాయిస్తాయో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. అటు బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 20కి లోపుసీట్లే ఇస్తామని అన్నాడీఎంకే భీష్మించుకోగా, అతకంటే ఎక్కువసీట్లు ఇవ్వలేమని డీఎంకే కూడా కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పింది. దీంతో అవమానకరంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తును రద్దు చేసుకుని ఒంటరిగా పోరాడటానికి సిద్ధమైంది.

యూపీఏ కూటమిలో పదేళ్లకు పైగా కొనసాగిన డీఎంకేతో తెగదెంపులు చేసుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్‌ నాయకత్వం సిద్ధమైంది. తుది నిర్ణయం బాధ్యతను ఏఐసీసీ మాజీ అధ్క్షులు రాహుల్‌గాంధీపై మోపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం. 

డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపుపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వలెనే ఈసారి కూడా 41 సీట్లు కావాలని కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. అయితే 41లో కేవలం 8 సీట్లు గెలుపొందడం వల్లనే 2016 ఎన్నికల్లో అధికారం దక్కలేదని డీఎంకే గుర్రుగా ఉంది.

అందుకే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలకు మించి కాంగ్రెస్‌‌కి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆరంభంలో అలానే ఉంటుంది, రానురానూ డీఎంకే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్‌ అంచనా వేసింది. ప్రజాబలం, పెద్దగా ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్‌కు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సీట్లను కేటాయిస్తే మరోమారు నష్టపోతామని డీఎంకే పట్టుదలతో ఉంది. 

ఐ–ప్యాక్‌ అనే సంస్థతో సర్వే చేయించిన సర్వేలో కూడా కాంగ్రెస్‌ బలహీనం బయటపడడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌ మెట్టుదిగనందున చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. మరీ తక్కువ సీట్లలో పోటీచేస్తే కాంగ్రెస్‌ ప్రతిష్ట దెబ్బతింటుందని అగ్రనేతలు భావించారు. దీంతో నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించాలని నిర్ణయించి అత్యవసరంగా సమావేశమయ్యారు.

డీఎంకే చర్చల్లో తనకు ఎదురైన అనుభవాలను టీఎన్‌సీసీ అ«ధ్యక్షులు కేఎస్‌ అళగిరి పార్టీ శ్రేణులతో పంచుకుంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో పార్టీ నేతలు తల్లడిల్లిపోయారు. కూటమిలో కొనసాగడమా, వద్దా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినపుడు ‘30 సీట్లిస్తే సరే లేకుంటే ఒంటరి పోటీకి దిగుదాం’అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కరుణానిధి కాలం నుంచి డీఎంకే కూటమిలో కొనసాగుతున్నాం, చర్చలకు వచ్చినపుడు కాంగ్రెస్‌ నేతలకు కరుణానిధి ఎంతో మర్యాద ఇచ్చేవారు. అయితే ఈసారి కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ కురువృద్ధుడు ఉమన్‌చాందీ వస్తే కనీస స్థాయిలో ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేగాక చర్చల్లో తీవ్ర అవమానాలకు గురయ్యామని కాంగ్రెస్‌ నేతలు బాధపడ్డారు. 

దీంతో ఉన్నట్లుండి తారుమారైన ఈ పరిస్థితులను రాహుల్‌గాంధీకి వివరించేందుకు కర్ణాటకు చెందిన కాంగ్రెస్‌ అగ్రనేత వీరప్పమెయిలీ శనివారం ఢిల్లీ పయనమయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగడం ఇష్టం లేదు, అయితే రాహుల్‌ ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లు కేటాయిస్తే ఒప్పుకోవద్దని తమిళనాడులో ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్‌గాంధీ చెప్పినట్లు సమాచారం. 

ఈలోగా డీఎంకేతో వికటిస్తే కాంగ్రెస్‌ను కలుపుకుని పోయేందుకు కమల్‌హాసన్‌ సిద్ధంగా ఉన్నారు. తన పార్టీ నేతలను ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనేతల వద్దకు రాయబారం పంపారు. బీజేపీతో డీఎంకే రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాల వారీగా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తోందని, ఇందుకు ఇటీవల పుదుచ్చేరీలో కాంగ్రెస్‌ పతనం, తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే నిదర్శనమని కమల్‌ శనివారం నాటి ప్రచారంలో కొత్త కోణాన్ని అందుకున్నారు.   


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle