newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బెంగాల్ చేజారింది.. వారణాసికి రండి దీదీ.. ప్రధాని మోదీ ఎద్దేవా

04-04-202104-04-2021 11:03:58 IST
2021-04-04T05:33:58.306Z04-04-2021 2021-04-04T05:33:55.563Z - - 16-04-2021

బెంగాల్ చేజారింది.. వారణాసికి రండి దీదీ.. ప్రధాని మోదీ ఎద్దేవా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బెంగాల్ తమరి చేజారిపోయింది కాబట్టి దీదీ ఇప్పుడు బయటిప్రాంతంలో నివాసంకోసం వెదుకుతున్నట్లుందని, వారణాసికి వస్తే ఆదరిస్తామని ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అపహాస్యం చేశారు. హాల్డియా నుంచి వారణాసికి ఒక ఓడ కూడా సిద్దంగా ఉందని ఎప్పుడైనా మమత దాంట్లో ఎక్కి వారణాసికి రావచ్చని ప్రధాని సూచించారు. పైగా వారణాసి ప్రజలు చాలా విశాల హృదయులు కాబట్టి మమతను వారు టూరిస్టు అని అవుట్ సైడర్ అని పిలవబోరని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అయితే వారణాసిలో చాలామంది ప్రజలు తిలకం ధరిస్తారని, జై శ్రీరాం అని నినదిస్తారని అక్కడ మీరు ఎవరిపైనా ఆగ్రహం వ్యక్తం చేయలేరని మోదీ చెప్పారు. దయచేసి వారణాసి ప్రజలపై ఆగ్రహం ప్రదర్శించవద్దు దీదీ. వారు మీతో కలిసి జీవిస్తారు. వారు మిమ్మల్ని ఢిల్లీ వెళ్లనీయరు. వారణాసిలోనే వారు మిమ్మల్ని ఉండనిస్తారు అని మోదీ పశ్చిమబెంగాల్‌ సీఎంకు సూచించారు. 2014, 2019లో రెండు దఫాలు వారణాసి లోక్ సభా నియోజకవర్గం నుంచే మోదీ పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధానాయుధం ఏమిటంటే బీజేపీ రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చిన ఔట్ సైడర్ అని ఆరోపించడమే. మోదీపై చాలాసార్లు మమతా చేసిన దాడి కూడా ఇదే మరి. బెంగాల్ సంస్కృతిని బీజేపీ ధ్వంసం చేస్తుందని ఆమె పదే పదే చెబుతూ వచ్చారు. 

నందిగామ్ కాకుండా మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారా అని మోదీ బెంగాల్ సీఎం దీదీని అపహాస్యం చెప్పినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. వచ్చే ఎన్నికల్లో మమత వారణాసి నుంచే పోటీ చేస్తారని సవాలు చేసింది. బెంగాల్ ఎన్నికల్లో మమత తీవ్ర అభద్రతను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆమె  రాష్ట్రం బయటినుంచి పోటీ చేస్తే మంచిదని ప్రధాని మోదీ ఇటీవలే హేళన చేశారు.

తాను కూడా ఔట్ సైడర్‌ కాబోతున్నానని బీజేపీ తనపై చేస్తున్న ఆరోపణలను శనివారం 24 ఉత్తర పరగణాల జిల్లాలో ర్యాలీ సందర్భంగా మమత తిప్పికొట్టారు. బీజేపీ బెంగాల్‌ను విభజించాలని కోరుకుంటోంది. వీళ్లు బెంగాల్‌ను దాని భాషను, సంస్కృతిని అంతమొందించాలని చూస్తున్నారు. అందుకే మైనారిటీ సోదరసోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తపడండి అంటూ మమత సూచించారు.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   32 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle