newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఢిల్లీ వాయు కాలుష్యం.. కోట్ల మంది మంత్రాలు ఉచ్చరిస్తే..?!

05-11-202005-11-2020 21:29:07 IST
Updated On 06-11-2020 07:23:04 ISTUpdated On 06-11-20202020-11-05T15:59:07.424Z05-11-2020 2020-11-05T15:58:58.392Z - 2020-11-06T01:53:04.932Z - 06-11-2020

ఢిల్లీ వాయు కాలుష్యం..  కోట్ల మంది మంత్రాలు ఉచ్చరిస్తే..?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇప్పుడు దీపావళి సందర్భంగా ప్రజలంతా బాణాసంచా కాల్చితే కాలుష్యం మరింతగా పెరిగిపోతుంది. అందుకే క్రాకర్స్ లేకుండా కాలుష్యం పెరగనీయకుండా దీపావళి జరుపు కుందామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కేబినెట్ మంత్రులందరూ కలిసి లక్ష్మీ పూజని నిర్వహించనున్నారు.

పూజ నిర్వహణ మొదటినుండి చివరి వరకు టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతుందని కనుక ఢిల్లీ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెబ్ కాస్ట్ ద్వారా మాట్లాడుతూ అన్నారు. ‘మనందరం కలిసి దీపావళిని జరుపుకుందాం... కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాకర్స్ ని కాల్చడానికి వీల్లేదు. బాణాసంచాని కాల్చడం అంటే...మనం మన పిల్లల, కుటుంబ సభ్యుల జీవితాలతో చెలగాటం ఆడటమే. దీపావళి నాడు రాత్రి గం.7.39ని. లకు మనమంతా కలిసి లక్ష్మీ పూజని చేద్దాం’ అన్నారాయన. తన సహమంత్రులతో కలిసి పూజని మొదలుపెడతానని, అది టెలి కాస్ట్ అవుతుందని కేజ్రీవాల్ వివరించారు.

ప్రజలందరూ టీవీలను ఆన్ చేసి పూజారులు చెప్పే మంత్రాలను వింటూ పూజలో పాల్గొనాలని కోరారు. ‘రెండుకోట్ల మంది ఢిల్లీ ప్రజలు మంత్రాలను ఒకేసారి జపిస్తే... 14 ఏళ్ల వనవాసానికి వెళ్లిన రాముడిని తిరిగి స్వగృహానికి ఆహ్వానిస్తే... ఢిల్లీ అంతటా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నేను నమ్ముతున్నాను’ అన్నారాయన.

ఢిల్లీలో పర్యావరణ శాఖా మంత్రి గోపాల్ రాయ్ యాంటీ క్రాకర్ ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రీన్ క్రాకర్స్ ని మాత్రమే తయారుచేసి, అమ్మేలా చర్యలు తీసుకోవాలని...ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని, జిల్లా మెజిస్ట్రేటులను, ఢిల్లీ పోలీసులను ఆయన కోరారు.  

ఇదిలా ఉండగా... నవంబరు ఏడు నుండి ముప్పయ్యో తారీఖు వరకు బాణాసంచా కాల్చడాన్ని నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్... కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖకి, నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.

దాంతో రాజస్థాన్, హర్యానా, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు బాణాసంచాని నిషేధించాయి. వాయుకాలుష్యంతో పాటు, కరోనాని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా ఈ నిబంధనని పాటించాలని ఆయా రాష్ట్రప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.  

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   2 hours ago


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   4 hours ago


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   16 hours ago


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   17 hours ago


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   18 hours ago


పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

   a day ago


ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

   20-09-2021


హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

   20-09-2021


అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

   20-09-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle