'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
19-01-202119-01-2021 18:30:06 IST
Updated On 19-01-2021 18:30:43 ISTUpdated On 19-01-20212021-01-19T13:00:06.498Z19-01-2021 2021-01-19T12:59:59.840Z - 2021-01-19T13:00:43.776Z - 19-01-2021

పశ్చిమబెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటానని ఇటీవలే అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరిన సువేందు అధికారి శపథం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలోంచి పోటీ చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి మమతపై 50 వేల మెజారిటీతో గెలుపొందగపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటానని సువేందు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల క్రితం తనకు అధికారాన్ని తెచ్చిపెట్టిన రైతు ఉద్యమ కేంద్రం నందీగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నట్టు సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. కావాలంటే కోల్‌కతాలోని భవానిపూర్, తూర్పు మిడ్నాపూర్‌లోని నందీగ్రామ్ రెండింటినుంచీ పోటీ చేస్తానని తెలిపారు. గత ఐదేళ్ళలో తొలిసారిగా నందీగ్రామ్ బహిరంగ సభలో ఆమె ఈ సంచలన ప్రకటన చేశారు. మమత సవాలును స్వీకరించిన సువేందు అధికారి ఆమెపై భారీ మెజారిటీతో తాను గెలుపొందడం ఖాయమని చెప్పారు. తనకు సవాలు చేసి మరీ పార్టీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారిపై మమత పట్టరాని ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా లూటీ చేసిన ప్రజాధనాన్ని కాపాడుకోవడానికే ఇలాంటి నేతలంతా పాలక పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారని మమత ఆరోపించారు. ఈ నేపథ్యంలో మమత సవాలును సువేందు స్వీకరించారు. నందిగామ నుంచే అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారాన్ని మొదలెట్టేశారు. ఇక్కడినుంచే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా బక్షిని నా నందిగ్రామ్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని కోరుతున్నాను అని సువేందు చెప్పారు. దీంతో వేదికపై ఉన్న బక్షి ఆయన అభ్యర్థనను వెంటనే ఆమోదించారు. నాకు నందిగామ నుంచి పోటీ చేసే అవకాశాన్ని మా పార్టీ కల్పించినట్లయితే, మమతపై 50 వేల మెజారిటీతో గెలుపు సాధిస్తాను. అలా కాకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటాను అని సువేందు శపథం చేశారు. మమతా బెనర్జీ, ఆమె మనవడు అభిషేక్ చెప్పుచేతల్లో టీఎంసీ నడుస్తోంది కానీ బీజేపీ మాత్రం ముందుగా చర్చించిన తర్వాతే తన అభ్యర్థులను ఎంపిక చేస్తోందని సువేందు చెప్పారు. మమత కూడా నందీగ్రామ్ తన లక్కీ ప్లేస్ అని చెప్పుకున్నారు. నందీగ్రామ్ నాకు లక్కీ ప్లేస్ అని గతంలో ఎన్నోసార్లు రుజువైంది. 2016 ఎన్నికలలో నందీగ్రామ్ నుండే ప్రకటించా.. ఈ రోజు కూడా నందీగ్రామ్‌కు వచ్చాను. ఈ క్రమంలో 2021ఎన్నికలలో టీఎంసీ గెలిచి తీరుతుదంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో భవానీపూర్ నుంచి గెలుపొందిన ఆమె దయచేసి చెడుగా భావించవద్దు, మీకోసం మంచి అభ్యర్థిని కేటాయిస్తానని భవానీపూర్ వాసులకు భరోసా ఇచ్చారు. తద్వారా బీజేపీకి, ఇటు సువేందుకు సవాలు విసిరారు. అంతేకాకుండా టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సువేందు అధికారికి చెక్ పెట్టాలనే వ్యూహంలో భాగంగానే మమత అక్కడ పోటీకి సిద్ధమైనట్లు టీఎంసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు టీఎంసీకి నందీగ్రామ్ అత్యంత ప్రతిష్టాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఎందుకంటే 2006-08లో నందీగ్రామ్, సింగూర్‌లో భూసేకరణకు వ్యతిరేక సామూహిక ఉద్యమాలు బెనర్జీ రాజకీయ పునరుత్థానానికి మార్గం సుగమం చేశాయి. ఈ క్రమంలో 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
8 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
8 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
15 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
14 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
16 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
16 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
18 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
21 hours ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago

రాష్ట్ర బంద్ లో విజయసాయి రెడ్డికి చేదు అనుభవం
a day ago
ఇంకా