newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

గవర్నర్ స్థాయి వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు.. అమిత్ షా

18-10-202018-10-2020 13:42:45 IST
2020-10-18T08:12:45.458Z18-10-2020 2020-10-18T08:11:54.277Z - - 25-10-2020

గవర్నర్ స్థాయి వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు.. అమిత్ షా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసేముందు ఆ రాష్ట్ర గవర్నర్ కొన్ని పదాలను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త పడాల్సి ఉందని కేంద్ర హోమంత్రి అమిత్ షా సూచించారు. ఆలయాలను తిరిగి తెరిచే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. 

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నేను లేఖ చదివాను. ఆల‌యాల్లో ద‌ర్శ‌నాల‌కు అమ‌నుతి ఇవ్వాలంటూ ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సంయమనం పాటించవచ్చని నేను నమ్ముతున్నాను' అని షా పేర్కొన్నారు. 

కాగా.. మహారాష్ట్రలోని ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవడం గురించి కోష్యారి గత వారం ఠాక్రేకు లేఖ రాశారు. ఈ లేఖలో 'ప్రార్థనా స్థలాలను తిరిగి ప్రారంభించడాన్ని వాయిదా వేయడానికి మీకేమైనా దైవ సందేశం వ‌చ్చిందా... సెక్యుల‌ర్ అన్న ప‌దాన్ని వ్య‌తిరేకించే మీరు అక‌స్మాత్తుగా లౌకికవాదిగా మారిపోయారా' అని ఆయ‌న త‌న లేఖ‌లో ప్ర‌శ్నించారు.

దీనికి సమాధానంగా సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే స్పందిస్తూ.. 'నేను ఆచరించే హిందుత్వకు గవర్నర్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని అన్నారు. ప్రజల ఉద్వేగాలు, నమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటూనే వారి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం కూడా ఉందని, లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సరికాదని ఉద్ధవ్ కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

మహరాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 5 నుంచి 50 శాతం సామర్థ్యంతో బార్లు, రెస్టారెంట్లు తెరవడానికి అనుమతించింది. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం అవుట్ డోర్ స్పోర్ట్స్‌కి, సాధారణ షాపులు, అంతర జిల్లాలకు ప్రయాణాలను ఎలాంటి నిబంధనలు లేకుండా అనుమతించింది. అదే సమయంలో భక్తులు ఎక్కువగా గుమికూడతారని ప్రార్థనా స్థలాలను అనుమతించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే  కరోనా వైరస్ కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇంతపరకు మహారాష్ట్ర 1,90,192 క్రియాశీల కేసులు నమోదు కాగా 41,502 మంది చనిపోయారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle