newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

కరోనా లెక్కల తకరారు? ఎవరిని నమ్మించడానికి? ఎవరికి వంచించడానికి??

25-09-202025-09-2020 14:33:11 IST
Updated On 25-09-2020 16:00:25 ISTUpdated On 25-09-20202020-09-25T09:03:11.504Z25-09-2020 2020-09-25T09:03:09.150Z - 2020-09-25T10:30:25.936Z - 25-09-2020

కరోనా లెక్కల తకరారు? ఎవరిని  నమ్మించడానికి? ఎవరికి  వంచించడానికి??
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాపై టెస్టులు, కరోనా లెక్కల విషయంలో  దేశంలో అంతులేని అయోమయం  నెలకొనిన ఉంది. ఇప్పటికీ  కేంద్ర ఆరోగ్య కుటుంబ  సంక్షేమ  శాఖ  కానీ, రాష్ట్రాల  వైద్య ఆరోగ్య శాఖలు కానీ సరైన గణాంకాలు వెలువరించడం లేదు. కరోనా కేసులు, మరణాలు, రికవరీలకు  సంబంధించి ఇప్పటికీ సరైన లెక్కలు లేలవు.  ప్రజల్లో ఎంతమందికి కరోనా సోకిందో తెలియదు. కరోనా  టెస్టుల ఖర్చుకు  భయపడి జనం టెస్టులకు  దూరంగా  ఉంటున్నారు. ఒక  వేళ కరోనా  పరీక్షలు ఉచితంగా అందించి ఉంటే జనం క్యూ కట్టేవారు. ఎంతమందికి పాజిటివ్‌ ఉందో తెలిసేది. కానీ కేంద్ర రాష్ట్రాలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రెండోదశ విజృంభణ మొదలయ్యిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించడమే కరోనా కట్టడి చర్యల కేంద్రం, రాష్ట్ర  ప్రభుత్వాలూ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించాయో  అర్ధమౌతుంది. సంపన్నులు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికీ కరోనా ముప్పు  ఉంది. ఇప్పటికే పలువురు   రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వారిలో  కొందరు మహమ్మారి  కాటుకు  బలయ్యారు. అంటే దేశంలో సామాన్యుల పరిస్థితి  ఏమిటన్నది మళ్లీ వివరించాల్సిన అవసరం లేదు.

వాస్తవ పరిస్థితిని, గణాంకాలనూ  వెల్లడించకుండా...మరణాల రేటు తగ్గిందని, రికవరీల  రేటు పెరిగిందని ప్రకటించుకోవడం ఆత్మవంచన మాత్రమే కాదు...ప్రజారోగ్యాన్ని ప్రమాదపుటంచుల్లో నిలబెట్టడమే  అవుతుంది. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కేసులు, మరణాల గణాంకాలను  నోటి కొచ్చినట్లు  వెల్లడిస్తుంటే...ప్రమాదం  ముంచుకొస్తున్నదంటూ ఆందోళన చెందడం తప్ప జనం, మేధావులు, విజ్ణులు, వైద్య  నిపుణులు  మరేమీ  చేయలేని  నిస్సహాయ  స్థితిలో ఉన్నారు  కరోనా దేశంలో విలయ తాండవం చేస్తుంటే...దాని విజృంభణకు కట్టడి  చర్యల  పటిష్టంగా  చేపడుతూ, ప్రజలకు అండదండగా  నిలవాల్సిన  ప్రభుత్వాలు  చేతులెత్తేశాయి సామాన్య ప్రజలను    పైవేట్‌ ఆస్పత్రుల దోపిడీకి వదిలేశాయి  దేశంలో మృతుల సంఖ్య లక్షకు చేరువ  అవుతుంటే రోజుకు 90 వేలమంది కొత్తగా వైరస్‌కు గురవుతున్న పరిస్థితి నెలకొంది.  కరోనా కేసుల  విషయంలో అమెరికా తరువాత  రోండో స్థానంలో నిలిచిన  ఇండియా,  రోజువారి పాజిటివ్‌ కేసుల నమోదులో  మొదటి స్థానంలో ఉంది.

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతను చూస్తుంటే అతి త్వరలో  కరోనా కేసుల  విషయంలో ఇండింయా టాప్ కు చేరుకుంటుందనడంలో సందేహం  లేదు. దేశంలో కరోనా నిర్ధారణ  పరీక్షలు తక్కువగా జరపడం, జనన మరణాల నవెూదు ఖచ్చితంగా లేకపోవడం వీటన్ననిటికీ  మించి  రికవరీ రేటు లెక్కించే విధానం కూడా  అస్తవ్యస్థంగా ఉండటంతో దేశంలో  కరోనా వ్యాప్తి  నియంత్రణకు వీలు  కానంత వేగంగా విస్తరిస్తుండడానికి  కారణంగా  ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణ చేసింది. పరిస్థితి ఇదే  విధంగా కొనసాగితే వచ్చే నెల చివరి నాటికి మరో లక్ష వరకూ మరణాలు సంభవించే  ప్రమాదం ఉందని డబ్ల్యుహెచ్ ఓ అంచనా వేస్తున్నది. పార్లమెంటు సమావేశాల్లో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ లాకడౌేన్‌ ద్వారా మరో30 క్షమందిని కరోనా బారిన పడకుండా కాపాడామని... మరణాలు కూడా మరో 30,40వేలు పెరగకుండా నిరోధించామని ప్రకటించారు. ఈ ప్రకటనకు శాస్త్రీయ ఆధారాలేమన్నా ఉన్నాయా? కేవలం నోటికొచ్చిన గణాంకాలు చెప్పేశారా అన్న అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

లాకడౌన్‌ వలన ఒక్క భారత్ లో మినహా మిగిలిన అన్ని దేశాలో వైరస్‌ వ్యాప్తి ఉదృతి తగ్గింది. కోవిడ్‌ బారిన పడిన 200 దేశాలను తీసుకుంటే నివారణలో చికిత్సలో భారత దేశం 129 వస్థానంలో వుంది. అన్నిటికీ మించి దేశంలో మరణాల రేటు కన్నా కోలుకున్న వారి సంఖ్య లేదా రికవరీ రేటు ప్రపంచంలోనే ఎక్కువగా వుందని కేంద్రం చెబుతున్న మాటలు వాస్తవ విరుద్దంగా వున్నాయని ఆరోగ్యరంగ నిపుణలు విమర్శిస్తున్నారు. భారత దేశ జనాభాలో యువత శాతం అధికంగా వున్నందున లెక్కు కొంత తక్కువగా కనిపించవచ్చు ఈ దేశంలో సగటు మధ్యంతర వయస్సు 26.8 సంవత్సరాలు కాగా ఇటలీలో అది 43 ఏళ్లపైన వుంటుంది. యువ జనాభా ఇంత ఎక్కువ వున్నా కేసు రెట్టింపు రేటయ్యే వేగం చూస్తుంటే  ఎవరికైనా సరే ఆందోళన కలగక మానదు. ఈ పరిస్థితిని ఎదుర్కొని కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించడానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఒక వేదికగా ఉపయోగించుకోవడానికి బదులుగా...విపక్షాల  గొంతు నొక్కి పార్లమెంటు వేదికగా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పడానికే ప్రభుత్వం పరిమితమైంది.  

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   9 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   13 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   16 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   16 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   17 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   18 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   19 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   19 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   19 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   20 hours ago


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle