ముఖ్యమంత్రికి దోమ కుట్టింది.. సోషల్ మీడియాలో జోకులే జోకులు
20-02-202120-02-2021 15:51:14 IST
2021-02-20T10:21:14.292Z20-02-2021 2021-02-20T10:21:07.983Z - - 09-03-2021

జనం నిత్యం దోమలకాట్లకు గురవుతున్నా వార్తల్లోకి రాదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి దోమలు కుడితే, రాత్రి పూట నిద్రకూడా పట్టకుండా వేధిస్తే అది పతాక శీర్షిక అవుతుంది. ఒక రాత్రి దోమలు కుట్టడం వల్ల ముఖ్యమంత్రికి నిద్రపట్టకపోతే ఏంటట.. ప్రతిరోజూ అవే దోమ కాట్లతో మేమూ చస్తున్నాం కదా. ఇప్పటికైనా మా బాధలు తెలిశాయా తమరికి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు మీద జోకులు వేస్తూ సంబరపడుతుంటడం కొత్త ట్రెండ్ గానే భావించాలి. అసలు విషయం ఏమిటంటే మధ్యప్రదేశ్లోని సిధి ప్రాంతంలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 53 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను నేరుగా కలిసి ఊరడించడానికి స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ ప్రాంతానికి వెళ్లారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత అక్కడే స్థానికంగా ఉన్న సర్క్యూట్ హౌస్లో సీఎం బస చేసారు,. అంతవరకు బాగానే ఉంది. కానీ ముఖ్యమంత్రి బస చేసిన ఆ గృహంలో దోమలు అధికంగా ఉండి కుట్టిన చోట కుట్టకుండా కుడుతుండటంతో ముఖ్యమంత్రి వర్యులకు తెల్లార్లూ నిద్రపట్టలేదట. పైగా అధికారులు దోమ తెర కూడా ఏర్పాటు చేయలేదు. నిద్రకు కరువైన ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి రెండున్నర గంటలకు అదికారులు దోమల మందును సీఎం బస చేసిన ప్రాంతంలో పిచికారీ చేశారట. అంతటితో బాధ తీరలేదు. సీఎం చౌహాన్ బస చేసిన గదికి పక్కనే ఉన్న ట్యాంకర్ నుంచి నీళ్లు ధారగా కారిపోతూ ముఖ్యమంత్రి నిద్రకు మళ్లీ భంగం కలిగించింది. సహాయకులు ఎవరూ లేకపోవటంతో సీఎం స్వయంగా లేచి మోటారును నిలిపివేశారు. అపసోపాలు పడుతు నిద్రలేని రాత్రి గడిపిన ముఖ్యమంత్రి తెల్లారి లేచాక సిధి సర్క్యూట్ హౌస్ ఇన్ చార్జిగా ఉన్న సబ్ ఇంజనీర్ని, మరో ఇంజనీరును సస్పెండ్ చేసేంతవరకు వదల్లేదు. ముఖ్యమంత్రికి విడిదిలో దోమలు కుట్టిన నేరానికి ఇద్దరు ఉద్యోగుల ప్రాణం మీదికి వచ్చింది మరి. సీన్ కట్ చేస్తే రాష్ట్రముఖ్యమంత్రి దోమల బాధతో నిద్రలేని రాత్రి గడపటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలు ఎలాగూ ఈ ఘటనపై వ్యాఖ్యానిస్తాయనుకోండి. కానీ నెటిజన్లు, సాధారణ ప్రజలు సైతం ఈ ఘటనపై వ్యాఖ్యలు చేయడం వింతగొలుపుతోంది. ఏం.. సీఎంకి దోమలు కుడితే ఏంటటం.. మాకూ రోజూ దోమలు కుట్టడం లేదా.. రోజూ నిద్రలేని రాత్రులు గడపటం లేదా.. అంటూ జోకులమీద జోకులు పేలుస్తున్నారు. ముఖ్యమంత్రికి ఇప్పటికైనా తమ బాధలు అర్థమై ఉంటాయని ప్రజలు సంబర పడుతున్నారన్ని మరొక వార్త. ముఖ్యమంత్రి సర్క్యూట్ హౌస్లో బస చేస్తారని చాలా ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా నిర్లక్ష్య వహించినందుకు గాను ఇద్దరు ఇంజనీర్లపై వేటు వేశారు. మరి రోజూ లక్షలమంది జనం దోమల కాట్లబారిన పడి కనీస నిద్రకు దూరమవుతున్నారు కదా.. మరి దీనికి ఎవరిమీద చర్య తీసుకోవాలంటూ నెటిజన్లు హాస్యమాడుతున్నారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా