సంపన్నులు వ్యాక్సిన్‌ను కొని వాడాలి.. మధ్యప్రదేశ్ సీఎం
12-12-202012-12-2020 14:31:02 IST
2020-12-12T09:01:02.652Z12-12-2020 2020-12-12T08:28:49.768Z - - 20-01-2021

ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్‌ను పేదవారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా అందజేయవలసి ఉంటుందని, అదే సమయంలో డబ్బులున్నవాళ్లు, స్థితిమంతలు వ్యాక్సిన్‌ను డబ్బులు పెట్టి వాడితే బాగుంటుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం త్వరలో ఒక చట్టాన్ని ప్రతిపాదించనున్నట్లు చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలో అధికారాన్ని వరుసగా నాలుగోసారి కూడా గెల్చుకున్న శివరాజ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో అమ్మాయిలకు రక్షణ కరువైన ఘటనలు అనేకం చూసిన తర్వాతే లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం గురించి ఆలోచించామన్నారు. అనేక విషయాలు మా కళ్లు తెరిపించాయి. తన పద్నాలుగేళ్ల కూతురు తప్పిపోయందని, ఎవరూ ఆమెను తీసుకెళ్లిపోయారని ఒక తల్లి స్వయంగా నావద్దకు వచ్చి చెప్పింది. చివరకు మా పోలీసులు ఆమెను నేపాల్ సరిహద్దుల్లో నూర్ గంజ్ వద్ద కనుగొన్నారు. ఇలా మహిళలు, బాలికలను వంచించి, బెదిరించి, మోసగిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలా మన అమ్మాయిలను ఎంతమందిని ఇలా తీసుకుపోతూ వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నారనే అంశంపై దర్యాప్తు చేయమని ఒక టీమ్‌ను నియమించాను. మన అమ్మాయిలను కాపాడేందుకు మనకు ఇప్పుడు బలమైన చట్టం అవసరముంది. అమ్మాయిలను వంచించే వారికి ఈ చట్టం అంటే భయపడాల్సి ఉంటుంది. అందుకే ఇది బేటీ బచావో ఆందోళన్ అని పిలవాలి అని చౌహాన్ చెప్పారు.

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి
an hour ago

కేటీఆర్ పరిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా
4 hours ago

జగన్ సర్కార్ మరో డెసిషన్.. ఎందుకు తీసుకుంటారో ఏమో
2 hours ago

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా
5 hours ago

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే
5 hours ago

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?
5 hours ago

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!
6 hours ago

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట
7 hours ago

మితిమీరిన బూతులు.. కొడాలి నానీ రాజకీయాలకు అవసరమా?
7 hours ago

సంగారెడ్డిలో తోప్ సింగ్ కావాలని ఈ మాజీ ఎమ్మెల్యే ఆరాటం.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్
7 hours ago
ఇంకా