newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

వసూళ్లు తప్ప ప్రజారోగ్యం పట్టని కేంద్రప్రభుత్వం..?

30-10-202030-10-2020 18:10:46 IST
Updated On 31-10-2020 12:01:59 ISTUpdated On 31-10-20202020-10-30T12:40:46.442Z30-10-2020 2020-10-30T12:40:41.866Z - 2020-10-31T06:31:59.549Z - 31-10-2020

వసూళ్లు తప్ప ప్రజారోగ్యం పట్టని కేంద్రప్రభుత్వం..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి విజృంభణకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతూ అన్ లాక్ పేరుతో ప్రజలను మహమ్మారి కాటుకు అందుబాటులోనికి తీసుకువస్తున్నది. రికవరీ రేటు ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా అధికంగా ఉందంటూ ప్రతి రోజూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనలతో ఊదరగొట్టేస్తున్నది. దివాళా అంచుకు చేరుకున్న ఆర్థిక వ్యవస్థ కుదుట పడాలంటే జనం బయటకు రావాలి. సాధారణ జీవనం గడపాలి. కొనుగోళ్లు, లావాదేవీలు జోరందుకోవాలి. అన్నిటికీ మించి పన్నులు వసూలు కావాలి. ప్రజారోగ్యం కంటే ఆర్థిక అంశాలే ప్రాధామ్యాలుగా మారిపోయిన పరిస్థితుల్లో కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజా ప్రభుత్వంలా కాకుండా వసూళ్లు చేసుకునే కాబూలీలా వ్యవహరిస్తున్నదని విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజమే గత పక్షం రోజులుగా దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఒకింత తగ్గిందనడానికి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతి ఉదయం విడుదల చేస్తున్న బులెటిన్ గణాంకాలే నిదర్శనం. అయితే ఇది తగ్గుముఖం పట్టడం కాదనీ, రానున్న శీతాకాలంలో కరోనా విజృంభణ మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరికలు చేస్తున్నది. ఇప్పటికే తగ్గినట్టే తగ్గి అమెరికా, యూరోప్ దేశాలలో ఒక్కసారిగా కరోని విజృంభించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను పెడచెవిన పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదని అవగతమౌతుంది. అంతెందుకు భారత్ లో కేరళ కరోనా మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసిన రాష్ట్రంగా ఘనంగా చెప్పుకున్నంత సేపు పట్టలేని చిన్న ప్రమత్తత...ఆ రాష్ట్రంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా చేసింది.

కరోనా కట్టడి చర్యల విషయంలో ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలోలా కట్టుదిట్టంగా వ్యవహరించడం లేదు. సిటీ బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి. జనం జాగ్రత్తలన గాలికొదిలేశారు. మాస్కులు లేకుండా బస్సులు, మెట్రో రైళ్లలో కిక్కిరిని ప్రయాణాలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడంలో నిర్లక్ష్యం పనికిరాదు. కానీ ప్రజలలో ఆ నిర్లక్ష్య ధోరణి ప్రబలడానికి కరోనా కట్టడి చేసేశాం...ఘనత సాధించామని చాటుకోవడానికి ప్రభుత్వాలు పడుతున్న తాపత్రయమే కారణమని భావించాల్సి ఉంటుంది యూరప్‌ దేశాలన్నీ కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణతో కుదేలవుతున్న వేళ మన దేశంలో తొలిసారి ఆ మహమ్మారి క్రమేపీ ఉపశమిస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. కరోనాపై మనం పోరు ప్రారంభించి దాదాపు ఏడు నెలలు కావస్తుండగా జూలై నుంచి అది విస్తరిస్తూ పోయింది.

నియంత్రణ విధానాలను విస్మరిస్తే ఏమవుతుందో ప్రస్తుతం యూరప్‌ దేశాలనూ, అమెరికానూ చూస్తే అర్థమవుతుంది. జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌లు గతవారం మళ్లీ కఠినమైన ఆంక్షల్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. ఇవి ఇంకా పెరుగుతాయని రెండు మూడు రోజులుగా నాయకులు చెబుతున్నారు. కరోనా బయటపడిన తొలి నాళ్లలో కేరళ దాన్ని సమర్థవంతంగానే ఎదుర్కొంది. వరసబెట్టి తీసుకున్న చర్యల కారణంగా అక్కడ కేసుల సంఖ్య రోజుకు కేవలం రెండు, మూడు మాత్రమే వెల్లడైన సందర్భాలున్నాయి. కానీ ఈమధ్య అవి మళ్లీ పెరుగుతున్నాయి. దీని వెనకున్న కారణాలేమిటో నిపుణులు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలయ్యాక జనాన్ని హెచ్చరించడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్ల వరసగా వచ్చిన పండగల్లో జాగ్రత్తలు తీసుకోవడం తగ్గిందని, అందుకే కేసులు పెరిగాయని అంటున్నారు. రవాణా సదు పాయాలను కొనసాగిస్తూనే, ఇతరత్రా కార్యకలాపాలకు చోటిస్తూనే నిరంతరం అందరూ అప్రమ త్తంగా వుండకతప్పదు. ఎక్కడ లోపం జరిగినా పరిస్థితి మొదటికొచ్చే ప్రమాదం వుంటుంది.

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

   6 hours ago


అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

   8 hours ago


ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

   10 hours ago


కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

   13 hours ago


డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

   13 hours ago


పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

   14 hours ago


తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

   16 hours ago


మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

   17 hours ago


బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

   18 hours ago


ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

   18 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle