పశ్చిమ బెంగాల్ ప్రజలందరికీ టీకా ఫ్రీ.. మమత ప్రకటన భోగస్.. బీజేపీ
11-01-202111-01-2021 15:19:23 IST
2021-01-11T09:49:23.228Z11-01-2021 2021-01-11T09:49:19.619Z - - 11-04-2021

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కోవిడ్-19 చుట్టూ పశ్చిమబెంగాల్ రాజకీయాలు కేంద్రీకృతం అయ్యాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సందర్భంగా ఓ కీలక హామీనిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని ఆదివారం నాటి ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మమత ఇలాంటి ప్రకటన చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయడానికి తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు మమత పశ్చిమబెంగాల్ లోని ఆరోగ్య కార్యకర్తలకు లేఖ రాశారు. తొలిదశలో ఆరోగ్య కార్యకర్తలందరికీ కరోనా టీకా ఇస్తామని ప్రకటించారు. పశ్చిమబెంగాల్ జనాభా పది కోట్లు కాగా 6 లక్షలమంది ఆరోగ్య కార్యకర్తలున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర విభాగం మమత ప్రకటన భోగస్ అంటూ వ్యాఖ్యానించంది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో మమత ఘోరంగా విఫలమయ్యారని, డాక్టర్లనుంచి పోలీసు సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ మమత నిర్లక్ష్యం పట్ల నిరసన వ్యక్తం చేశారని బీజేపీ విమర్శించింది. అయితే దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనానిరోధక టీకా కార్యక్రమం ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో దాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలని మమత ఆదరాబాదరాగా ఉచిత సరఫరా గురించి మాట్లాడుతున్నారని బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయా ఎద్దేవా చేసారు. మమత కరోనా టీకా ఉచిత సరఫరా గురించి చెప్పింది ఒకటైతే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసిన విధంగా. టీఎంసీ కార్యకర్తలు దానిపై పోస్టర్లు ప్రచురించే కార్యక్రమం మొదలుపెట్టేశారని మాలవీయ ఆరోపించారు. ఫ్రంట్‌లైన్ కార్యకర్తలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత టీకా వేస్తామని దీదీ ప్రకటించారని టీఎంసీ బోగస్ ప్రచారం మొదలెట్టేసిందని మాలవీయ విమర్శించారు. సిగ్గులేనితనానికి ఏ హద్దులూ ఉండవు అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి గత ఏడాది చివరలో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా ఇలాంటి హామీనే ఇచ్చిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. ఈ ప్రకటన భారీగానే ఓట్లను రాబట్టింది. అయితే ఉచిత వ్యాక్సిన్ హామీపై దేశ వ్యాప్తంగా అప్పట్లో పెను దుమారమే చెలరేగింది. కేవలం ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఇలాంటి హామీని ఇచ్చి ఇతర రాష్ట్రాల ప్రజలను చిన్నచూపు చూస్తున్నారనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు సైతం వినిపించాయి. ఓ అడుగు ముందుకేసిన ప్రతిపక్షం ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేసింది. ఉచిత వ్యాక్సిన్ ప్రకటనను పరిశీలించిన సీఈసీ దానిలో ఎలాంటి తప్పదంలేదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు రాదని తెలిపింది. దీంతో కరోనా వ్యాక్సిన్‌కు రాజకీయ రంగం పులుముకుంది. బిహార్ ఎన్నికల అనంతరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే హామీని ప్రధానంగా ప్రచారం చేసింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏవిధంగా ఓట్లు దండుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ బాటనే ఎంచుకున్న మమతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరుణంగా ఉచిత వ్యాక్సిన్ పంపిణీ హామీపై ముందుగానే కర్చిఫ్ వేసింది. తాము అధికారంలోకి వస్తే వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని సాక్ష్యాత్తూ సీఎం మమత ప్రకటించారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, మున్సిపల్ కార్మికులు, పోలీసు సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా