newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

15-04-202115-04-2021 10:27:59 IST
2021-04-15T04:57:59.500Z15-04-2021 2021-04-15T04:57:38.247Z - - 15-05-2021

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇన్నాళ్లు మమతకు పెట్టని కోటగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ భద్రలోక్ (నగర మధ్యతరగతి జీవులు) ఓట్లలో ఇప్పుడా బీజేపీ పాగా వేసిందా అంటే సమాధానం అవుననే చెప్పాల్సి ఉంటుంది. బెంగాల్ లోని పట్టణ ప్రాంతాలు సాంప్రదాయకంగా మమతా బెనర్జీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా నగర ఓటర్లు బీజేపీకి మొండి చేయి చూపించారు కానీ ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ దుష్టకార్యాల పల్ల పట్టణ ప్రాంత ప్రజలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారని కాబట్టి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీతో వారు రాజీపడాల్సిన అవసరమే లేదని బీజేపీ నొక్కి చెబుతోంది. 

శనివారం పోలింగ్ జరగనున్న బిధానగర్‌ అసెంబ్లీ స్థానంలో రెండు రోజుల క్రితం కేంద్ర హోమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే కొల్‌కతా లోని మరో సంపన్న ప్రాంతమైన రాజారత్ న్యూ టౌన్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేధావులతో సమావేశమయ్యారు. పట్టణ ఓటర్లను గెల్చుకోవడానికి వీరిద్దరూ పదే పదే అభ్యర్థనలు చేస్తుండటం గమనార్హం

సరిహద్దుల నుంచి చొరబాట్లు కోల్‌కతాలో ప్రవేశించడానికి ఎంతో కాలం పట్టదు. అక్రమ వలసలను ఇతర పార్టీలు ఓటు బ్యాంకులుగా చూస్తున్నందున ఈ చొరబాట్లను అవి ఆపలేవు, బీజేపీ మాత్రమే ఆ పని చేయగలదు అని అమిత్ షా నొక్కి చెప్పారు.

ఇకపోతే న్యూ టౌన్ ప్రాంతంలో మేధావులతో సమావేశమైన జేపీ నడ్డా బెంగాల్‌లో రాజకీయ నాయకత్వం హింసాత్మక చర్యలతో ఆధిపత్యం చలాయిస్తున్నందువల్ల రాష్ట్రంలో మేధో చర్చలు, మధనాలు జరగడం లేదని వ్యాఖ్యానించారు. ఆలోచనా ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోతుందో సమాజ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. రాష్ట్రంలోని అధికార పార్టీ మిమ్మల్ని లోబర్చుకుంది కాబట్టే మీరు మీ ఉత్తమమైనదాన్ని సమాజానికి ఇవ్వలేకపోతున్నారు. బెంగాల్‌లో చట్టపరిపాలనను తీసుకురావాలని కోరుకుంటున్నాం. అది మనందరికీ మేలు చేస్తుంది అని నఢ్డా మేదావులతో సమావేశంలో తెలిపారు. బెంగాల్‌లో పాలనాయంత్రాంగం నిలువునా చీలిపోయిందని, పోలీసులు నేరమయ రాజకీయాలతో మిలాఖతయ్యారని నడ్డా పేర్కొన్నారు.

గత కొంతకాలంగా పశ్చిమబెంగాల్‌లో అనేక సార్లు మేధావులతో భేటీని, వీధి సమావేశాలను బీజేపీ ప్రారంభించింది. బీజేపీ మితవాద భావజాలాన్ని సాంప్రదాయికంగానే తిరస్కరిస్తూ వస్తున్న నగర ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీని తొలగించాల్సి సమయం ఆసన్నమైంది. అదే సమయంలో బీజేపీలోని మంచివారికి సద్భుద్ధి గలవారికి ఒక అవకాశం ఇవ్వాల్సిన తరుణం కూడా వచ్చేసింది. రాష్ట్రంలో డాక్టర్లు, లాయర్లు, టీచర్లు వంటి మేధావులు ఎదుర్కొంటున్న సమస్యలు నాకు తెలుసు. చట్టరాహిత్యం అనేది అమలవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కోవలసిందే. కానీ మార్పు తీసుకురావడానికి రాజకీయాలు చాలా ముఖ్యమైన ఆయుధం. అధికారంలో సరైన వ్యక్తులు ఉంటే మార్పు తప్పక వస్తుంది అని నడ్డా పట్టణ ఓటర్లను ఊరించడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే 2011లో బెంగాల్ అధికారం మమతా బెనర్జీకి దఖలుపడేంత వరకు బెంగాల్ లోని భద్రలోక్ ప్రగతిశీలురైన ఓటర్లు వామపక్షాన్నే సపోర్టు చేసేవారు. వీరు ఇప్పటికీ మితవాద బీజేపీ వైఖరి పట్ల విమర్శనాత్మకంగానే ఉంటున్నారు. అయితే కట్ మనీ సమస్యపై, తృణమూల్ కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ ఎంతగా వ్యతరేక ప్రచారం చేస్తున్నా నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు పెద్దగా స్పందించడం లేదు. అయితే బెంగాల్ లో చట్టరాహిత్యం, చొరబాట్లు అనే సమస్యలను లేవనెత్తి ఓటర్లలో భయాందోళనలు రేకెత్తించడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో మమతను పెద్దగా ఇష్టపడిని భద్రలోక్‌లోని తటస్థ వాదులను తనవైపుకు తిప్పుకోవడానికి బీజేపీ శ్రమిస్తోంది. 

దీంట్లో భాగంగానే అమిత్ షా మంగళవారం నాటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ కోల్‌కతా, నార్త్ 24 పరగణాలు వంటి పట్టణ ప్రాంతాల్లో రూ. 22 వేల కోట్ల వ్యయంతో మౌలిక వసతుల నిధిని ప్రకటించారు. ఉద్యోగులకు 7 పే కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని, టీచర్ల వేతనాలపై కొత్త కమిషన్ ఏర్పరుస్తామని ప్రకటించడం ద్వారా బీజేపీ అగ్రనేతలు నగర ప్రాంత ఓటర్లపై కన్నేశారు.

అయితే నగర ప్రాంత ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో బీజేపీకి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. చాలా సందర్భాల్లో కోల్‍‌కతాలోని అసెంబ్లీ సీట్లను ఎవరైతే గెల్చుకుంటారో వారి తక్కిన రాష్ట్రాన్ని కూడా గెలుచుకోవడం రివాజుగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్ కతాలోని మొత్తం 11 స్థానాలనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే గెల్చుకుంది. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొల్‌కతాలోని మూడు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యత ప్రదర్శించగలిగింది. ఈ మూడు స్థానాలలో గట్టి పోరాటం జరుగుతుందని బీజేపీ నమ్ముతోంది. ఆ ధీమాతోనే కోల్ కతా జిల్లాలో 50 శాతం సీట్లు గెల్చుకుంటానని బీజేపీ చెబుతోంది. 

పైగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తన బెంగాల్ మూలాలను చెప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. తన తండ్రి ప్రొపెసర్ అని వైస్ ఛాన్సలర్ అని నడ్డా పలు మేదావుల సమావేశాల్లో చెప్పుకొచ్చారు. సాంస్కృతికంగా, ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా బెంగాల్‌కి ఘనమైన పేరు ఉండేదని, దాన్ని తిరిగి తీసుకురావడం ద్వారానే నిజమైన మార్పు కలుగుతుందని చెప్పారు. బెంగాల్‌లో భారీ పోలింగ్ పెరిగిన అంచనాలు.. గెలుపు నాదే దీదీ

బెంగాల్ అల్లుడినైనందుకు తానెంతగానో గర్వపడుతున్నానని ప్రకటించుకున్న నడ్డా మేధావులను ఇంప్రెస్ చేయడానికి చాలావరకు ఇంగ్లీషులోనే మాట్లాడుతూ వచ్చారు. దేశం మొత్తంగా బెంగాల్‌ను ఆరాధనాభావంతో చూసేదని, గౌరవించేదని, కానీ గత 30, 40 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు వలసపోవడం ప్రారంభించారని, రాష్ట్రంలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి ఏర్పడిందని నడ్డా చెప్పారు.

రాష్ట్రంలోని  నగర ప్రాంత ఓటర్లలో కనీసం 20 శాతం మంది బీజేపీ వైపు మొగ్గుచూపుతారా అనేది తెలియడానికి మే 2 ఎన్నికల ఫలితాల వెల్లడి అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందే. ఇలాంటి మార్పు బెంగాల్ పట్టణ ఓటర్లలో తీసుకొచ్చేందుకు మోదీ నాయకత్వంలో బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు.

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   13 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   24 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle