newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

రామ‌నామంతో నెట్టుకొస్తోన్న బీజేపీ

12-02-202112-02-2021 08:49:05 IST
Updated On 11-02-2021 17:55:38 ISTUpdated On 11-02-20212021-02-12T03:19:05.951Z11-02-2021 2021-02-11T12:06:09.323Z - 2021-02-11T12:25:38.395Z - 11-02-2021

రామ‌నామంతో నెట్టుకొస్తోన్న బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాది బ‌రా బ‌ర్ హిందువుల పార్టీ అంటారు బీజేపీ లీడ‌ర్లు. దేశం మొత్తాన్ని ప‌రిపాలిస్తున్నది హిందూ పార్టీ అనే విష‌యాన్ని వాళ్లు ఏ మాత్రం త‌గ్గ‌కుండా చెప్పుకుంటున్నారు. మ‌రి ముస్లింలు, క్రిస్టియ‌న్ల ప‌రిస్థితి ఏంటి. మిగతా మ‌తాల పరిస్థితి ఏంటి అంటే అది వేరే విష‌యం. దాని గురించి అడిగే వాళ్లు లేరు. అడిగినా వాళ్లు లెక్క చేసే పొజిష‌న్ లో లేరు. అది అలా వ‌దిలేద్దాం.

మాది హిందువుల పార్టీ అంటున్నారు. స‌రే.. మిమ్మ‌ల్ని ఎవ‌రూ క‌దిలించ‌డం లేదు. కానీ.. మీకు హిందువులంటే ఓన్లీ రాముడేనా అనే క్వ‌శ్చ‌న్ వేస్తే ఏం చేస్తారు అంటే.. మ‌రి ఏం స‌మాధానం చెబుతారో మ‌రి. అది కూడా అలా వ‌దిలేస్తే.. బీజేపీ ఎవ్వారం జ‌నం అన్న‌ట్లే ఉంటుంది. కేవ‌లం మ‌తం మీదే బేస్ అయ్యి న‌డుస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆ విష‌యం ఓపెన్ సీక్రెట్టే... కానీ.. కేవ‌లం మ‌తం త‌ప్ప‌.. వేరే బ‌ల‌మే లేదా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. రాముడు.. హిందూ అనుకుంటూ లాగించ‌డ‌మేనా.. మేం ప్ర‌జ‌ల‌కి మంచి చేశాం.. మంచి చేస్తున్నాం.. మంచి చేస్తాం అంటూ.. ఎక్కడా మాట్లాడ‌రా అంటే ఏం చెబుతారో ఏమో. ఎవ‌రి పార్టీ స్టాండ్ వాళ్ల‌కి ఉంటుంది. కానీ.. కేవ‌లం రామ నామం.. హిందూ నామం. అంతేనా.. బీజేపీ అంటే ఇంకేం లేదా.. ఆ విష‌యం వారికైనా తెలియాలి క‌దా. 

ఎందుకంటే.. అక్క‌డ వెస్ట్ బెంగాల్ లో ఎన్నిక‌ల టైం. అక్క‌డికి వెళ్లిన ప్ర‌తి బీజేపీ లీడ‌ర్.. రామ నామం ప‌ట్టుకుంటున్నారు. మొన్న మోడీ వ‌చ్చిన టైంలో కూడా మ‌మ‌తా బెన‌ర్జీ ముందు ఇలాగే అంటే.. ఆమె హ‌ర్ట్ అయ్యి.. వెళ్లిపోయారు. త‌ర్వాత మోడీ అదే స్టేట్ కి వెళ్తే.. నేను రానంటే రాను అన్నారు మ‌మ‌తా. ఇక అమిత్ షా కూడా అంతే. మ‌మ‌తా బెన‌ర్జీతో జై శ్రీరాం అనిపిస్తాం అంటున్నారు. అదేంటి సామీ.. జై శ్రీరాం అనిపించ‌డంలో త‌ప్పేం లేదు. కానీ.. ప్ర‌జ‌ల‌కి మేలు చేపిస్తాం.. ప‌థ‌కాలు పెట్టిస్తాం అంటే.. ఇంకాస్త బావుంటుందేమో అనే సెటైర్లు.. సోష‌ల్ మీడియాలో ఫుల్ గా ప‌డుతున్నాయి.

ఇక తెలంగాణ‌లో కూడా అంతే. ష‌ర్మిల పార్టీపై స్పందించిన ఎంపీ అరవింద్.. రాజ‌న్న రాజ్యం కాదు.. రామ రాజ్యం తీసుకొస్తాం అంటున్నారు. ఇక్క‌డ కూడా ఎంపీ అరవింద్ అన‌డంలో ఎలాంటి త‌ప్పూ లేదు. రామ‌రాజ్యం అంటే.. గొప్ప రాజ్యం అని పేరు. ప్ర‌జ‌ల హ్యాప్పీగా బ‌తికారు అనేపేరు. కాక‌పోతే.. అంద‌రూ అదే నామం ప‌ట్టుకుంటున్నారే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల గురించి.. ప‌థ‌కాల గురించి మాట్లాడ్డానికి ఇంకేమీ లేదా అనే క్వ‌శ్చ‌న్ లు అయితే వ‌స్తున్న‌య్.

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   3 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   10 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   10 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   11 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle