newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

బీజేపీ తీరు.. కాంగ్రెస్ కి హుషారు

21-02-202121-02-2021 21:54:23 IST
Updated On 22-02-2021 10:40:58 ISTUpdated On 22-02-20212021-02-21T16:24:23.979Z21-02-2021 2021-02-21T07:16:29.142Z - 2021-02-22T05:10:58.231Z - 22-02-2021

బీజేపీ తీరు.. కాంగ్రెస్ కి హుషారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ అంటే పీఎం మోడీ.. పీఎం మోడీ అంటే బీజేపీ. ఫ‌స్ట్ ప్లేస్ ప్ర‌ధాన మంత్రిదే. బీజేపీలో ఎంత‌మంది పెద్ద‌లు ఉన్న‌ప్ప‌టికీ.. మోడీ ప్లేస్ ని రీ ప్లేస్ చేయ‌డం అనేది ఇప్పుడ‌ప్పుడే అయ్యే ప‌ని కాదు. మినిస్ట‌ర్ అమిత్ షా ఉన్న‌ప్ప‌టికీ.. సెకండ్ ప్లేస్ లో సెట్ అయ్యారు. కానీ.. మోడీకి బ్యాడ్ టైం మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది.

అవును నిజ‌మే.. 2020 త‌ర్వాత అంద‌రి ఫేటూ మారిన‌ట్లే.. పీఎం మోడీ ఫేట్ కూడా మారిన‌ట్లే ఉంది. ఇన్నాళ్లూ మోడీ అనే లీడ‌ర్.. దేశంలో ఎదురులేని లీడ‌ర్ గా ఉన్నారు. కానీ.. ముందు ముందు రోజుల్లో అలా ఉండేలా లేదు. హ్యాట్రిక్ పీఎం అయ్యే ఛాన్సులు కూడా త‌గ్గుతూ ఉన్నాయి. ఇదే టైంలో.. రాహుల్ గాంధీ ఎవ్వారంలో కూడా కాస్త మార్పులు చేర్పులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధాన మంత్రి పీఠ‌మే ల‌క్ష్యంగా జ‌నంలోకి వెళ్తున్నారు కాంగ్రెస్ లీడ‌ర్ రాహుల్ గాంధీ. కానీ.. ఆయ‌నకి మాత్రం కాలం క‌లిసి రాలేదు. అయితే.. 2020 త‌ర్వాత కాంగ్రెస్ కి కూడా బ‌లం పెరిగింది. ఆటేమేటిక్ గా రాహుల్ గాంధీ ఫోక‌స్ అవుతున్నారు.

అయితే.. కొన్ని కొన్ని ప‌నుల కార‌ణంగా.. ఒక‌రు బ‌ల‌హీన ప‌డ‌డం వారి ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌ప‌డ‌డం జ‌రుగుతుంట‌య్. ప్ర‌తి ప‌క్షంలో ఉన్న వారు.. ఏదో ఒక‌టి చేసి బ‌ల‌ప‌డుతుంటారు. కానీ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ విష‌యంలో అంత అవ‌స‌రం లేకుండా పోతోంది. వారికి వారుగా బ‌ల‌ప‌డ‌డం ఎలా ఉన్నా.. బీజేపీ బ‌ల‌హీన ప‌డ‌డం కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశంగా మారింది. అవును క‌దా.. బీజేపీకి దేశంలో ప్ర‌త్యామ్నాయం అంటే కాంగ్రెస్సే అనే విష‌యంలో ఎలాంటి డౌట్లూ ఎవ‌రికీ లేవు. సో.. బీజేపీ విధానాలు ఇప్పుడు ఆ పార్టీని బ‌ల‌హీన ప‌డేలా చేస్తున్న‌య్. చాలా విష‌యాల్లో బీజేపీకి యాంటీగా మారుతున్నారు జ‌నాలు. ముఖ్యంగా రైతుల ఉద్య‌మం బీజేపీకి ప్రాబ్ల‌మ్ క్రియేట్ చేస్తోంది. కేంద్ర స‌ర్కార్ తీరుతో.. మోడీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది.

పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం.. షాక్‌లో బీజేపీ 

పీఎం మోడీ, సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ అమిత్ షాల నిర్ణ‌యాలపై జ‌నంలో వ్య‌తిరేక‌త మొద‌లైంది. ముఖ్యంగా రైతుల్లో నెగ‌టివిటీ వ‌స్తోంది. రైతుల్లో నెగ‌టివిటీ వ‌చ్చిందీ అంటే.. అన్ని రంగాల్లో ఎఫెక్ట్ ప‌డుతోంది. ముఖ్యంగా ఓట్ బ్యాంకు పై ఎఫెక్ట్ ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మొన్న పంజాబ్ లో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇదే క‌నిపించింది. బీజేపీ బ‌లంగా ఉన్న చోట కూడా.. కాంగ్రెస్ బ‌ల ప‌డింది. ఇలాగే దేశ వ్యాప్తంగా నెగ‌టివిటీ క‌నిపిస్తోంది కాబ‌ట్టి.. బీజేపీకి బ్యాడ్ టైం వ‌చ్చిన‌ట్లే ఉంది. ఇదే అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటున్న కాంగ్రెస్.. వేగంగా ముందుకెళ్తోంది. ఇంకో మూడేళ్ల‌లో బీజేపీ గ్రాఫ్ మ‌రికాస్త కిందికి ప‌డిపోవ‌డం.. కాంగ్రెస్ గ్రాఫ్ మ‌రికాస్త పైకి లేవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సో..ఇలాగానీ జ‌రిగితే.. రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో అంద‌రికీ అర్దం అవుతూనే ఉంటుంది క‌దా.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle