బీజేపీకి నార్త్ లో మొదలైంది.. ఇక సౌత్ లో ఉంటుందా
18-02-202118-02-2021 08:05:32 IST
Updated On 18-02-2021 09:51:33 ISTUpdated On 18-02-20212021-02-18T02:35:32.267Z18-02-2021 2021-02-18T02:34:51.214Z - 2021-02-18T04:21:33.517Z - 18-02-2021

జనాలేం అమాయకులు కాదు. మరీ పిచ్చి వారిలా చూడ్డం కరెక్ట్ కాదు. చిరాకేస్తే ఏమైనా చేయగలరు. రైతుల విషయంలో ఇంకాస్త క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే.. రైతన్నకి ఆత్మాభిమానం డోస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్.. ఆత్మాభిమానం అందరికీ ఉంటుంది. కానీ.. రైతన్నది అమాయకత్వంతో కూడిన ఆత్మాభిమానం కదా.. కాస్త డిఫరెన్స్ ఉంటుంది మరి. బీజేపీకి ఆ ఎవ్వారం అర్దం కావడం లేదు. ముఖ్యంగా.. పీఎం మోడీకీ.. సెంట్రల్ మినిస్టర్ అమిత్ షాకి ఈ విషయంలో క్లారిటీ లేదు. అందుకే.. రైతుల ఉద్యమాన్ని లెక్క చేయకుండా అణగ దొక్కాలి అని చూశారు. కానీ.. ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే.. పంజాబ్ రైతులు.. బీజేపీకి రైతన్న దెబ్బ ఏంటో చూపించారు. ముందు ముందు కూడా చూపిస్తారు అందులో ఎలాంటి డౌటూ లేదు. తాజాగా అయితే.. పంజాబ్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తమ ఆగ్రహం చూపించారు అన్నదాతలు. ఆల్రెడీ ఎన్డీయే మిత్ర పక్షాలు భయపడ్డాయి. వామ్మో బీజేపీతో కలిసి ఉంటే కష్టమే అనుకున్నాయి. అందుకే.. ఎన్టీయే నుంచి బయటికొచ్చాయి. బీజేపీకి మాకు ఎలాంటి దోస్తీ లేదు. అంతా కటీఫ్ అన్నారు. అయినా సరే జనం నమ్మలేదు. మీరూ మీరూ అంతా ఒకటే. ఓట్ల కోసం చీలుతున్నారులే అని.. చీలిన పార్టీలను కూడా దెబ్బకొట్టారు రైతన్నలు. రైతన్నలే కాదు.. వారిపై సర్కార్ తీరును పంజాబ్ జనం అంతా వ్యతిరేకించారు. మొత్తం స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఇన్నాళ్లూ ఆ పార్టీకి మిత్ర పక్షాలుగా ఉన్న పార్టీలకు రుచి చూపించారు. కానీ.. ఈ రైతుల ఉద్యమం పంజాబ్ లో అయితే.. కాంగ్రెస్ కి బానే కలిసొచ్చింది. బీజేపీ... ఆ పార్టీకి మిత్ర పక్షాలుగా ఉన్నా పార్టీలకు తగిలిన దెబ్బ కాంగ్రెస్ కి కలిసొచ్చింది. రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయడంతో.. అన్నదాతలు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా సాగించింది. 53 ఏళ్ల తర్వాత భాటిండాకు కాంగ్రెస్ మేయర్ రానున్నాడని.. కాంగ్రెస్ పార్టీ ఫుల్ హ్యాప్పీగా ఉంది. మరి నార్త్ లో అంటే అంతే ఉంటుంది. బీజేపీకి అర్దం అయింది. త్వరలోనే.. ఏపీలో స్థానిక ఎన్నికలు ఉన్నయ్.. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నయ్.. అక్కడ కూడా ఇదే రిజల్ట్ రాబోతుందా లేదా అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. అక్కడంటే రైతుల ఉద్యమం ఉంది.. ఇక్కడ లేదు కదా అనుకోవచ్చు. కానీ.. బడ్జెట్ లో సౌత్ కి ఏమీ కేటాయించలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. దానిని ఇక్కడి జనం పట్టించుకుంటారా. పైగా.. ఆంధ్రాలో విశాఖ ఉక్కు ఉద్యమం ఉంది... దాని ఎఫెక్ట్ ఇక్కడ మున్సిపల్ ఎన్నికలపై ఉంటుందా అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా