బీజేపీకి అంత సీన్ లేదా
14-03-202114-03-2021 09:16:45 IST
Updated On 14-03-2021 09:20:46 ISTUpdated On 14-03-20212021-03-14T03:46:45.801Z14-03-2021 2021-03-14T03:08:21.136Z - 2021-03-14T03:50:46.106Z - 14-03-2021

నార్త్ లో ఓకే. బీజేపీ జెండా ఎగరేస్తుంది. ఒక్క దిక్కు ఓకే అయినంత మాత్రాన ఎలా కుదురుతుంది చెప్పండి. దిక్కులన్నీ.. బీజేపీనే దిక్కు అంటేనే.. ఆ పార్టీ పవర్ బలంగా ఉన్నట్లు. లేదంటే లేదన్నట్లే కదా. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అదే అంటున్నారు. మోడీ అమిత్ షాలు.. వెరైటీ వెరైటీ ప్లాన్స్ వేసి.. ఎవరినీ లెక్క చేయకుండా నార్త్ లో కూడా పట్టుకోల్పోతూ.. మిగతా రాష్ట్రాలపై ఫోకస్ చేయకపోతే.. తరువాత వచ్చే ఎన్నికల్లో కష్టమే అనే దాకా తెచ్చుకుంది. ఇప్పుడు నార్త్ లో పట్టు తగ్గుతోంది. రైతు ఉద్యమంతో.. ఎవ్వారం అంతా ఎడ్డెం తెడ్డెం అయింది. బీజేపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనే సిగ్నల్స్ పంపుతోంది రైతు ఉద్యమం. మోడీ, అమిత్ షాల తీరుతోనే ఈ పరిస్థితి వచ్చింది అనేది.. బీజేపీ పెద్దల పరిస్థితి. ఇక తప్పక ఈస్ట్ వెస్ట్ సౌత్ స్టేట్ లపై ఫోకస్ చేసింది బీజేపీ. నార్త్ లో వచ్చిన వ్యతిరేకతని.. మిగతా స్టేట్స్ లో వచ్చే అనుకూలత తో బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు. కానీ.. ఇటు మాత్రం స్థానిక పార్టీలు బలంగా ఉండడంతో.. బీజేపీ పాచిక పారడం లేదు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నయ్. తమిళనాడు, కేరళ, అస్సోం, పశ్చిమబెంగాల్, పాండిచ్చేరి. కానీ.. పాండిచ్చేరిలో బీజేపీకి ఛాన్స్ లేదు. కేరళలో అస్సలే ఛాన్స్ లేదు. ఇక తమిళనాడులో ఉన్న బీజేపీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అయితే అన్నాడీఎంకే.. లేదంటే డీఎంకే.. అంతే తప్ప.. బీజేపీ కాంగ్రెస్ లను అడుగు కూడా పెట్టనివ్వరు తమిళులు. ఇక పోతే.. అస్సాం కూడా మొన్నటి దాకా బీజేపీ అనుకున్నారు. కానీ.. పౌరసత్వ సవరణ బిల్లుతో బీజేపీకి ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటున్నారు. ఎందుకంటే.. అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లు ఎక్కువ మందే ఉంటారు. సో.. వారిపై బీజేపీ తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఎఫెక్ట్ పడి వ్యతిరేకత వచ్చింది. పైగా.. కొంత మంది బడా లీడర్లు కూడా కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. సో.. అస్సోం అనుకుంటే.. అక్కడ కూడా కష్టంగానే ఉంది. ఇకపోతే.. పశ్చిమ బెంగాల్. ఇక దీదీ గురించి చెప్పేదేముందీ. రసవత్తరంగా ఉన్నయ్ పాలిటిక్స్ అక్కడ. వెస్ట్ బెంగాల్ పై మోడీ అమిత్ షా వర్సెస్ మమతా బెనర్జీ అన్నట్లు జరుగుతోంది రాజకీయం. ఇక్కడ తేల్చడం కష్టమే. అలాగే.. దీదీపై గెలవడం కూడా కష్టమే.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా