newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

తెలుగు రాష్ట్రాలకు నడ్డా పెద్ద పీట..

27-09-202027-09-2020 09:43:42 IST
2020-09-27T04:13:42.248Z27-09-2020 2020-09-27T04:13:38.877Z - - 03-12-2020

తెలుగు రాష్ట్రాలకు నడ్డా పెద్ద పీట..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద పీట దక్కింది. అనూహ్యంగా పార్టీ జాతీయ కార్యవర్గంలో రామ్ మాధవ్, మురళీధరరావులకు చోటు లభించకపోగా తెలంగాణ నుంచి డీకే అరుణకు, ఏపీనుంచి పురందేశ్వరిలకు కీలక పదవులు దక్కడం విశేషం. కాగా డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించింది. ఇక్కడ కూడా సామాజిక సమీకరణలకు బీజేపీ ప్రాధాన్యమివ్వడం విశేషం.

భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతల స్వీకరణ అనంతరం తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గం(పదాధికారులు)లో తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, పురందేశ్వరిలకు కీలక పదవులు దక్కాయి. తెలంగాణ మాజీ మంత్రి డి.కె.అరుణకు కీలకమైన జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కగా.. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించడం విశేషం. ఏపీ నుంచి సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శి పదవి దక్కింది. 

పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నేతలుగా ఉన్న రాంమాధవ్, పి.మురళీధర్‌రావుల స్థానంలో కొత్త వారికి చోటు లభించింది. ఇక, జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఉండగా.. ఆయన స్థానంలో ఎంపీ అనిల్‌ బెలూనీకి చోటు కల్పించారు. మొత్తం 23 మంది అధికార ప్రతినిధుల్లో..దక్షిణాది నుంచి అధికార ప్రతినిధులుగా రాజీవ్‌ చంద్రశేఖర్, టామ్‌ వడక్కన్‌లు ఇద్దరికే చోటు దక్కింది. 12 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, ఒక ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీ సహా మొత్తం 70 మంది ఉన్న ఈ నూతన కార్యవర్గానికి తోడు కార్యవర్గ సభ్యులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా.. మరో బలమైన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి దగ్గుబాటు పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికచేయడం సామాజిక సమీకరణాల సమతుల్యం చేయడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సామాజిక వర్గం అండగా ఉన్న టీడీపీ క్రమంగా బలహీనపడుతున్న తరుణంలో ఏపీలో బలోపేతమయ్యే దిశగా ఈ సమతుల్యం అవసరమని విశ్లేషిస్తున్నాయి.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేత బండి సంజయ్‌ ఉండగా.. ఇక్కడ మరో బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉంది. టీఆర్‌ఎస్‌ వ్యూహాలతో బలహీనపడిన కాంగ్రెస్‌ నుంచి ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే దిశగా డీకే అరుణకు జాతీయస్థాయిలో కీలకమైన ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం అరుణకు కలిసొచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

 

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   7 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   7 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   8 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   9 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   9 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   9 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   10 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   10 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   11 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle