newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

బిహార్ సమరం.. మారిన పార్టీల ఎత్తుగడలు!

28-10-202028-10-2020 18:26:09 IST
Updated On 29-10-2020 07:26:56 ISTUpdated On 29-10-20202020-10-28T12:56:09.953Z28-10-2020 2020-10-28T12:55:50.318Z - 2020-10-29T01:56:56.721Z - 29-10-2020

బిహార్ సమరం.. మారిన పార్టీల ఎత్తుగడలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్ రాష్ట్రంలో ఎన్నికలంటేనే హింసాకాండ సాధారణం. బీహార్ లో ఎన్నికల ఫలితాలను నిర్దేశించేది కుల పెత్తందారీ తనమే. అయితే కరోనాకు ముందు పరిస్థితి ఇదంతా. కరోనా తరువాత మాత్రం బీహార్ లో పరిస్థితి మారింది. మారడం అంటే హఠాత్తుగా కులం ప్రాబల్యం మాయమైపోయిందనీ, రాష్ట్రం అభివృద్ధి చెందిందనీ కాదు. కులాలకు అతీతంగా అన్ని వర్గాల వారూ కరోనా కారణంగా కష్టాల్లో కూరుకుపోయారు.

అసెంబ్లీ ఎన్నికలలో కులం పేరు చెప్పుకుని గెలవగలిగే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే అగ్రవర్ణాలు, బడుగు వర్గాలు, నిమ్నకులాలు అనన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారీ ఉపాధి, ఉద్యోగ లేమితో ఇబ్బందులు పడుతున్నారు.

దేశంలోని ఏ రాష్ట్రం కంటే బీహార్ లో వలస కూలీల సంఖ్య ఎక్కువ కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ వలస బతుకుల పరిస్థితి కడుదయనీయంగా మారిపోయింది. పనులు లేక పస్తులుంటున్న పరిస్థితి. దీంతో ఎన్నికల సమయంలో తమ ఉపాధికి హామీ ఇచ్చే, పూచీ పడే పార్టీలవైపే వారు చూస్తున్నారు. ఇది సహజం కూడా. మారిన పరిస్థితుల్లో బీహార్ లో ఎన్నికల ప్రచార తీరు కూడా మారింది. పార్టీల మధ్య పరస్పర నిందారోపణల కంటే...నిరుద్యోగం సమస్య, ఉపాధి కల్పనలపైనే అన్ని పార్టీలూ ప్రధానంగా దృష్టి పెట్టాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీయే, యూపీఏ మధ్యే ఉన్నాయి. రెండు కూటములూ కూడా సామాజిక సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రచారానికి పదును పెట్టాయి. ఇక అన్నిటికీ మించి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు విషయంలో నితిన్ సర్కార్ వైఫల్యం ఎన్డీయే కూటమికి ఒక పెద్ద ఇబ్బందికర అంశంగా మారింది. సంపూర్ణ మద్య నిషేధం వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడటం వినా మరో ప్రయోజనం సిద్దించలేదన్న భావన జనబాహుల్యంలో వ్యక్తమౌతున్నది. ప్రైవేటు సంభాషణల్లో అధికార కూటమి శ్రేణులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయి. నిషేధం కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావడమే కాకుండా, అక్రమ మద్యం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. యువత ఈ అక్రమ మద్యం ద్వారానే ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో పెడతోవ తొక్కుతోంది.

ఈ పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళే మారిపోయింది. అన్ని పార్టీలూ, అందరు నేతలూ చదువు, ఉద్యోగం, ఉపాధి అంశాలనే ప్రచారాస్త్రాలుగా ఎంపిక చేసుకునన్నారు. బీహార్ లో అధికార కూటమికి సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నన నితీష్ నాయకత్వం బలహీనతగా మారింది. అదే సమయంలో మోడీ ప్రచారం బలంగా బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇక యూపీఏ కూటమిలో కాంగ్రెస్ స్థానిక పార్టీలకే ప్రాధాన్యత ఇచ్చి ఒక అడుగు వెనక్కు వేయడం ఆ పార్టీకి ఒకింత మేలు చేస్తున్నదన్న భావన పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆర్జేడీ ప్రచార బాధ్యతలను ఒంటి చేత్తో మోస్తున్న తేజస్వి ప్రసాద్ ప్రచార శైలి అన్న వర్గాల వారినీ ఆకట్టుకుంటున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఆయన సభలకు జనం పెద్ద సంఖ్యలో రావడంతో యూపీఏ కూటమిలో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. ఇక ఎన్డీయే కూటమిలో ఉంటూనే సొంతంగా పోటీ చేస్తున్న ఎల్జేపీ వల్ల ఎవరికి నష్టం అన్నదానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా, చిరాగ్ పశ్వాన్ ప్రాబల్యం పెద్దగా ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తొలి సారిగా సంప్రదాయక ప్రచార శైలికి భిన్నంగా సామాజిక అంశాలకు ప్రాధాన్యత దక్కింది.

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

   6 hours ago


అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

   9 hours ago


ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

   10 hours ago


కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

   13 hours ago


డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

   13 hours ago


పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

   14 hours ago


తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

   17 hours ago


మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

   17 hours ago


బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

   18 hours ago


ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

   19 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle