newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

నేర చ‌రిత్రే.. పెద్ద క్వాలిఫికేష‌న్..

14-10-202014-10-2020 19:10:47 IST
2020-10-14T13:40:47.161Z14-10-2020 2020-10-14T13:40:38.239Z - - 25-10-2020

నేర చ‌రిత్రే.. పెద్ద క్వాలిఫికేష‌న్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేర చ‌రిత్ర లేని రాజ‌కీయ నాయ‌కుల్ని వెత‌కాలంటే పార్టీల‌కి ఎంత క‌ష్టం చెప్పండి. అందుకే.. ఉన్న లీడ‌ర్ల‌లోనే కాస్త ఎక్కువ చ‌రిత్ర ఉన్న వాళ్ల‌ని చూసి.. పోటీలో నిలుపుతుంటాయి పార్టీలు. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల టైం కావ‌డంతో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. త‌క్కువ నేర చ‌రిత్ర ఉన్న వాళ్ల‌ని ప‌క్క‌కు పెట్టి.. ఎక్కువ నేర చ‌రిత్ర ఉన్న వాళ్ల‌కి టిక్కెట్స్ ఇస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. క్రైమ్ హిస్ట‌రీని మించిన క్వాలిఫికేష‌న్ లేదేమో అన్న‌ట్లు చేస్తున్నార‌ని  కామెడీ చేస్తున్నారు జ‌నాలు.

అక్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌ల బెల్ మోగింది. పార్టీల‌న్నీ ప్ర‌చారంలో బిజీగా ఉన్నాయి. ఇక అభ్య‌ర్థుల లిస్టులు కూడా ఫైన‌ల్ చేస్తున్నాయి. ఇదే ప్రాసెస్ లో ఆర్జేడీ కూడా అభ్య‌ర్థుల లిస్ట్ ఫైన‌ల్ చేసింది. దాంతోపాటే వారిపై ఉన్న క్రైమ్ రికార్డ్స్ ని కూడా సోష‌ల్ మీడియాలో పెట్టారు. దీంతో వారి బాగోతం బ‌య‌ట‌ప‌డుతోంది. మొత్తం 22 మంది లీడ‌ర్ల‌కి డేంజ‌ర‌స్ క్రైమ్ రికార్డ్ ఉందంట‌. మ‌ర్డ‌ర్లు, మాన‌భంగాలు, దోపిడీలు దొమ్మీలు అన్ని ర‌కాల కేసులు ఉన్నాయ‌ట‌. అంద‌రి మీదా కేసుల‌న్నా.. 22 మందిపై క్రిమిన‌ల్స్ కి ఉన్న‌న్ని నేర ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ట‌. ప్రూవ్ అయ్యాయా లేదా అనేది ప‌క్క‌న పెడితే కేసులైతే ఉన్నాయ‌ట‌. దీంతో.. ఓరి నాయ‌నో అంటోంది యూత్.

ఆర్జేడీ అభ్య‌ర్థి అనంత్ సింగ్ పై ఏకంగా 38 కేసులున్నాయ‌ట‌. ఆయ‌న మీద లేని కేసు లేదంటే న‌మ్మండి. మ‌ర్డ‌ర్ కేసుతో స‌హా. కాక‌పోతే మ‌ర్డ‌ర్ కేసు పెండింగ్ లో ఉందట‌. ఆయ‌న నిల‌బ‌డ్డ చోట.. వేరే వాళ్ల‌కి టిక్కెట్ ఇవ్వ‌చ్చుగా అని వ‌స్తున్న క్వ‌శ్చ‌న్స్ కి.. ఆయ‌నే టాపు.. అంద‌రిలో ఆయ‌నే ఉత్త‌ముడు. అందుకే ఆయ‌న‌కి టిక్కెట్ ఇచ్చాం అని చెబుతోంది పార్టీ. ఆయ‌న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోసం త‌ప‌న ప‌డే మ‌నిషి.. పేద‌ల పెన్నిది అందుకే ఆయ‌న‌కే టిక్కెట్ ఇచ్చాం. ఇక ఈ కేసుల‌దేముంది. ఎవ‌రుప‌డితే వాళ్లు పెడుతంటారు. అంతే త‌ప్ప ఆయ‌న సుద్ద పూస అంటున్నార‌ట పెద్ద‌లు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle