newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా- కోవిడ్ జాగ్రత్తలపైనే అందరి దృష్టీ

25-09-202025-09-2020 17:02:21 IST
Updated On 25-09-2020 17:05:06 ISTUpdated On 25-09-20202020-09-25T11:32:21.853Z25-09-2020 2020-09-25T11:32:18.896Z - 2020-09-25T11:35:06.117Z - 25-09-2020

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా- కోవిడ్ జాగ్రత్తలపైనే అందరి దృష్టీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. బీహార్ అసెంబ్లీకి మూడు విడ‌త‌ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి  కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబ‌ర్ 28వ తేదిన తొలి విడ‌త‌, న‌వంబ‌ర్ 3న రెండో విడ‌త‌, ఏడో తేదిన ఆఖ‌రి విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుంది.. న‌వంబ‌ర్ ప‌దో తేదిన ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నున్నారు రాష్ట్రంలో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో 38 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయి ఉన్నాయి.

తొలి దశలో 71 అసెంబ్లీ స్థానాలకు రెండవ దశలో 94 స్థానాలకు తుది మూడవ దశ ఎన్నికలు 78 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. రాజకీయ వేడి, ప్రచార సమరం  సంగతి ఎలా ఉన్నా.. కరోనా మహమ్మారి వ్యాప్తి  అనంతరం దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి కావడంతో కోవిడ్ జాగ్రత్తలను పటిష్టంగా పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాల్సిన గురుతరమైన బాధ్యత ఎన్నికల సంఘం పై ఉంది.   

కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో కాకుండా ఈవీఎంలతోనే నిర్వహిస్తున్నారు. అందుకే కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా ఓటింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గ్లౌజ్ లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కోవిడ్ బారిన పడి క్వారంటైన్ లో ఉన్న వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

చివరి దశలో క్వారంటైన్ లో ఉన్న వారికి వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. పోలింగ్ చివరి దశలో  క్వారెంటైన్‌లో ఉన్న ఓటర్లు ఓటు హక్కును వారి వారి పోలింగ్ స్టేషన్ల వద్ద ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో క్వారెంటైన్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. అలా కూడా రావడానికి వీలుపడని క్వారెంటైన్ ఓటర్లు పోస్టల్ ఓటింగ్‌కు బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. 

కోవిడ్ వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందు కోసం 7లక్షల శానిటైజర్లు, 23లక్షల గ్లౌజులు, 46లక్షల  మాస్కులు అలాగే 6లక్షల పీపీఈ కిట్లను ఈ ఎన్నికల కోసం వినియోగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా  అడుగడుగునా కోవిడ్ నిబంధనలను పాటించాల్సి  ఉంటుంది.

ఇవి కోవిడ్ వ్యాప్తి  చెందకుండా ఉండేందుకు తీసుకునే  జాగ్రత్తలైతే... ఇక రాష్ట్రంలో రాజకీయ  పరిస్థితిని అవలోకిస్తే.... ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా అధికారంలో ఉన్న జేడీయూ విజయంపై ధీమాగా ఉంటే... కోవిడ్  కట్టడి  చర్యలలో కేంద్రంలోని మోడీ ప్రభత్వ వైఫల్యాలు అధికార పార్టీకి ఒకింత ఇబ్బందిగా మారనున్నాయి.  కేంద్రం వైఫల్యాలపై ప్రజా వ్యతిరేకతే తమకు గెలుపు బాట వేస్తుందన్న ధీమాతో విపక్ష కూటమి ఉంది. ఏది ఏమైనా  దేశంలో భవిష్యత్ లో జరగనున్న ఎన్నికలపై బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు.

Bihar election dates 2020: Polling to be held in 3 phases on October 28,  November 3 and 7; results on November 10


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle