newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

12-05-202112-05-2021 14:07:02 IST
Updated On 12-05-2021 14:42:14 ISTUpdated On 12-05-20212021-05-12T08:37:02.620Z12-05-2021 2021-05-12T08:36:58.864Z - 2021-05-12T09:12:14.984Z - 12-05-2021

అంతా కేంద్ర పెత్తనం వల్లే !  ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పంపిణీ చేయాలనుకున్న కొవ్యాక్సిన్ ను తమకు సరఫరా చేయడానికి భారత్ బయోటెక్ నిరాకరిం చిందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం వెల్లడించారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేద నడానికి ఇదే తార్కాణమని ఆయన ధ్వజమెత్తారు. 6.6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేయడమే కేంద్రం చేసిన పెద్ద తప్పు అని, ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.

ఈ సందర్బంగా వ్యాక్సిన్ కొరత కారణంగా ఢిల్లీ లోని 17 స్కూళ్లలో ఏర్పాటు చేసిన 100 టీకా కేంద్రాలను మూసి వేయాల్సి వచ్చిందని అయన తెలిపారు. ఏ రాష్ట్రానికి ఎన్ని డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రకమైన విధానం ఎంతమాత్రం సరైనది కాదని సిసోడియా అన్నారు. ఢిల్లీకి అదనంగా కొవ్యాక్సిన్ డోసులను ఇవ్వలేమని భారత్ బయోటెక్ చెప్పడానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానమేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా వ్యాక్సిన్ల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణను వదులుకోవాలని విజ్ఞప్తి చేశారు.   

తాము 1.34 కోట్ల డోసుల కొవ్యాక్సిన్ ను, 67 లక్షల కోవీ షీల్డ్ వ్యాక్సిన్ ను కోరామని అయన గుర్తుచేశారు. అయితే తాము ఈ సరఫరా చేయలేమని భారత్ బయోటెక్ నుంచి తమకు లేఖ అందిందని చెప్పారు. సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకే తాము పని చేస్తున్నట్లుగా ఆ సంస్థ వెల్లడించిందని సిసోడియా తెలిపారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోవడానికి గ్లోబల్ టెండర్లను పిలుస్తున్నామని కూడా అయన వెల్లడించారు. విదేశాల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ డోసులను దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితిని రాష్ట్రలకు కేంద్రం కల్పిస్తోందని ఆయన అన్నారు. 

కోవిడ్ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని ఇప్పటికే కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. కరోనా వైరస్ రెండవ దశ అత్యంత తీవ్రంగా వ్యాపిస్తున్నందున ఈ వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగింది. దేశంలో కొవ్యాక్సిన్, కోవిషీల్డ్, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ - 5 వ్యాక్సిన్ల విక్రయానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే స్పుత్నిక్ - 5 వ్యాక్సిన్ ఇప్పటి వరకు విస్తృత అందుబాటులోకి రాలేదు. నిన్నమొన్నటి వరకు ఢిల్లీలో ఆక్సిజన్ కొరత హడలెత్తించింది. లాక్ డౌన్ పుణ్యమా అని ఆ కొరత నుంచి బయటపడ్డ ఢిల్లీ సర్కారుకు ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత మరో పెద్ద సవాలుగా పరిణమిస్తోంది. ఈ వ్యాక్సిన్ల దిగుమతికి గ్లోబల్ టెండర్లు పిలుస్తామని చెబుతున్నప్పటికీ ఆ ప్రక్రియ అంత త్వరిత గతిన పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.  

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   7 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   8 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   8 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle