newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

15-04-202115-04-2021 12:20:22 IST
Updated On 15-04-2021 12:26:29 ISTUpdated On 15-04-20212021-04-15T06:50:22.837Z15-04-2021 2021-04-15T06:50:15.086Z - 2021-04-15T06:56:29.619Z - 15-04-2021

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలన్నింటికంటే కూడా ఈ సారి పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఎన్నికలు అనేక రకాలుగా రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేవలం రాజకీయ పరమైన అంశాలే కాకుండా అనేక సంక్లిష్ట అంశాలు కూడా ఈ ఎన్నికల ఫలితాలతో ముడిపడి ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపి లు హోరాహోరీ పోరాటం సాగిస్తున్నా, పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నా, సామాజికపరమైన, రాజకీయపరమైన అంశాలు ఎన్నో ఎన్నికల అంతిమ ఫలితాన్ని ప్రభావితం చేయబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.   

దాదాపు మూడు దశాబ్దాల పాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన సిపిఎం కూడా కనీస పక్షంగా నైనా పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. వామపక్ష కోటను కుప్పకూల్చి అనూహ్య రీతిలో అధికారాన్ని చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయంగా కదుపుతున్న పావులు ఏ మేరకు ఆమెకు మళ్ళీ అధికారాన్ని కట్టబెడతాయన్నది ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. మమత పాలనలో రాష్ట్రంలో అవినీతి పెచ్చు పెరిగిందని అలాగే అధికార పార్టీ కార్యకర్తల ధోరణి కూడా ప్రజల్లో ఆ పార్టీ పట్ల ప్రతికూలతనే పాదుగొల్పాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మమతా బెనర్జీ హయాంలోనే శారదా చిట్ ఫండ్ సహా అనేక కుంభకోణాలు అధికార పార్టీ అవినీతికి అద్దం పట్టాయి. అయినప్పటికీ కూడా సమస్యల్లో పడ్డ ప్రతిసారి ఎదో విధంగా బయట పడటమే తన రాజకీయమని చాటుకున్న మమత ప్రస్తుతం ముక్కోణపు పోటీని తట్టుకొని ఏ విధంగా నిలబడతారు మిగిలిన దశల ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను పెంపొందించుకునేందుకు ఎలా ప్రయత్నిస్తారన్నది బిజెపి ఎత్తులను చిత్తు చేసేందుకు ఆమె అనుసరించే వ్యూహాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. 

ఏ విధంగా చూసినా కూడా రాష్ట్రంలో మమతా బెనర్జీ తిరుగులేని అధినేత్రి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటు బిజెపి లో గాని అటు సిపిఎం లో గాని రాష్ట్రంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే మహిళా నేతలు లేకపోవడం మమతకు కలసివచ్చే మరో అంశం. ఈ పదేళ్ల కాలంలో రాజకీయంగా పార్టీని పటిష్టం చేయడంతో పాటు అన్నివర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో తిరుగులేని అధికారాన్ని చేపట్టి ఒక్కటొక్కటిగా రాష్రాల్లోనూ  జైత్రయాత్ర సాగిస్తున్న బిజెపికి బెంగాల్ ఎన్నికల్లో విజయం అన్నది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. 

బెంగాల్లో కూడా అధికారాన్ని చేపడితే బిజెపి ప్రాబల్యానికి తిరుగే ఉండదు అన్నది స్పష్టం. పశ్చిమ బెంగాల్ లో అధికారాన్ని సాధించగలిగితే తన అంతిమ 'లక్ష్య' సాధన పథంలో బిజెపి  మరో మైలురాయిని అధిగమించినట్లే అవుతుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఆరోపణలు అవధులు దాటి వ్యక్తిత్వ హనన స్థాయికి కూడా చేరుకున్నాయి. రాజకీయాలంటేనే అధికారం అన్న భావనకు అద్దం పట్టే రీతిలోనే ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో మమతా బెనర్జీకి ప్రస్తుతం ఉన్న సీట్లు నిలబడతాయా లేక బిజెపి  ప్రాబల్యం ఫలితంగా అసలుకే గండి పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.     

ఇక బిజెపి విజయానికి వస్తే పశ్చిమ బెంగాల్ కు సంబంధించినంతవరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు దానికి వచ్చిన ఓట్ల శాతం తక్కువే. కేవలం పార్లమెంటు స్థానాల్లోనే ఆ పార్టీ ఎక్కువ ఓట్లను సంపాదించుకోగలిగింది. అమిత్ షా వ్యూహ రచన ఏ మేరకు మమతకు చెక్ పెడుతుంది అలాగే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కమలనాధులను కంగు తినిపించి బెంగాల్ లో తన ముద్రను ఏ మేరకు నిలబెట్టుకుంటారన్నది వేచిచూడాల్సిందే. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఓటరు నాడిని రాజకీయ వేడితో కొలువలేము. బెంగాల్ ఓటర్లు దీదీకే  పట్టం కడతారా? లేక బిజెపి కొమ్ముకాస్తారా? ఫలితం ఎలా ఉన్నా ఇది జాతీయ రాజకీయాలపై బలమైన ముద్ర వేయడం ఖాయం.   

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle