newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

30-09-202030-09-2020 17:06:28 IST
Updated On 30-09-2020 17:46:22 ISTUpdated On 30-09-20202020-09-30T11:36:28.417Z30-09-2020 2020-09-30T11:36:26.423Z - 2020-09-30T12:16:22.021Z - 30-09-2020

బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బాబ్రీ మసీదు విధ్వంసంపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు వెలువరించిన తీర్పుపై మిశ్రమ స్పందన వచ్చింది. న్యాయం గెలిచింది. సత్యమేవ జయతే అంటూ బీజేపీ, సంఘ్ పరివార్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే...న్యాయ వ్యవస్థలో చీకటి రోజు అంటూఎంఐఎం అధినేత తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకూ బాబ్రీ మసీదు విధ్వంసం వెనుక కుట్ర లేదని కోర్టు తన తీర్పులో తేల్చేసింది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడిందని మాత్రమే భావించాలి. అంతకు మించి లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టు రామజన్మభూమి వివాదాస్పద స్థలానికి సంబంధించిన తీర్పును వెలువరించింది.  ఆ స్థలంలో రామమందిర నిర్మాణ కార్యక్రమాలు కూడా చురుకుగా సాగుతున్నాయి.

వివాదాస్పద స్థలానికి ఆవల మసీదు నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తైపోయింది. ఇప్పుడు దీనితో ముడిపడి ఉన్న బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న 32 మందినీ న్యాయస్థానం నిర్దోషులుగా నిర్ధారించి  తర్పు వెలువరించింది. దీనిపై హర్షం, అసంతృప్తి, మోదం, ఖేదం వంటి వ్యక్తీకరణలు అవసరం లేదు. అయితే నాటి విధ్వంసం, తదననంతర హింసాకాండ మాత్రం దేశ చరిత్రలో రక్తపు చారికల ముద్రలుగా నిలిచిపోతాయి. వాటిని తుడిచేయడానికి వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీం తీర్పు దోహదపడుతుంది. ఇటువంటి సమయంలో విధ్వంసం వెనుక కుట్ర కేసు తీర్పుకు పెద్దగా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే ఇరు పక్షాలతో మాట్లాడి ప్రభుత్వమే ఆ కేసు విత్ డ్రా చేసుకుని ఉండాల్సింది. తీర్పు వెలువడడానికి ముందు రెండు రోజుల నుంచీ దేశ వ్యాప్తంగా ఒక తెలియని ఉత్కంఠ, తీర్పు ఎలా ఉండబోతున్నదన్న ఆసక్తి, వెరసి ఒకనాకొ ప్యానిక్ ఎన్విరాన్ మెంట్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే సున్నిత ప్రాంతాలుగా కేంద్రం భావిస్తున్న ఏరియాలలో పటిష్ట బందోబస్తు, నిషేధాజ్ణలు. మొత్త మీద తీర్పు వెలువడింది. నిందితులెవరూ దోషులు కారనీ, అసలు బాబ్రీ మసీదు విధ్వంసం వెనుక కుట్రేమీ లేదనీ, స్పాంటేనియస్ గా జరిగిపోయిందన్నది తీర్పు సారాంశం. ఇక దీనిపై వివాదాలు వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టేయడమే మంచిదని రాజకీయ పండితులు అంటున్నారు. దశాబ్దాల పాటు దేశంలో మతసామరస్యాన్ని పరీక్షకు పెట్టిన అయోధ్య వివాదం ఇంతటితో పూర్తిగా సమసిపోయిందనీ, అదిక ముగిసిన అంశంమనీ భావించాల్సి ఉంటుంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle