newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఖచ్చితంగా చెబుతున్నా.. బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో అధికారం మాదే.. అమిత్ షా

29-03-202129-03-2021 18:31:09 IST
2021-03-29T13:01:09.726Z29-03-2021 2021-03-29T10:22:18.751Z - - 16-04-2021

ఖచ్చితంగా చెబుతున్నా.. బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో అధికారం మాదే.. అమిత్ షా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమబెంగాల్, అస్సాంలో ఇటీవలే తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సందర్భంగా ఈ తొలి దశ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తామే గెలుపు సాధిస్తామని కేంద్ర హోమంత్రి అమిత్ షా డంకా భజాయించి చెప్పారు. తొలి దశలో పశ్చిమ బెంగాల్‌లో 30 స్థానాలకు, అస్సాంలో 47 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా తొలి దశ ఎన్నికలలో తమ పార్టీ పశ్చిమ బెంగాల్, అస్సాంలో వరుసగా 26, 37 స్థానాలు గెలుచుకుంటుందని షా ధీమా వ్యక్తం చేశారు.

ఈ రెండు రాష్ట్రాల్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక బీజేపీ అంతర్గత గణాంకాల ఆధారంగా విజయం తమదేనని కచ్చితంగా చెప్పగలనని అమిత్ షా పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ప్రకారం 30 స్థానాలకు గాను 26 గెలుచుకుంటాం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అస్సాంలోనూ 47 స్థానాలకు 37 గెలుస్తాం. ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు, అత్యధికంగా నమోదైన పోలింగ్‌ శాతం మాకు పాజిటివ్‌ సంకేతాలు. ఎలక్షన్‌ కమిషన్‌కు కృతజ్ఞతలు అని షా పేర్కొన్నారు. పైగా 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్‌లో 200కు పైగా స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈసారి తమ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. 

బీజేపీ ప్రకటించిన పాజిటివ్‌ ఎజెండాకు మద్దతుగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారని షా వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో మతువాల ఓట్ల కోసమే ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో ఆ వర్గానికి చెందిన ఆలయాన్ని సందర్శించారంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలను హోంమంత్రి తిప్పికొట్టారు. ఆలయాన్ని సందర్శించడానికి, ఎన్నికలకు అసలు సంబంధం లేదన్నారు. భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలు బలపడాలన్నదే ప్రధానమంత్రి లక్ష్యమన్నారు.

బెంగాల్, అస్సాంలో తొలి దశలో భారీగా ఓటింగ్‌ నమోదు కావడం తమకు పూర్తిగా సానుకూల అంశమని అమిత్ షా వ్యాఖ్యానించారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ బెంగాల్‌లో మైనార్టీలను బుజ్జగించే రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అక్రమ వలసదారులను రాష్ట్రంలోకి యథేచ్ఛగా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, అభివృద్ధి ఆగిపోయిందని దుయ్యబట్టారు. అందుకే బెంగాల్‌లో ‘సోనార్‌ బంగ్లా’ అనే ఎజెండాతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకొచ్చారని అన్నారు. 

కాగా తొలిదశలో రాష్ట్రంలో 84 శాతం ఓట్లు పోలయ్యాయంటేనే బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం స్పష్టమైందని ఇటీవలే బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటుడు మిథును చక్రవర్త పేర్కొన్నారు. అత్యధిక ఓటింగ్ అంటేనే అత్యధిక మార్పు అని అర్థమని చెప్పారు. కాగా ఏప్రిన్ 1న బెంగాల్, అస్సాంలలో రెండో దశ పోలింగ్ జరగనుంది.

మీ మైండ్‌ గేమ్స్‌ మావద్ద పనిచేయవు : తృణమూల్ ఎంపీ

తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అని ముందే ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ దెరెక్‌ అపహాస్యం చేశారు. మీ మైండ్ గేమ్స్ ఇక్కడ పనిచేయవు. మీకు వచ్చే సీట్ల గురించిన ముందస్తు అంచనాలను గుజరాత్ లోని జింఖానాలో ప్రయత్నించాలని, ఇది బెంగాల్.. ఇక్కడ మీ ఆటలు చెల్లవని తిప్ప కొట్టారు. శనివారం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో 30కి ముప్పైస్థానాలను తృణమూల్ కాంగ్రెస్సే గెల్చుకుంటుందని పార్టీ ఎంపీ దెరెక్‌ ధీమా వ్యక్తం చేశారు.

 

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   26 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle