newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ

04-03-202104-03-2021 09:57:05 IST
Updated On 04-03-2021 10:01:49 ISTUpdated On 04-03-20212021-03-04T04:27:05.030Z04-03-2021 2021-03-04T04:26:54.250Z - 2021-03-04T04:31:49.012Z - 04-03-2021

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళనాడు రాజకీయాలు సంచలనాలకు కేంద్రం అని పలుమార్లు రుజువైంది. తాజాగా శశికళ తాను రాజకీయాలనుంచే తప్పుకుంటున్నట్లు బాంబు పేల్చి అధికార, ప్రతిపక్షాలకు, రాష్ట్ర ప్రజలకు షాక్ కలిగించారు. నిన్నటిదాకా అన్నాడీఎంకే తమను విలీనం చేసుకోకపోతే నాలుగో కూటమిని ఏర్పర్చి మరీ ఎన్నికల్లోకి దిగుతామని బింకం వహించిన శశికళ ఉన్నట్లుండి ప్లేట్ పిరాయించి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు.

కేవలం 24 గంటల్లోపే శశికళ రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడానికి కారణాలేంటి? శశికళ మాటలనే విందాం. రాష్ట్రంలో పార్టీ అధినేత్రి జయలలిత బంగారు పాలన కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తాననీ, అమ్మ అభిమానులంతా సహోదరుల్లా ఐకమత్యంతో పనిచేసి జయలలిత బంగారు పాలన కొనసాగేలా చూడాలని శశికళ అభ్యర్థించారు. 

రాజకీయాలకు దూరంగా ఉంటాను. నా సోదరి, నేను దైవంగా పరిగణించే పురచ్చితలైవి జయలలిత బంగారు పాలన కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తాను అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 6న జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి శత్రువైన డీఎంకేను ఓడించాలని, డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని ఆమె అభిమానులకు పిలుపునిచ్చారు.

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపుకు కారణమైన శశికళ ప్రకటనకు వెనుక ఏం జరిగి ఉంటుంది. తమిళనాడులో మరి కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ సంచలన నిర్ణయానికి వెనుక చాలా తతంగమే నడిచినట్లు సమాచారం. 

ప్రధానంగా అన్నాడీఎంకేలో కీచులాటలు డీఎంకేకు లాభదాయకమనే కారణంతో ఇరువర్గాలకు రాజీచేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తొలినుంచి తనవంతుగా ప్రయత్నాలు ప్రారంభించారు. దీంట్లో భాగంగానే తమకు 60 సీట్లు కేటాయిస్తే అందులో 50 శాతం శశికళ వర్గానికి ఇస్తామని బీజేపీ బేరం పెట్టింది. అదే జరిగితే పార్టీ పగ్గాలు మెల్లమెల్లగా ఆమె చేతుల్లోకి వెళ్లడం ఖాయమని భావించిన అన్నాడీఎంకే అందుకు ససేమిరా అంది. 

అదే సమయంలో బీజేపీ ద్వారా పొందే సీట్లలో కమలం గుర్తుపై పోటీచేయాలన్న అమిత్‌షా షరతును దినకరన్‌ తోసిపుచ్చారు. అన్నాడీఎంకే అంత అయిష్టతను కనబరుస్తున్నపుడు ఆ కూటమి నుంచి పోటీకై బీజేపీ వద్ద సాగిలపడాల్సిన అవసరం లేదని దినకరన్‌ను శశికళ గట్టిగా మందలించారు. ముఖ్యమంత్రి ఎడపాడి, అసమ్మతి నేత శశికళ తీరుతో అన్నాడీఎంకే–బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన నెలకొంది.

చివరకు శశికళ చేత బీజేపీనే రాజకీయ అస్త్రసన్యాసం చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. అన్నాడీఎంకేలో కుమ్ములాటలు డీఎంకేకు లాభించి అధికారంలోకి వస్తే తమకు నష్టమని బీజేపీ భావించింది. రాజకీయ క్రీడ నుంచి శశికళను డ్రాప్‌ చేయించడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలకుండా కాపాడుకోవచ్చని, డీఎంకే దూకుడుకు కళ్లెం వేయవచ్చని వ్యూహం పన్నింది. 

ఆ తర్వాత వేగంగా మారిన పరిణామాల్లో శశికళ అస్త్రసన్యానం ప్రకటించారు. కానీ శశికళ నిర్ణయం తనకే ఆశ్చర్యం కలిగించిందని టీటీవీ దినకరన్‌ అన్నారు. రాజకీయాల నుంచి వైదొలగినంత మాత్రాన ఆమె వెనకడుగు వేసినట్లు భావించరాదని వ్యాఖ్యానించారు.

శశికళ పాచికలు ఇక పారనట్లేనా?

కొన్ని దశాబ్దాలుగా జయలలిత నెచ్చెలిగా నీడలా వెన్నంటి ఉండి అన్నాడీఎంకే రాజకీయాల్లో శశికళ తనదైన ముద్రవేశారు. పార్టీపై పెత్తనం జయలలితదైనా శశికళకు చెప్పకుండా ఆమె ఏ నిర్ణయం తీసుకునేవారు కాదని ఆపార్టీ నేతలే చెబుతుంటారు. అందుకే అమ్మ మరణం తరువాత శశికళ చిన్నమ్మగా మారారు. ప్రధాన కార్యదర్శిగా మారి పార్టీని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. నాటి సీఎం పన్నీర్‌సెల్వం చేత రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. 

అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు తెరపైకి రావడంతో పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన శశికళ నాలుగేళ్ల శిక్ష అనుభవించి రెండు నెలల క్రితమే విడుదలయ్యారు. తాజా పరిణామాలతో శశికళ ప్రాభవానికి తాత్కాలికంగా అయినా అడ్డుకట్ట పడినట్లేనని చెబుతున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle