ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
23-01-202123-01-2021 15:08:08 IST
Updated On 23-01-2021 12:59:44 ISTUpdated On 23-01-20212021-01-23T09:38:08.438Z23-01-2021 2021-01-23T07:26:02.464Z - 2021-01-23T07:29:44.841Z - 23-01-2021

అన్నా హజారే తెలుసు కదా. ఆయన రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో.. దేశం ఓసారి చూసింది. అన్ని పార్టీలూ మద్దతు తెలుపడంతో పాటు.. తాను చెప్పినట్లు తల ఆడించే పరిస్థితికి తీసుకొస్తారు. మచ్చ లేని మనిషిగా.. ప్రజా హక్కుల కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తిగా తనకు పేరుంది. ఇప్పుడు రైతుల తరపున నేనున్నా అంటున్నారు అన్నాహజారే. రైతు ఉద్యమం ఎన్నాళ్ల నుంచి జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కదా. నెల రోజుల నుంచి ఎటూ తేలడం లేదు. సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వం అన్నీ ఓ లెక్కలో నడుస్తున్నాయి. అయినా రైతులు మాత్రం చట్టాల్ని రద్దు చేసి తీరాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఇన్న మొన్న కూడా అంతా అయిపోయింది అనుకున్నాం. కానీ.. మళ్లీ మొదటి కొచ్చింది ఎవ్వారం. కేంద్రం కమిటీలను కానీ.. సుప్రీం కోర్టు కమిటీలను కానీ.. రైతులు ఒప్పుకోవడం లేదు చట్టాలను రద్దు చేసి తీరాల్సిందే అని పట్టుబడుతున్నారు. మొదట్లో.. పంజాబ్, హర్యానా రైతుల దగ్గరే ఆగిన ఉద్యమం.. తర్వాత తర్వాత.. దేశం మొత్తానికి పాకింది. ఇప్పుడు ఒక్క బీజేపీ తప్ప.. అన్ని పార్టీలూ సపోర్టింగ్ గానే ఉన్నాయి. బీజేపీ కూడా కొన్ని చోట్ల రైతుల్నే సపోర్ట్ చేస్తుంది. పార్టీలా కాకపోయినా.. లీడర్లు జై కొడుతున్నారు. ఇలాంటి టైంలో.. నేనున్నా అంటూ వస్తున్నారు అన్నా హజారే. రైతుల ఉద్యమంలో న్యాయం ఉంది. అందుకే వాళ్ల తరపున నేను కూడా పోరాడతా.. నిరశనకు నేన్ రెడీ అంటున్నారు హక్కుల నేత అన్నాహజారే. ఈ నెల 30 నుంచి నిరశన చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. దీంతో ఇప్పుడు రైతులకి ఇంకాస్త బలం దక్కింది. మచ్చలేని మనిషిగా పేరున్న అన్నాహజారే వస్తే.. ఉద్యమం ఇంకోస్థాయికి చేరుతుంది అనడంలో నో డౌట్. మరి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా.. గాలి వానలా ఉన్న రైతు ఉద్యమాన్ని సునామీలా మారేదాకా చూస్తుందా అన్నది కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది.

కాంగ్రెస్లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
2 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
2 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
4 hours ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
18 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
21 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
21 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
a day ago
ఇంకా